పెళ్లికి వందేళ్లు పడుతుంది! | Anushka Sharma’s second outing as producer with ‘Phillauri’ starring Diljit Dosanjh | Sakshi
Sakshi News home page

పెళ్లికి వందేళ్లు పడుతుంది!

Published Mon, Feb 22 2016 11:42 PM | Last Updated on Sun, Sep 3 2017 6:11 PM

పెళ్లికి వందేళ్లు పడుతుంది!

పెళ్లికి వందేళ్లు పడుతుంది!

పెళ్లంటే నూరేళ్ల పంట అంటారు కానీ, పెళ్లి చేసుకోవడానికి వందేళ్లు పడుతుందా? విచిత్రంగా ఉంది కదూ! ఈ విచిత్రం వెనక ఉన్న అసలు రహస్యం ఏంటో తెలియాలంటే.. ‘ఫిల్లౌరి’ చూడాల్సిందే. కథానాయికగా బిజీగా ఉన్న అనుష్కా శర్మ ఆ మధ్య నిర్మాతగా మారి, ‘ఎన్‌హెచ్ 10’ చిత్రాన్ని నిర్మించిన విషయం తెలిసిందే. నిర్మాతగా తొలి ప్రయత్నంలోనే మంచి విజయాన్ని చవి చూసిన ఈ బ్యూటీ ఆ ఉత్సాహంతో రెండో చిత్రానికి శ్రీకారం చుట్టారు. ఈసారి పంజాబీ భాషలో సినిమా నిర్మిస్తున్నారామె. ఆ చిత్రం పేరు ‘ఫిల్లౌరి’.

పంజాబీ నటుడు దల్జిత్ దోసంజ్  హీరోగా రూపొందనున్న ఈ చిత్రంలో అనుష్కా శర్మ నటించనున్నారు. దీని గురించి ఆమె చెబుతూ - ‘‘పంజాబ్‌లో సాగే ప్రేమకథ ఇది. ఓ అబ్బాయి, అమ్మాయి మధ్య ప్రేమ చిగురించి, అది పెళ్లి దాకా వెళ్లడానికి వందేళ్లు పడుతుంది. అదేంటి అని ఆశ్చర్యపోతున్నారా? అయితే సినిమా వచ్చేంత వరకూ ఆగాల్సిందే. ఈ సినిమా ఆద్యంతం కడుపుబ్బా నవ్విస్తుంది’’ అని చెప్పారు.

ఇంతకీ నిజజీవితంలో క్రికెటర్ విరాట్ కోహ్లీని గాఢంగా ప్రేమించిన అనుష్కా శర్మ అతనితో మూడు ముళ్లు వేయించుకుంటారని చాలామంది అనుకున్నారు. ఆ తతంగం జరగకుండానే అతని నుంచి విడిపోయారామె. మరి.. పెళ్లెప్పుడు చేసుకుంటారు? అనే ప్రశ్న అనుష్క ముందుంచితే ‘వందేళ్లు పడుతుంది’ అని సమాధానం చెప్పి, తెలివిగా తప్పించుకుంటారేమో!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement