
రెండో ఇల్లు
ఆల్రెడీ తాప్సీకి ముంబైలో ఓ సొంత ఫ్లాట్ ఉంది. ఇప్పుడు తాజాగా అంధేరీలోని ఓషివారాలో కొత్తగా కట్టిన అపార్ట్‌మెంట్‌లో ఇంకో ఫ్లాట్ కొన్నారు. వచ్చే ఏడాది ఈ కొత్త ఇంట్లో అడుగుపెడతారట. ఇంతకీ ఈ ఢిల్లీ బ్యూటీకి ముంబైలో రెండు ఇళ్లు ఎందుకు? అన్నది కొంతమంది సందేహం. మరేం లేదు. హిందీలో తాప్సీకి మంచి ఛాన్సులొస్తున్నాయి. దాంతో ముంబైలో సెటిల్ కావాలనుకున్నారట. చిన్న ఇంట్లో సర్దుకుపోవడం ఎందుకని పెద్ద ఫ్లాట్ కొన్నారట.