అమ్మకానికి విరుష్క పెళ్లి ఫొటోలు! | Virat Kohli and Anushka Sharma will sell wedding photos for charity | Sakshi
Sakshi News home page

అమ్మకానికి విరుష్క పెళ్లి ఫొటోలు!

Published Tue, Dec 12 2017 12:38 PM | Last Updated on Wed, Apr 3 2019 6:34 PM

Virat Kohli and Anushka Sharma will sell wedding photos for charity - Sakshi

ముంబై: దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన విరుష్క జంట ఇప్పుడు పెళ్లితో ఒక్కటైంది. భారత క్రికెట్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి సోమవారం బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ అనుష్క శర్మను హిందూ సంప్రదాయం ప్రకారం వివాహమాడాడు. ఇటలీలోని టస్కనీ రిసార్ట్‌లో ఈ పెళ్లి వేడుక జరిగింది. మనోర్‌ హౌజ్‌లోని నాలుగు విల్లాలను ఈ వేడుక కోసం ప్రత్యేకంగా ముస్తాబు చేశారు.  ఇరు కుటుంబాల సభ్యులతో పాటు అత్యంత సన్నిహితులే ఈ పెళ్లికి విచ్చేసి నూతన దంపతుల్ని అశీర్వదించారు.

ఈ విషయాన్ని అధికారికంగా ట్విట్టర్‌ ద్వారా తెలియజేసిన కోహ్లి.. ఇప్పుడు తన పెళ్లికి సంబంధించిన ఫొటోలను అమెరికాకు చెందిన ఓ ప్రముఖ ఫ్యాషన్‌ మ్యాగజైన్‌కు అమ్మకానికి పెట్టారట. అలా ఈ ఫొటోలతో వచ్చిన డబ్బును ఓ ఛారిటీకి విరాళంగా ఇవ్వనున్నారు. ఈ నెల 21న న్యూఢిల్లీలో తమ బంధువుల కోసం, 26న ముంబైలో క్రికెటర్లకు, వివిధ రంగాల్లోని సెలబ్రిటీలకు రిసెప్షన్‌ నిర్వహిస్తారు. ఆ మరుసటి రోజే కోహ్లి జట్టుతో కలిసి దక్షిణాఫ్రికా సిరీస్‌కు బయలుదేరుతాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement