Punjabi language
-
పంజాబీ తప్పుడు భాష.. మాట్లాడొద్దు..!!
లాహోర్: పాకిస్తాన్లోని 30 నగరాల్లో పాఠశాలలను నిర్వహిస్తున్న ఆ దేశ విదేశాంగ శాఖ మాజీ మంత్రి ఖుర్షీద్ మహ్మూద్ కసూరి ఓ వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారు. పంజాబీ తప్పుడు భాష అని పేర్కొంటూ స్కూళ్లలో, బయట ఆ భాషను నిషేధించారు. ఈ మేరకు బెకన్హౌస్ స్కూల్ సిస్టమ్ (బీఎస్ఎస్) ఇటీవల విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ఓ ప్రకటన జారీ చేసింది. విద్వేష ప్రసంగం, ఎగతాళిగా మాట్లాడటం, దూషించడం, పంజాబీ.. తప్పుడు భాష కిందికే వస్తాయని చెప్పింది. -
అమ్మానాన్న... ఓ కల!
కళాకారులకు భాషతో పని లేదు. ఎక్కడ మంచి అవకాశం వస్తే అక్కడ సినిమాలు చేయడమే. కానీ, పరభాషల్లో రాణించి, మాతృభాషలో ఒక్క సినిమా కూడా చేయకపోతే అప్పుడు కొంచెం బాధగానే ఉంటుంది. సొంత భాషలో సినిమా వస్తే, డేట్స్ అడ్జస్ట్ చేసుకుని మరీ చేయాలనుకుంటున్నారు. ప్రస్తుతం తాప్సీ అలానే అనుకుంటున్నారు. పంజాబీ కుటుంబానికి చెందిన ఈ ఢిల్లీ బ్యూటీ తెలుగు, తమిళ, మలయాళాల్లో సినిమాలు చేసి, మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. హిందీలో కూడా తన ప్రతిభ నిరూపించుకున్నారు. ఇక, పంజాబీ భాషలో అవకాశం రావడమే ఆలస్యం. ప్రస్తుతం అక్కడి సినిమాలకు అంతర్జాతీయ స్థాయిలో ఆదరణ లభిస్తోంది. అందుకు ఆనందంగా ఉందని తాప్సీ చెబుతూ - ‘‘పంజాబీ అమ్మాయిని కాబట్టి మా అమ్మా నాన్నలకు నేను ఒక్క పంజాబీ సినిమాలో అయినా నటించాలనేది కల. ఆ కల నెరవేర్చాలని నాకూ ఉంది. ఈ మధ్య కాలంలో కొన్ని కథలు విన్నా. చాలా బాగున్నాయి. ఇప్పటికి నాలుగు భాషల్లో సినిమాలు చేశా. ఇప్పుడు పంజాబీలో కూడా కనిపిస్తే.. నటిగా, అమ్మానాన్నల కల నెరవేర్చిన కూతురిగా ఆనందంగా ఉంటుంది’’ అన్నారు. -
పెళ్లికి వందేళ్లు పడుతుంది!
పెళ్లంటే నూరేళ్ల పంట అంటారు కానీ, పెళ్లి చేసుకోవడానికి వందేళ్లు పడుతుందా? విచిత్రంగా ఉంది కదూ! ఈ విచిత్రం వెనక ఉన్న అసలు రహస్యం ఏంటో తెలియాలంటే.. ‘ఫిల్లౌరి’ చూడాల్సిందే. కథానాయికగా బిజీగా ఉన్న అనుష్కా శర్మ ఆ మధ్య నిర్మాతగా మారి, ‘ఎన్హెచ్ 10’ చిత్రాన్ని నిర్మించిన విషయం తెలిసిందే. నిర్మాతగా తొలి ప్రయత్నంలోనే మంచి విజయాన్ని చవి చూసిన ఈ బ్యూటీ ఆ ఉత్సాహంతో రెండో చిత్రానికి శ్రీకారం చుట్టారు. ఈసారి పంజాబీ భాషలో సినిమా నిర్మిస్తున్నారామె. ఆ చిత్రం పేరు ‘ఫిల్లౌరి’. పంజాబీ నటుడు దల్జిత్ దోసంజ్ హీరోగా రూపొందనున్న ఈ చిత్రంలో అనుష్కా శర్మ నటించనున్నారు. దీని గురించి ఆమె చెబుతూ - ‘‘పంజాబ్లో సాగే ప్రేమకథ ఇది. ఓ అబ్బాయి, అమ్మాయి మధ్య ప్రేమ చిగురించి, అది పెళ్లి దాకా వెళ్లడానికి వందేళ్లు పడుతుంది. అదేంటి అని ఆశ్చర్యపోతున్నారా? అయితే సినిమా వచ్చేంత వరకూ ఆగాల్సిందే. ఈ సినిమా ఆద్యంతం కడుపుబ్బా నవ్విస్తుంది’’ అని చెప్పారు. ఇంతకీ నిజజీవితంలో క్రికెటర్ విరాట్ కోహ్లీని గాఢంగా ప్రేమించిన అనుష్కా శర్మ అతనితో మూడు ముళ్లు వేయించుకుంటారని చాలామంది అనుకున్నారు. ఆ తతంగం జరగకుండానే అతని నుంచి విడిపోయారామె. మరి.. పెళ్లెప్పుడు చేసుకుంటారు? అనే ప్రశ్న అనుష్క ముందుంచితే ‘వందేళ్లు పడుతుంది’ అని సమాధానం చెప్పి, తెలివిగా తప్పించుకుంటారేమో!