టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఇంగ్లండ్‌తో జరిగిన రీషెడ్యూల్ టెస్టులో సెంచరీతో చెలరేగిన పంత్.. వన్డే సిరీస్‌లో కూడా తన దూకుడును కొనసాగించిన సంగతి తెలిసిందే. సిరీస్‌ను నిర్ణయించే అఖరి వన్డేలో పంత్ తన అద్భుతమైన ఇన్నింగ్స్‌తో జట్టును గెలిపించాడు. ఈ మ్యాచ్‌లో 125 పరుగులతో ఆజేయంగా నిలిచిన పంత్.. భారత్ సిరీస్‌ను సొంతం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. కాగా అఖరి వన్డేలో అద్భుతమైన సెంచరీ సాధించిన పంత్‌పై ఇప్పటికీ ప్రశంసల వర్షం కురుస్తోంది.
ఈ క్రమంలో భారత మాజీ క్రికెటర్ అరుణ్ లాల్ ఆసక్తికర వాఖ్యలు చేశాడు. రోహిత్ శర్మ తర్వాత టీమిండియా కెప్టెన్సీ బాధ్యతలను రిషబ్ పంత్ చేపట్టాలని అరుణ్ లాల్ అభిప్రాయపడ్డాడు. కాగా రోహిత్ శర్మ తర్వాత టీమిండియా కెప్టెన్సీ రేసులో చాలా మంది పోటీదారులు ఉన్నారు. వారిలో పంత్ ఒకడు. కేఎల్ రాహుల్ గాయపడడంతో స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్‌కు భారత కెప్టెన్‌గా పంత్ బాధ్యతలు నిర్వహించాడు. ఈ సిరీస్‌ను 2-2తో పంత్ ముగించాడు.
"రోహిత్ శర్మ తర్వాత భారత జట్టుకు కాబోయే కెప్టెన్ ఎవరని అని నన్ను అడిగితే నేను మాత్రం రిషబ్ పంత్ అనే చెప్పుతాను. జట్టులో టాప్ త్రీ లో ఉన్న ఆటగాళ్లే కెప్టెన్ పదవికు అర్హులని నేను ఎప్పుడూ భావిస్తాను. పంత్ ఎటువంటి భయం లేకుండా ఆడుతాడు. అతడు ఎటువంటి ఒత్తిడికి లోనవ్వకుండా తన పని తను చేసుకుపోతాడు. కఠినమైన పరిస్థితులలో కూడా జట్టును ముందుండి నడిపించగలడు. కాబట్టి అటువంటి అద్భుతమైన ఆటగాడికి నాయకుడిగా ఉండే ఆర్హత ఉంది. పంత్ లాంటి దూకుడు ఉన్న ఆటగాడు కెప్టెన్‌గా ఉంటే భారత క్రికెట్‌కు మంచి జరుగుతోంది.
ఒకప్పుడు టెస్ట్ క్రికెట్‌లో టీమిండియా డ్రా కోసం ప్రయత్నించేది. కానీ ఈ ఆలోచన ఇప్పుడు మారిపోయింది. దీనికి కారణం విరాట్ కోహ్లి. కోహ్లి కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాక.. జట్టు డ్రా కోసం కాకుండా గెలుపు కోసం ఆడేలా ప్రేరేపించేవాడు. టెస్టుల్లో కూడా దూకుడుగా ఆడే విధానాన్ని విరాట్ తీసుకువచ్చాడు. ఇప్పుడు అదే పంథాలో రిషబ్ కొనసాగుతున్నాడు. పంత్ ఇదే దూకుడును కొనసాగిస్తే ఖచ్చింతగా భారత జట్టుకు హీరో అవుతాడు" అని అరుణ్ లాల్ పేర్కొన్నాడు.
చదవండి: Eng Vs SA 1st ODI Series 2022: అదరగొట్టిన ప్రొటిస్ బౌలర్లు.. ఇంగ్లండ్‌పై దక్షిణాఫ్రికా ఘన విజయం! ఏకంగా..
Comments
Please login to add a commentAdd a comment