వచ్చే వారం విరుష్కల పెళ్లి..! | Virat Kohli and Anushka Sharma to get married in Italy next week: Sources | Sakshi
Sakshi News home page

వచ్చే వారం విరుష్కల పెళ్లి..!

Published Wed, Dec 6 2017 6:05 PM | Last Updated on Wed, Dec 6 2017 6:05 PM

Virat Kohli and Anushka Sharma to get married in Italy next week: Sources - Sakshi

విరాట్‌ కొహ్లీతో అనుష్క శర్మ (ఫైల్‌ ఫొటో)

న్యూఢిల్లీ : ప్రేమ పక్షులు విరాట్‌ కొహ్లీ, అనుష్క శర్మలు వచ్చే వారం పెళ్లి పీటలు ఎక్కనున్నట్లు రిపోర్టులు వస్తున్నాయి. ఈ నెల 9, 10, 11, 12 తేదీల్లో ఏదో ఒక రోజు ఇరువురు వివాహబంధంతో ఒక్కటవనున్నట్లు తెలిసింది. సంప్రదాయబద్దంగా అనుష్క చేతిని అందుకునేందుకు గురువారం కొహ్లీ ఇటలీ వెళ్లబోతున్నట్లు సమాచారం.

అనుష్క శర్మ పెళ్లి దుస్తులను సబ్యసాచి ముఖర్జీ డిజైన్‌ చేస్తున్నట్లు తెలిసింది. గత వారం సబ్యసాచి అనుష్క ఇంటి వద్ద కనిపించడంతో పెళ్లి దుస్తుల డిజైన్‌ కోసమే ఆయన వచ్చినట్లు రిపోర్టులు చెబుతున్నాయి. ఇప్పటికే విరాట్‌, అనుష్కల కుటుంబసభ్యులు పెళ్లి వేడుక కోసం ఇటలీలోని మిలన్‌లో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిసింది.  

అయితే, పెళ్లికి విరాట్‌ క్రికెటర్లను ఆహ్వానించలేదని సమాచారం. ఈ నెల 21వ తేదీన స్నేహితులను, బంధువులను ఆహ్వానించి ముంబైలో గ్రాండ్‌ రిసెప్షన్‌ నిర్వహించాలని భావిస్తున్నట్లు తెలిసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement