‘మనసు మాటే వింటా.. ఏం పట్టించుకోను’
ముంబయి: ఎవరు ఎలాంటి మాటలు అన్నా పట్టించుకోనని, అవి తనను ప్రభావితం చేయలేనని ప్రముఖ బాలీవుడ్ నటి అనుష్క శర్మ చెప్పింది. ప్రస్తుతం పిల్లౌరి అనే చిత్రంలో నటించిన త్వరలో ఆ చిత్ర విడుదల నేపథ్యంలో తనను ప్రశ్నించిన మీడియాతో మాట్లాడారు. తన మనసు ఏం చెబితే అదే చేస్తానని, తాను ఏదీ సరైనదని భావిస్తానో అదే చేస్తానని చెప్పుకొచ్చింది. గతంలో ఎన్‌హెచ్ 10 అనే చిత్రానికి నిర్మాతగా వ్యవహరించిన అనుష్క ప్రస్తుతం పిల్లౌరి చిత్రానికి కూడా నిర్మాతగా ఉన్నారు.
‘నాకు 25 ఏళ్లప్పుడే(ప్రస్తుతం 28) నేను నిర్మాతనవ్వాలనుకున్నాను. కానీ అందరూ నాకేమన్నా పిచ్చా అని అనుకున్నారు. నటిగా మంచి జీవితం ఉండగా ప్రొడక్షన్ వైపు ఎందుకని అన్నారు. నిర్మాతగా మారిన తర్వాత నటించడానికి పెద్దగా ఏముండదని చాలామంది అభిప్రాయం. కానీ నేను మాత్రం అదంతూ స్టుపిడ్ ఆలోచన అంటాను. నేను ఏమనుకుంటానో అదే చేస్తాను. నాకు భయం అంత తేలికగా రాదు. నేను అది సరైనది నమ్మానో చేసేస్తాను. నా నిర్ణయాన్ని గురించి ఇతరులు ఏమనుకుంటున్నారనే విషయాన్ని గురించి అస్సలు ఆలోచించను’ అని చెప్పుకొచ్చిందీ బాలీవుడ్ సుందరి.