
ఈ వారం యూట్యూబ్ హిట్స్
పింక్ : అఫీషియల్ ట్రైలర్z
నిడివి : 2 ని. 26 సె. హిట్స్ : 64,38,142
‘‘ఆర్యూ ఎ వర్జిన్ మిస్ అరోరా?’’ అమితాబ్ అడిగాడు. కోర్టు బోనులో ఉంది తాప్సీ. నో.. నేను వర్జిన్‌ని కాదు అన్నట్టు తల ఊపింది. ‘‘అవునో, కాదో నోటితో చెప్పండి. అలా తల ఊపొద్దు’’ అన్నాడు అమితాబ్. సెక్షన్ 307 కింద అరెస్ట్ అయింది తాప్సీ. అటెంప్ట్ టు మర్డర్! అమితాబ్ అడుగుతున్నాడు. ‘‘అసలు ఆ రాత్రి ఏం జరిగిందో చెప్పు. నీకూ, రాజ్‌వీర్‌కి మధ్య?’’ చెప్తోంది తాప్సీ. వాయిదాలు నడుస్తున్నాయి. అమితాబ్ నమ్ముతున్నాడు. నమ్మడు. నమ్ముతున్నాడు.
నమ్మడు. ఆ లాయర్‌కి బై పోలార్ డిజార్డర్. మూడ్స్ అప్పటికప్పుడు మారిపోతుంటాయి. తను వాదిస్తున్నది తాప్సీ కోసం, ఆమె ఇద్దరు స్నేహితురాళ్ల కోసం అని మర్చిపోయి వాదిస్తుంటారు. చివరికి ఏం జరుగుతుంది? అది సినిమాలో చూడండి. ఇప్పటికైతే ఏం జరిగిందన్నది ఈ యూట్యూబ్‌లో చూడండి. ‘పికు’, ‘వికీ డోనార్’ చిత్రాలను డెరైక్ట్ చేసిన షూజిత్ సర్కార్ చేయి ‘పింక్’లోనూ ఉంది. కానీ నిర్మాతగా. సెప్టెంబర్ 16 మూవీ రిలీజ్ అవుతోంది.