Phillauri
-
షాక్ ఇస్తోన్న అనుష్క లుక్..!
బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ కొత్త సినిమా షూటింగ్ ఈ రోజు ప్రారంభమవుతోంది. పారి పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాతో ప్రోసిత్ రాయ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ముంబై, కోల్‌కతాలలో షూటింగ్‌ను ప్లాన్ చేస్తున్నారు. సాధారణంగా పారి అంటూ డిస్నీ వారి కార్టూన్ క్యారెక్టర్ గుర్తుకు వస్తుంది. పెద్ద కళ్లు, చుట్టూ మెరుపులతో ఉంటే యువరాణి పారి. కానీ అనుష్క శర్మ పారి మాత్రం పూర్తి భిన్నంగా ఉంది. భయానకంగా ఉన్న అనుష్క లుక్స్ పై ప్రశంసలు జల్లు కురుస్తోంది. తాను స్వయంగా నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో మరోసారి చాలెంజింగ్ రోల్లో అలరించనుంది అనుష్క. ఇప్పటికే ఎన్‌హెచ్ 10, ఫిల్లౌరి లాంటి విభిన్న చిత్రాలతో నిర్మాతగానూ ఆకట్టుకున్న అనుష్క శర్మ, మరో డిఫరెంట్ సినిమాతో ఆడియన్స్ ముందుకు వస్తోంది. Pari...First Look @OfficialCSFilms @kriarj @paramspeak #PariFirstLook pic.twitter.com/GvO6YfjIjz — Anushka Sharma (@AnushkaSharma) 13 June 2017 -
‘మనసు మాటే వింటా.. ఏం పట్టించుకోను’
ముంబయి: ఎవరు ఎలాంటి మాటలు అన్నా పట్టించుకోనని, అవి తనను ప్రభావితం చేయలేనని ప్రముఖ బాలీవుడ్ నటి అనుష్క శర్మ చెప్పింది. ప్రస్తుతం పిల్లౌరి అనే చిత్రంలో నటించిన త్వరలో ఆ చిత్ర విడుదల నేపథ్యంలో తనను ప్రశ్నించిన మీడియాతో మాట్లాడారు. తన మనసు ఏం చెబితే అదే చేస్తానని, తాను ఏదీ సరైనదని భావిస్తానో అదే చేస్తానని చెప్పుకొచ్చింది. గతంలో ఎన్‌హెచ్ 10 అనే చిత్రానికి నిర్మాతగా వ్యవహరించిన అనుష్క ప్రస్తుతం పిల్లౌరి చిత్రానికి కూడా నిర్మాతగా ఉన్నారు. ‘నాకు 25 ఏళ్లప్పుడే(ప్రస్తుతం 28) నేను నిర్మాతనవ్వాలనుకున్నాను. కానీ అందరూ నాకేమన్నా పిచ్చా అని అనుకున్నారు. నటిగా మంచి జీవితం ఉండగా ప్రొడక్షన్ వైపు ఎందుకని అన్నారు. నిర్మాతగా మారిన తర్వాత నటించడానికి పెద్దగా ఏముండదని చాలామంది అభిప్రాయం. కానీ నేను మాత్రం అదంతూ స్టుపిడ్ ఆలోచన అంటాను. నేను ఏమనుకుంటానో అదే చేస్తాను. నాకు భయం అంత తేలికగా రాదు. నేను అది సరైనది నమ్మానో చేసేస్తాను. నా నిర్ణయాన్ని గురించి ఇతరులు ఏమనుకుంటున్నారనే విషయాన్ని గురించి అస్సలు ఆలోచించను’ అని చెప్పుకొచ్చిందీ బాలీవుడ్ సుందరి. -
దెయ్యాన్ని పెళ్లి చేసుకుంటే.. ఏమవుతుంది!
సూరజ్ శర్మకు 'మంగళదోషం' ఉంటుంది. కాబట్టి ఓ చెట్టును పెళ్లి చేసుకోమని చెప్తారు. ఇలా చెట్టును పెళ్లి చేసుకోవడం వల్ల అతని కష్టాలు తీరడం సంగతి అటుంచి.. కొత్త కష్టాలు మొదలవుతాయి. అయిష్టంగానే చెట్టును పెళ్లి చేసుకున్న సూరజ్‌ను ఓ దెయ్యం వెంటాడటం మొదలుపెడుతుంది. ఆ దెయ్యం పేరు శశి. తాను నివసిస్తున్న చెట్టును నువ్వు పెళ్లి చేసుకున్నావు కాబట్టి.. నువ్వు నా భర్తవని సూరజ్‌ను వెంటాడి వేధిస్తూ ఉంటుంది ఆ దెయ్యం. ఆ మంచి దెయ్యం ఎందుకు సూరజ్ వెంటపడింది. ఆమె మరణం వెనుక ఉన్న కన్నీటి కథ ఏమిటి? ఇవన్నీ తెలుసుకోవాలంటే.. అనుష్క శర్మ తాజాగా నటిస్తున్న పిల్లౌరి సినిమా చూడాల్సిందే. గతంలో 'ఎన్‌హెచ్10' సినిమా నిర్మించిన అనుష్క.. తాజా సినిమాకు సహా నిర్మాతగా వ్యవహరిస్తోంది. ఈ సినిమాలో ఫ్రెండ్లీ ఘోష్ట్‌గా అనుష్క నటిస్తుండగా.. ఆమె వల్ల చిక్కులు ఎదుర్కొనే సూర్గా దిల్జిత్ దోసాంజ్ నటిస్తున్నాడు. అన్షాయ్ లాల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ తాజాగా విడుదలైంది. 2 నిమిషాల 55 సెకన్ల నిడివిగల ఈ ట్రైలర్ చాలా గ్రిప్పింగ్‌గా, కొత్తగా ఉండి వీక్షకులను ఆకట్టుకుంటోంది. మీరు ఓ లుక్ వేయండి.. -
పెళ్లికి వందేళ్లు పడుతుంది!
పెళ్లంటే నూరేళ్ల పంట అంటారు కానీ, పెళ్లి చేసుకోవడానికి వందేళ్లు పడుతుందా? విచిత్రంగా ఉంది కదూ! ఈ విచిత్రం వెనక ఉన్న అసలు రహస్యం ఏంటో తెలియాలంటే.. ‘ఫిల్లౌరి’ చూడాల్సిందే. కథానాయికగా బిజీగా ఉన్న అనుష్కా శర్మ ఆ మధ్య నిర్మాతగా మారి, ‘ఎన్‌హెచ్ 10’ చిత్రాన్ని నిర్మించిన విషయం తెలిసిందే. నిర్మాతగా తొలి ప్రయత్నంలోనే మంచి విజయాన్ని చవి చూసిన ఈ బ్యూటీ ఆ ఉత్సాహంతో రెండో చిత్రానికి శ్రీకారం చుట్టారు. ఈసారి పంజాబీ భాషలో సినిమా నిర్మిస్తున్నారామె. ఆ చిత్రం పేరు ‘ఫిల్లౌరి’. పంజాబీ నటుడు దల్జిత్ దోసంజ్ హీరోగా రూపొందనున్న ఈ చిత్రంలో అనుష్కా శర్మ నటించనున్నారు. దీని గురించి ఆమె చెబుతూ - ‘‘పంజాబ్‌లో సాగే ప్రేమకథ ఇది. ఓ అబ్బాయి, అమ్మాయి మధ్య ప్రేమ చిగురించి, అది పెళ్లి దాకా వెళ్లడానికి వందేళ్లు పడుతుంది. అదేంటి అని ఆశ్చర్యపోతున్నారా? అయితే సినిమా వచ్చేంత వరకూ ఆగాల్సిందే. ఈ సినిమా ఆద్యంతం కడుపుబ్బా నవ్విస్తుంది’’ అని చెప్పారు. ఇంతకీ నిజజీవితంలో క్రికెటర్ విరాట్ కోహ్లీని గాఢంగా ప్రేమించిన అనుష్కా శర్మ అతనితో మూడు ముళ్లు వేయించుకుంటారని చాలామంది అనుకున్నారు. ఆ తతంగం జరగకుండానే అతని నుంచి విడిపోయారామె. మరి.. పెళ్లెప్పుడు చేసుకుంటారు? అనే ప్రశ్న అనుష్క ముందుంచితే ‘వందేళ్లు పడుతుంది’ అని సమాధానం చెప్పి, తెలివిగా తప్పించుకుంటారేమో!