
వరుణ్ ధావన్, అనుష్కా శర్మ
ఇక్కడున్న ఫొటోను చూసి అనుష్కా శర్మతో ఉన్న ఈ కొత్త ‘హీరో’యిన్ ఎవరు? ఈమె అనుష్కా శర్మకు ఏమౌతారు? అనే ఆలోచనలను పక్కనపెట్టండి. ఎందుకంటే ఫొటోలో ఉన్నది అసలు హీరోయిన్ కాదు హీరో వరుణ్ ధావన్. శరత్ కటారియా దర్శకత్వంలో వరుణ్ ధావన్, అనుష్కా శర్మ జంటగా నటించిన సినిమా ‘సూయి ధాగా’. ‘మేడియన్ ఇండియా’ అనేది క్యాప్షన్. మౌజీ పాత్రలో వరుణ్, మమత పాత్రలో అనుష్కా శర్మ నటించారు. ఈ చిత్రం సెప్టెంబర్‌లో రిలీజ్ కానుంది. మూవీ ప్రమోషన్‌లో భాగంగా వరుణ్ ధావన్ ఇలా చీర కట్టుకున్నారు. నిశితంగా పరిశీలిస్తేనే ఫొటోలో ఉన్నది వరుణ్ ధావన్ అని అర్థం కాదు కదూ!
Comments
Please login to add a commentAdd a comment