షార్ట్ ఫిల్మ్‌లో తాప్సీ! | Tapsi act to short film | Sakshi
Sakshi News home page

షార్ట్ ఫిల్మ్‌లో తాప్సీ!

Published Sat, Aug 1 2015 11:38 PM | Last Updated on Sun, Sep 3 2017 6:35 AM

షార్ట్ ఫిల్మ్‌లో తాప్సీ!

షార్ట్ ఫిల్మ్‌లో తాప్సీ!

కథానాయికలు లఘు చిత్రాల్లోనటించడం అనేది ఇప్పుడో ట్రెండ్ అయిపోయేటట్టు కనిపిస్తోంది. ఇటీవలే రాధికా ఆప్టే ‘అహల్య’ అనే లఘు చిత్రంలో నటించారు. ఆ లఘు చిత్రం యూ ట్యూబ్‌లో భారీ హిట్లు సాధించి, సంచలనం సృష్టించింది. ఇప్పుడు ఆ జాబితాలో తాప్సీ కూడా చేరనున్నారు.
 
 ఆమె ఓ హిందీ లఘు చిత్రంలో నటించడానికి పచ్చజెండా ఊపారు. ‘పాన్‌సింగ్ తోమర్’, ‘బుల్లెట్ రాజా’ చిత్రాల దర్శకుడు తిగ్మాంషు దూలియా ఇటీవల ఆమెను కలిసి, ఓ లఘు ప్రేమకథా చిత్రంలో నటించమని అడిగారు. ఈ కథ నచ్చి. తాప్సీ నటించడానికి అంగీకరించారు.
 
 దీని గురించి తాప్సీ చెబుతూ- ‘‘తిగ్మాంషుతో వర్క్ చేయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నా. అందుకే ఆయన ఈ లఘు చిత్రకథ గురించి చెప్పగానే వెంటనే ఒప్పేసుకున్నా. కథ కూడా చాలా బాగుంది’’ అని తెలిపారు. ముంబయ్ పరిసర ప్రాంతాల్లో వారం రోజుల పాటు ఈ లఘు చిత్రానికి సంబంధించిన చిత్రీకరణ జరపనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement