
భారత మాజీ క్రికెటర్ అరుణ్ లాల్, బుల్బుల్ సాహా వివాహ బంధంతో ఒక్కటయ్యారు. మే 2 (సోమవారం) కోల్‌కతాలోని పీర్లెస్ ఇన్‌లో వీరి వివాహం జరిగింది. అతి తక్కువ మంది అతిథుల సమక్షంలో వీరి పెళ్లి జరిగింది. ఇక ఈ జంట పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా 66 ఏళ్ల వయస్సులో అరుణ్ లాల్ రెండో పెళ్లి చేసుకున్నాడు.
లాల్ తన మొదటి భార్య రీనా అంగీకారంతోనే బుల్బుల్ సాహాను పెళ్లి చెసుకున్నట్లు తెలుస్తోంది. ఆమె లాల్ కంటే 28 ఏళ్ల చిన్నది. ఇక అరుణ్ లాల్ ప్రస్తుతం బెంగాల్ జట్టుకు హెడ్ కోచ్‌గా ఉన్నాడు. లాల్ భారత్ తరఫున 1982-89 మధ్యకాలంలో 16 టెస్టులు, 16 వన్డేలు ఆడాడు. ఇక ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 156 మ్యాచ్‌లు ఆడిన లాల్.. 30 సెంచరీలతో సహా 10421 పరుగులు సాధించాడు.
చదవండి: IPL 2022: ప్లే ఆఫ్ రేసులో నిలిచిన కేకేఆర్.. రాజస్తాన్‌పై ఘన విజయం
Comments
Please login to add a commentAdd a comment