
ఓ పెద్దమనిషి ఆచార్య మాలవ్ భట్.. ఈయన ఇఫ్పూ బట్టూ అనడు. అయామ్ భట్ అంటాడు. ఈయన చెప్పింది జరుగుతుందని జ్యోతిష్యం మీద ఈయనకు పట్టుందని, ఓ టీవీ చానల్ ఈయన్ని తీసుకొచ్చి కూచోబెట్టింది. మనం పెళ్లి చూడలేదు కదా! విరాట్, అనుష్కల కాపురం ఎలా ఉంటుంది అనడిగారట. తగలడుతుంది అన్నాడట. అదేదో గ్రహం అటు చూస్తుందని, ఇదేదో గ్రహం ఇటు చూస్తు్తందని.
వీటివల్ల ఎక్కువకాలం వీరిద్దరూ ఒకరినొకరు చూసుకోరని, పెళ్లి పెటాకులవుతుందని, సంసారంలో ఎటాకులుంటాయనీ, నోటి కొచ్చినట్టు కూశాడట. దాంతో ఫ్యాన్లంతా సెంటిమెంటల్‌గా ఫీలయిపోతున్నారు. జ్యోతిష్యం అన్నది గొడుగులాంటిది, వానపడుతుందని చెబితే మనం గొడుగు తీసుకెళ్లాలి అంతే కానీ, జ్యోతిష్యం ఎలా చెబుతుందో అలాగే జరుగుతుందని అనుకోవడం మన బలహీనత అవుతుంది. జ్యోతిష్యం కష్టాలు సూచించినప్పుడు ఆ కష్టాలని ఎదుర్కొనే శక్తి మనం పెంచుకోవాలి. విరాట్.. కొడితే కొట్టాలయ్యా సిక్సు కొట్టాలీ. అడ్డం వచ్చిన గ్రహాన్ని సిక్సు కొట్టాలి. అనుష్క ప్రేమను క్యాచ్ పట్టాలి.
Comments
Please login to add a commentAdd a comment