తాప్సీ సరికొత్త బిజినెస్!
‘సన్నాఫ్ సత్యమూరి’్తలో అల్లు అర్జున్ వెడ్డింగ్ ప్లానర్‌గా నటించారు. కానీ అందాల కథానాయిక తాప్సీ మాత్రం తన నిజజీవితంలోనే వెడ్డింగ్ ప్లానర్ పాత్ర పోషిస్తున్నారు. ఇటీవలే తన స్నేహితులతో కలిసి ‘ద వెడ్డింగ్ ఫ్యాక్టరీ’ని ప్రారంభించారు తాప్సీ. ఆ సంస్థ పక్షాన మొదటి వేడుకను కూడా ఇటీవలే నిర్వహించారు. హీరోయిన్‌గా ఒకవైపు, వెడ్డింగ్ ప్లానర్‌గా మరో వైపు రెండు బాధ్యతలు నిర్వహిస్తున్న తాప్సీ ఆ విశేషాలు చెబుతూ - ‘‘సినిమాలకు ఏ మాత్రం సంబంధం లేని వ్యాపార రంగంలోకి దిగడం చాలా ఆనందంగా ఉంది.
నటిగానే కాకుండా వేరే రంగంలో కూడా నాకంటూ గుర్తింపు తెచ్చు కోవాలనుకున్నాను. సినిమాల్లో అవకాశాలు తగ్గిపోవడంతో ఇలా వ్యాపారం లోకి అడుగు పెట్టానని చాలామంది అనుకుంటు న్నారు. కానీ, అందులో వాస్తవం లేదు. నాకిప్పుడు అవకాశాలకు కొదవ లేదు. కేవలం నా సృజనాత్మకతను మరో రంగంలో చూపించాలనేదే నా ప్రయత్నం’’ అన్నారు.