కోహ్లి ఇక వైస్‌ కెప్టెన్‌..! | Virat Kohli to become the vice captain! | Sakshi
Sakshi News home page

కోహ్లి ఇక వైస్‌ కెప్టెన్‌..!

Published Fri, Dec 15 2017 10:57 AM | Last Updated on Fri, Dec 15 2017 10:57 AM

Virat Kohli to become the vice captain! - Sakshi

న్యూఢిల్లీ: ఇటీవల భారత క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, బాలీవుడ్‌ నటి అనుష్క శర్మలు పెళ్లి బంధంతో ఒక్కటైన సంగతి  తెలిసిందే. ఏళ్లుగా ప్రేమలో మునిగి తేలిన ఈ జంట గత కొన్ని రోజుల క్రితం  ఇట‌లీలోని ట‌స్క‌నీలో కుటుంబ స‌భ్యులు, స‌న్నిహితుల మ‌ధ్య వివాహం చేసుకున్నారు. దీన్ని పురస్కరించుకుని ఈ సెలబ్రెటీ జోడికి పలువురు శుభాకాంక్షలు కూడా తెలియజేశారు. ఇలా విషెస్‌ చెప్పిన వారిలో క్రీడా ప్రముఖలతో పాటు, బాలీవుడ్‌ స్టార్లు కూడా ఉన్నారు.

అయితే  విరుష్కల పెళ్లిపై హీరోయిన్ జెనీలియా భ‌ర్త‌, బాలీవుడ్ హీరో రితేష్ దేశ్‌ముఖ్ తనదైన శుభాకాంక్షలు తెలియజేశారు. ' టీమిండియా కెప్టెన్ ఇక‌పై వైస్‌ కెప్టెనే‌. పెళ్లి త‌ర్వాత అనుష్క‌కి కెప్టెన్సీ వ‌చ్చింది. కొత్త జంట‌కు శుభాకాంక్ష‌లు` అని రితేష్ ట్వీట్ చేశాడు. వీరి జీవితం మరింత ఆనందమయం కావాలని రితేష్‌ ఆకాంక్షించాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement