Bengal team
-
షమీ పునరాగమనం
కోల్‌కతా: టీమిండియా సీనియర్ పేసర్ మొహమ్మద్ షమీ పునరాగమనానికి సిద్ధమయ్యాడు. గత ఏడాది వన్డే ప్రపంచకప్ తర్వాత గాయం కారణంగా జట్టుకు దూరమైన షమీ... శస్త్రచికిత్స అనంతరం తిరిగి కోలుకొని దేశవాళీ మ్యాచ్‌లు ఆడేందుకు రెడీ అయ్యాడు. రంజీ ట్రోఫీలో భాగంగా బుధవారం నుంచి మధ్యప్రదేశ్‌తో జరగనున్న మ్యాచ్‌లో షమీ బెంగాల్ జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నాడు. ఈ మేరకు బెంగాల్ క్రికెట్ సంఘం మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. స్వదేశంలో జరిగిన 2023 వన్డే వరల్డ్‌కప్‌లో 7 మ్యాచ్‌ల్లో 24 వికెట్లు తీసి అదరగొట్టిన షమీ... ఆ తర్వాత గాయం కారణంగా మైదానానికి దూరమయ్యాడు. కాలి మడమకు శస్త్రచికిత్స చేయించుకున్న షమీ... ఇప్పుడు పూర్తిస్థాయిలో కోలుకున్నాడు. ఈ నెల 22 నుంచి ప్రారంభం కానున్న ఆ్రస్టేలియా పర్యటన వరకు అతడు కోలుకుంటాడనుకుంటే అది సాధ్యపడలేదు. ప్రస్తుతం బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో రీహాబిలిటేషన్‌లో ఉన్న షమీ మ్యాచ్ ఫిట్నెస్ సాధించాడు. ‘భారత క్రికెట్ జట్టుతో పాటు, బెంగాల్ రంజీ టీమ్‌కు శుభవార్త. స్టార్ పేసర్ మొహమ్మద్ షమీ గాయం నుంచి పూర్తిగా కోలుకున్నాడు. మధ్యప్రదేశ్‌తో రంజీ మ్యాచ్‌లో షమీ బెంగాల్ జట్టు తరఫున ఆడతాడు’అని బెంగాల్ క్రికెట్ సంఘం కార్యదర్శి నరేశ్ ఓజా తెలిపాడు. షమీ ఫిట్నెస్ సాధించకపోవడంతో బీసీసీఐ సెలెక్షన్ కమిటీ అతడిని ఆస్ట్రేలియాతో జరిగే ఐదు టెస్టుల ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’ కోసం ఎంపిక చేయలేదు. జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ సిరాజ్, ఆకాశ్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా, నితీశ్ కుమార్ రెడ్డి, ప్రసిద్ధ్ కృష్ణను ఆ్రస్టేలియాతో సిరీస్‌కు ఎంపిక చేసిన బోర్డు... ముకేశ్ కుమార్, నవ్‌దీప్ సైనీ, ఖలీల్ అహ్మద్‌ను ట్రావెలింగ్ రిజర్వ్‌లుగా ప్రకటించింది. జట్టును ప్రకటించిన సమయంలో రోహిత్ మాట్లాడుతూ... పూర్తి ఫిట్నెస్ సాధించని షమీతో ప్రయోగాలు చేయబోమని ప్రకటించాడు. -
టీమిండియాకు గుడ్‌న్యూస్
టీమిండియా సీనియర్ క్రికెటర్ మహ్మద్ షమీ పునరాగమనానికి ముహూర్తం ఖరారైంది. దాదాపు ఏడాది తర్వాత ఈ పేస్ బౌలర్ కాంపిటేటివ్ క్రికెట్ ఆడేందుకు సిద్ధమయ్యాడు. ఈ విషయాన్ని బెంగాల్ క్రికెట్ అసోసియేషన్(CAB) ధ్రువీకరించింది. కాగా వన్డే వరల్డ్‌కప్-2023లో అత్యధిక వికెట్ల వీరుడిగా నిలిచాడు షమీ.చీలమండ గాయానికి శస్త్ర చికిత్సఈ ఐసీసీ టోర్నీలో ఆలస్యంగా ఎంట్రీ ఇచ్చినా 24 వికెట్లు కూల్చి.. టీమిండియా ఫైనల్ చేరడంలో తన వంతు పాత్ర పోషించాడు. అయితే, అప్పటికే గాయం వేధిస్తున్నా పంటి బిగువన నొప్పిని భరించిన ఈ బెంగాల్ పేసర్... ఈ ఈవెంట్ తర్వాత చీలమండ గాయానికి శస్త్ర చికిత్స చేయించుకున్నాడు.ఆ మ్యాచ్‌తో రీ ఎంట్రీఈ క్రమంలో జాతీయ క్రికెట్ అకాడమీలో పునరావాసం పొందిన షమీ.. రీ ఎంట్రీ ఎప్పటికపుడు వాయిదా పడింది. అయితే, బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ వర్గాలు జాతీయ మీడియాకు అందించిన తాజా సమాచారం ప్రకారం.. షమీ మ్యాచ్ ఫిట్నెస్ సాధించాడు. రంజీ ట్రోఫీ 2024-25 తాజా ఎడిషన్‌లో భాగంగా మధ్యప్రదేశ్‌తో బెంగాల్ ఆడబోయే మ్యాచ్‌తో షమీ కాంపిటేటివ్ క్రికెట్లో రీఎంట్రీ ఇవ్వనున్నాడు.రంజీ ఎలైట్ గ్రూప్-‘సి’లో భాగంగా బెంగాల్- మధ్యప్రదేశ్ మధ్య ఇండోర్ వేదికగా బుధవారం(నవంబరు 13) ఈ మ్యాచ్ ఆరంభం కానుంది. ఇక షమీ రాక గురించి బెంగాల్ అసోసియేషన్ వర్గాలు మాట్లాడుతూ.. షమీ వల్ల తమ పేస్ బౌలింగ్ అటాక్ మరింత పటిష్టమవుతుందని హర్షం వ్యక్తం చేశాయి. అతడి రాకతో జట్టులో కొత్త ఉత్సాహం నిండిందని... గొప్పగా రాణించే అవకాశం దక్కిందని పేర్కొన్నాయి.ఆసీస్ టూర్‌కు?కాగా రంజీ తాజా సీజన్లో బెంగాల్ జట్టు ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్‌లు ఆడింది. మొత్తంగా ఎనిమిది పాయింట్లతో ఐదో స్థానంలో కొనసాగుతోంది. ఇక ఉత్తరప్రదేశ్‌కు చెందిన షమీ.. దేశవాళీ క్రికెట్లో బెంగాల్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడన్న సంగతి తెలిసిందే.ఇదిలా ఉంటే.. షమీ రంజీల్లో పూర్తిస్థాయిలో ఆడగలిగితే.. ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ ఆడే టీమిండియాలో అతడిని చేర్చే అవకాశం లేకపోలేదు. ప్రస్తుతం ఆసీస్ టూర్ వెళ్లిన భారత జట్టులో ప్రధాన పేసర్లు జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్‌తో పాటు ఆకాశ్ దీప్, ప్రసిద్ కృష్ణ, హర్షిత్ రాణా కూడా ఉన్నారు. ఆస్ట్రేలియాతో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి భారత జట్టురోహిత్ శర్మ (కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, అభిమన్యు ఈశ్వరన్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), సర్ఫరాజ్ ఖాన్, ధృవ్ జురెల్ (వికెట్‌కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, మహ్మద్ సిరాజ్ , ఆకాశ్ దీప్, ప్రసిద్ కృష్ణ, హర్షిత్ రాణా, నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్.చదవండి: BGT: పంత్ కాదు!.. అతడే కొత్త రాజు అంటున్న ఆస్ట్రేలియా మీడియా! -
రికీ భుయ్ అజేయ శతకం
విశాఖ స్పోర్ట్స్: బెంగాల్ జట్టుతో జరుగుతున్న రంజీ ట్రోఫీ ఎలైట్ డివిజన్ గ్రూప్ ‘బి’ మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యానికి 71 పరుగుల దూరంలో నిలిచింది. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆంధ్ర జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 133 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 339 పరుగులు సాధించింది. రికీ భుయ్ (243 బంతుల్లో 107 బ్యాటింగ్; 12 ఫోర్లు, 1 సిక్స్) అజేయ సెంచరీ సాధించి ఆంధ్ర జట్టును ఆదుకున్నాడు. ఓవర్‌నైట్ స్కోరు 119/3తో మూడో రోజు ఆట కొనసాగించిన ఆంధ్ర మూడు వికెట్లు కోల్పోయి మరో 220 పరుగులు సాధించింది. కెప్టెన్ హనుమ విహారి (51; 7 ఫోర్లు)తో కలిసి రికీ భుయ్ నాలుగో వికెట్‌కు 87 పరుగులు జత చేశాడు. అనంతరం నితీశ్ కుమార్ రెడ్డి (30; 6 ఫోర్లు)తో ఆరో వికెట్‌కు రికీ భుయ్ 71 పరుగులు జోడించాడు. ప్రస్తుతం షోయబ్ మొహమ్మద్ ఖాన్ (31 బ్యాటింగ్; 4 ఫోర్లు, 1 సిక్స్)తో కలిసి రికీ భుయ్ ఏడో వికెట్‌కు అజేయంగా 61 పరుగులు జత చేశాడు. బెంగాల్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 409 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే. -
Ranji Trophy: ఫైనల్ కు వేళాయె.. బెంగాల్‌తో సౌరాష్ట్ర ఢీ
భారత దేశవాళీ క్రికెట్ ప్రతిష్టాత్మక టోర్నీ ‘రంజీ ట్రోఫీ’ టైటిల్ కోసం కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో బెంగాల్, సౌరాష్ట్ర జట్లు నేటి నుంచి అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఉదయం గం. 9:30 నుంచి జరిగే ఈ మ్యాచ్‌ను స్టార్ స్పోర్ట్స్–2లో, హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. 1990లో చివరిసారి బెంగాల్ జట్టు రంజీ ట్రోఫీ టైటిల్ నెగ్గింది. ఆ తర్వాత నాలుగుసార్లు ఫైనల్ చేరి రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకుంది. గత పదేళ్లలో ఐదోసారి ఈ మెగా టోర్నీ ఫైనల్ ఆడుతున్న సౌరాష్ట్ర 2020లో బెంగాల్‌ను ఓడించి తొలిసారి విజేత అయింది. చదవండి: IND vs AUS: ‘టెస్టు క్రికెట్ పూజారి’..చరిత్ర సృష్టించనున్న 'నయా వాల్' -
ఫస్ట్‌క్లాస్ క్రికెట్ చరిత్రలో అరుదైన ఫీట్.. బెంగాల్ జట్టు ప్రపంచ రికార్డు
రంజీ క్రికెట్ చరిత్రలో ఒక అరుదైన ఫీట్ చోటుచేసుకుంది. జట్టులో ఉన్న టాప్-9 మంది ఆటగాళ్లు కనీసం హాఫ్ సెంచరీతో మెరిశారు. బెంగాల్, జార్ఖండ్‌ల మధ్య జరుగుతున్న తొలి క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో బుధవారం ఈ అద్భుతం జరిగింది. ఫస్ట్‌క్లాస్ క్రికెట్ చరిత్రలో టాప్-9 మంది బ్యాటర్స్ ఒకే ఇన్నింగ్స్‌లో కనీసం అర్థసెంచరీ చేయడం ఇదే మొదటిసారి. ఇంతకముందు 1893లో ఆస్ట్రేలియాకు చెందిన 8 మంది బ్యాటర్లు ఆక్స్ఫర్డ్ అండ్ కేమ్బ్రిడ్జ్ యునివర్సిటీ జట్టుపై అర్థసెంచరీలు సాధించారు. ఈ 8 మంది వరుసగా టాప్-8 బ్యాటర్స్ మాత్రం కాదు. కానీ తాజాగా బెంగాల్ జట్టు మాత్రం ఈ విషయంలో ప్రపంచ రికార్డు నెలకొల్పింది. బెంగాల్ జట్టులో వరుసగా తొమ్మిది మంది బ్యాటర్స్ కనీసం హాఫ్ సెంచరీ మార్క్ సాధించారు. ఈ తొమ్మిది మందిలో సుదీప్ గరామీ(380 బంతుల్లో 21 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 186 పరుగులు), అనుస్తుప్ మజుందార్(194 బంతుల్లో 15 ఫోర్ల సాయంతో 117 పరుగులు) సెంచరీలతో మెరవగా.. ఓపెనర్లు అభిమన్యు ఈశ్వరన్ 65, మరో ఓపెనర్ అభిషేక్ రమణ్ మొదట 41 పరుగుల వద్ద రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరిగాడు. మజుందార్ ఔటైన తర్వాత మళ్లీ బ్యాటింగ్‌కు వచ్చి 61 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇక ఐదో స్థానంలో వచ్చిన ఎంపీ మనోజ్ తివారి 73 పరుగులతో ఆకట్టుకోగా.. వికెట్ కీపర్ అభిషేక్ పొరేల్ 68 పరుగులు చేశాడు. ఇక మ్యాచ్‌లో చివరి వికెట్‌గా వెనుదిరిగిన షాబాజ్ అహ్మద్ 78 పరుగులు చేశాడు. ఆ తర్వాత ఎనిమిది, తొమ్మిదో స్థానంలో వచ్చిన మోండల్ 53 నాటౌట్, ఆకాశ్‌దీప్( 18 బంతుల్లో 8 సిక్సర్లతో 53 పరుగులు) టి20 తరహాలో అలరించాడు. ఇలా తొమ్మిది మంది బ్యాటర్లు కనీసం హాఫ్ సెంచరీ నమోదు చేయడంతో బెంగాల్ జట్టు 7 వికెట్ల నష్టానికి 773 పరుగులు భారీ స్కోరు వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన జార్ఖండ్ 34 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది. కెప్టెన్ సౌరబ్ తివారీ 25, విరాట్ సింగ్ 13 పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకముందు ఓపెనర్ నిజామ్ సిద్దికీ 53 పరుగులు చేసి ఔటవ్వగా.. మరో ఓపెనర్ కుమార్ డియోబ్రాత్ 11 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. చదవండి: Ranji Trophy 2022: నమ్మశక్యం కాని క్యాచ్.. వీడియో వైరల్ రహానే స్థానంలో అరంగేట్రం.. డబుల్ సెంచరీతో కొత్త చరిత్ర; ఎవరీ సువేద్ పార్కర్ Bengal Creates History!#Cricket #FirstClassCricket #Bengal #RanjiTrophy pic.twitter.com/BN8gziQNrB — CRICKETNMORE (@cricketnmore) June 8, 2022 -
బెంగాల్ జట్టుకు ఆడనున్న వృద్ధిమాన్ సాహా,మహమ్మద్ షమీ..!
రంజీ ట్రోఫీ 2021-2022లో భాగంగా జార్ఖండ్‌తో జరగనున్న క్వార్టర్ ఫైనల్‌కు క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ తమ జట్టును ప్రకటించింది. లీగ్ దశ నుంచి వైదొలిగిన వృద్ధిమాన్ సాహా తిరిగి మళ్లీ బెంగాల్ జట్టు తరపున ఆడనున్నాడు. క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ పేసర్ మహమ్మద్ షమీని కూడా ఎంపిక చేసింది. అయితే రానున్న రోజుల్లో బీజీ షెడ్యూల్ ఉన్నందున మహమ్మద్ షమీ అందుబాటుపై సందిగ్ధం నెలకొంది. ఇక శ్రీలంకతో స్వదేశంలో జరిగిన టెస్ట్ సిరీస్‌కు ఎంపిక కాకపోవడంతో సాహా.. రంజీ ట్రోఫీ లీగ్ దశ నుంచి తప్పుకున్నాడు. సాహా ప్రస్తుతం ఐపీఎల్-2022లో గుజరాత్ టైటాన్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ సీజన్లో సాహా అద్భుతంగా రాణిస్తున్నాడు. ఇప్పటి వరకు ఈ ఏడాది సీజన్లో మ్యాచ్‌లు ఆడిన సాహా 281 పరుగులు సాధించాడు. క్వార్టర్ ఫైనల్ జూన్ 6న బెంగళూరు వేదికగా జరగనుంది. బెంగాల్ జట్టు: అభిమన్యు ఈశ్వరన్ (కెప్టెన్), మనోజ్ తివారీ, వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), మహ్మద్ షమీ, అనుస్తుప్ మజుందార్, సుదీప్ ఛటర్జీ, షాబాజ్ అహ్మద్, అభిషేక్ రామన్, రిటిక్ ఛటర్జీ, సయన్ శేఖర్ మొండల్, ముఖేష్ కుమార్, ఆకాశ్ దీప్, ఇషాన్ గ్హో, ఆర్. రాయ్ చౌదరి, ప్రదీప్త ప్రమాణిక్, కరణ్ లాల్, నీలకంఠ దాస్, సుదీప్ ఘరామి, అభిషేక్ పోరెల్, మహమ్మద్ కైఫ్, అంకిత్ మిశ్రా చదవండి: IPL 2022: 'మ్యాచ్ గెలవడం కంటే నీ ఈగో ముఖ్యమా' -
66 ఏళ్ల వయస్సులో భారత మాజీ క్రికెటర్ రెండో పెళ్లి.. ఫొటోలు వైరల్..!
భారత మాజీ క్రికెటర్ అరుణ్ లాల్, బుల్బుల్ సాహా వివాహ బంధంతో ఒక్కటయ్యారు. మే 2 (సోమవారం) కోల్‌కతాలోని పీర్లెస్ ఇన్‌లో వీరి వివాహం జరిగింది. అతి తక్కువ మంది అతిథుల సమక్షంలో వీరి పెళ్లి జరిగింది. ఇక ఈ జంట పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా 66 ఏళ్ల వయస్సులో అరుణ్ లాల్ రెండో పెళ్లి చేసుకున్నాడు. లాల్ తన మొదటి భార్య రీనా అంగీకారంతోనే బుల్బుల్ సాహాను పెళ్లి చెసుకున్నట్లు తెలుస్తోంది. ఆమె లాల్ కంటే 28 ఏళ్ల చిన్నది. ఇక అరుణ్ లాల్ ప్రస్తుతం బెంగాల్ జట్టుకు హెడ్ కోచ్‌గా ఉన్నాడు. లాల్ భారత్ తరఫున 1982-89 మధ్యకాలంలో 16 టెస్టులు, 16 వన్డేలు ఆడాడు. ఇక ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 156 మ్యాచ్‌లు ఆడిన లాల్.. 30 సెంచరీలతో సహా 10421 పరుగులు సాధించాడు. చదవండి: IPL 2022: ప్లే ఆఫ్ రేసులో నిలిచిన కేకేఆర్.. రాజస్తాన్‌పై ఘన విజయం -
Ranji Trophy 2022: హైదరాబాద్ ఓటమి.. తిలక్ వర్మ తప్ప!
రంజీ ట్రోఫీ క్రికెట్ టోర్నీలో భాగంగా బెంగాల్‌తో జరిగిన ఎలైట్ గ్రూప్ 'బి'మ్యాచ్‌లో హైదరాబాద్ 72 పరుగుల తేడాతో ఓటమి చెందింది. 239 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ 166 పరుగులకే ఆలౌటైంది. హైదరాబాద్ బ్యాటర్లలో తిలక్ వర్మ(90) మినహా మిగతా వారంతా విఫలమయ్యారు. బెంగాల్ బౌలర్లలో ఆక్ష్‌దీప్ నాలుగు వికెట్లు పడగొట్టగా, షబాజ్ ఆహ్మద్ మూడు వికెట్లు సాధించాడు. ఆంధ్ర, సర్వీసెస్ జట్ల మధ్య మ్యాచ్ ‘డ్రా తిరువనంతపురం: రంజీ ట్రోఫీ క్రికెట్ టోర్నీలో ఆంధ్ర, సర్వీసెస్ జట్ల మధ్య మ్యాచ్ ‘డ్రా’గా ముగిసింది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం ఆధారంగా ఆంధ్రకు 3 పాయింట్లు లభించాయి. ఆట చివరిరోజు రెండో ఇన్నింగ్స్‌లో ఆంధ్ర జట్టు 4 వికెట్లకు 220 పరుగులు చేసింది. జ్ఞానేశ్వర్ (125; 13 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీ చేశాడు. -
రంజీ జట్టులో రాష్ట్ర మంత్రి..
ప్రతిష్టాత్మక రంజీ ట్రోఫీలో పాల్గొనే 22 మంది సభ్యుల బెంగాల్ జట్టును సోమవారం ప్రకటించారు. ఈ జట్టుకు అభిమన్యు ఈశ్వరన్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. అయితే ఈ జట్టులో వెటరన్ ఆటగాడు, బెంగాల్ క్రీడా శాఖా మంత్రి మనోజ్ తివారీకు చోటు దక్కింది. రాజకీయ అరంగేట్రం చేసిన ఏడాది లోపే జట్టులోకి రావడం గమనార్హం. తివారీ తన చివరి మ్యాచ్‌ను గత రంజీ ట్రోఫీ ఫైనల్లో సౌరష్ట్రాపై ఆడాడు. ఇక రంజీ ట్రోఫీలో భాగంగా జనవరి 13న బెంగాల్ తమ తొలి మ్యాచ్‌లో త్రిపురతో తలపడనుంది. అయితే జట్టులో 7గురు ఆటగాళ్లు కరోనా బారిన పడడంతో బెంగాల్ శిబిరంలో గందరగోళం నెలకొంది. బెంగాల్ జట్టు: అభిమన్యు ఈశ్వరన్ (సి), మనోజ్ తివారీ, సుదీప్ ఛటర్జీ, అనుస్తుప్ మజుందార్, అభిషేక్ రామన్, సుదీప్ ఘరామి, అభిషేక్ దాస్, రిత్టిక్ ఛటర్జీ, రిత్విక్ రాయ్ చౌదరి, అభిషేక్ పోరెల్, షాబాజ్ అహ్మద్, సయన్ శేఖర్ దేరెప్, సయన్ శేఖర్ దేరెప్, ఐ. కాజీ జునైద్ సైఫీ, సకీర్ హబీబ్ గాంధీ, ప్రదీప్త ప్రమాణిక్, గీత్ పూరి, నీలకంఠ దాస్ మరియు కరణ్ లాల్. చదవండి: Nz Vs Ban 1st Test: అత్యంత చెత్త రివ్యూ ఇదే... అనవసరంగా.. -
ఆ ప్రైజ్‌మనీ ఇవ్వలేదింకా...
కోల్‌కతా: రంజీ ట్రోఫీ రన్నరప్‌గా నిలిచిన బెంగాల్ జట్టుకు ఇంకా ఆ ప్రైజ్‌మనీ విడుదల కాలేదు. రూ. కోటి రావాల్సి ఉంది. దీనిపై సంప్రదింపులు జరుపుతున్నామని బెంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్) అధ్యక్షుడు అవిõÙక్ దాలి్మయా చెప్పారు. మార్చి రెండో వారంలో ఈ టోర్నీ ముగియగా సౌరాష్ట్ర విజేతగా నిలిచింది. శుక్రవారం బెంగాల్ జట్టు ఆటగాళ్లకు ఆన్లైన్ సెషన్ నిర్వహించగా... ఓ ఆటగాడు ఈ అంశాన్ని లేవనెత్తడంతో ఈ సంగతి మీడియాకు తెలిసింది. దీనిపై బెంగాల్ ఆటగాడొకరు మాట్లాడుతూ ‘ఇది ఫిర్యాదుగా భావించవద్దు. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులు మాకూ తెలుసు. కానీ మూడు నెలలు పూర్తయినా ఆ మొత్తం రాకపోవడం నిరాశగా ఉంది’ అని అన్నాడు. క్యాబ్ అధ్యక్షడు అవిõÙక్ స్పందిస్తూ ఈ విషయంలో అసోసియేషన్ చురుగ్గా పనిచేస్తోందని, దీనికి సంబంధించిన వ్యవహారాలు, అంతర్గత ఆడిట్ త్వరలోనే పూర్తి చేసి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి పంపిస్తామని, రావాల్సిన ప్రైజ్‌మనీని త్వరలోనే విడుదల చేసేలా చొరవ తీసుకుంటామని చెప్పారు. అయితే విజేతగా నిలిచిన సౌరాష్ట్రకు కూడా ఇటీవలే ప్రైజ్‌మనీని విడుదల చేసినట్లు తెలిసింది. -
సెంచరీతో బెంగాల్‌ను ఆదుకున్న అనుస్తుప్
కోల్‌కతా: మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ అనుస్తుప్ (120 బ్యాటింగ్; 18 ఫోర్లు, సిక్స్) అజేయ సెంచరీతో బెంగాల్‌ను ఆదుకోవడంతో... కర్ణాటకతో ఆరంభమైన రంజీ ట్రోఫీ క్రికెట్ టోర్నీ సెమీఫైనల్ మ్యాచ్‌లో ఆ జట్టు తొలి రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 9 వికెట్లకు 275 పరుగులు చేసింది. బెంగాల్ ఒక దశలో 67 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో అనుస్తుప్... అహ్మద్ (35; 7 ఫోర్లు)తో ఏడో వికెట్‌కు 72 పరుగులు, అకాశ్ దీప్ (44; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు)తో కలిసి ఎనిమిదో వికెట్‌కు 103 పరుగులు జోడించాడు. గుజరాత్‌తో జరుగుతున్న మరో సెమీఫైనల్లో సౌరాష్ట్ర ఆట ముగిసే సమయానికి 5 వికెట్లకు 217 పరుగులు చేసింది. -
హైదరాబాద్‌కు పరాభవం
కల్యాణి (బెంగాల్): రంజీ ట్రోఫీ సీజన్లో హైదరాబాద్‌కు ఐదో పరాజయం... మూడో రోజే ముగిసిన మ్యాచ్‌లో మంగళవారం బెంగాల్ జట్టు ఇన్నింగ్స్, 303 పరుగుల తేడాతో హైదరాబాద్‌ను చిత్తుగా ఓడించింది. 464 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కోల్పోయి ఫాలోఆన్ ఆడిన హైదరాబాద్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 161 పరుగులకే ఆలౌటైంది. టి. రవితేజ (53) అర్ధ సెంచరీ చేయగా, మిగిలిన వారంతా విఫలమయ్యారు. ఆకాశ్‌దీప్ 4 వికెట్లతో ప్రత్యరి్థని దెబ్బ తీశాడు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 83/5తో ఆట కొనసాగించిన హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్‌లో 171 పరుగులకే కుప్పకూలింది. జావీద్ అలీ (72) ఒక్కడే కొంత ప్రతిఘటించాడు. బెంగాల్ లెఫ్టార్మ్ స్పిన్నర్ షహబాజ్ అహ్మద్ (4/26) ‘హ్యాట్రిక్’ నమోదు చేయడం విశేషం. ఇన్నింగ్స్ 47వ ఓవర్లో వరుస బంతుల్లో అతను జావీద్ అలీ, రవికిరణ్, సుమంత్‌లను అవుట్ చేశాడు. -
ప్రజ్ఞాన్ ఓజా కనిపించడం లేదు!
కోల్‌కతా: క్రికెట్ జట్టు ప్రకటనలో ఇది అనూహ్యం! ఒక ఆటగాడు తమ రాష్ట్ర క్రికెట్ సంఘానికి అందుబాటులో రావడం లేదంటూ అతని పేరు లేకుండా జట్టును ప్రకటించడం ఆశ్చర్యపరిచే పరిణామం. తనను హైదరాబాద్‌కు తిరిగి ఆడకుండా బెంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్) అడ్డుకుందనే ఆవేదనలో ఉన్న లెఫ్టార్మ్ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా చివరకు అధికారులెవరికీ అందుబాటులో లేకుండా పోయాడు. ఫలితంగా గుజరాత్‌తో వార్మప్ మ్యాచ్‌ల కోసం ప్రకటించిన బెంగాల్ జట్టులో అతనికి చోటు దక్కలేదు. ‘ఓజాతో మాట్లాడాలని మేం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అతను అందుబాటులోకే రాలేదు. దాంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఓజా పేరు లేకుండానే జట్టును ఎంపిక చేశాం’ అని క్యాబ్ సంయుక్త కార్యదర్శి అవిశేక్ దాల్మియా వెల్లడించారు. వాస్తవానికి రెండు వారాల క్రితమే బెంగాల్ జట్టు ప్రత్యేక శిక్షణా శిబిరం ప్రారంభమైనా... దానికి కూడా ఓజా ఇప్పటి వరకు హాజరు కాలేదు. గత రెండు సీజన్ల పాటు బెంగాల్‌కు ప్రాతినిధ్యం వహించిన ఓజా...ఈసారి సొంత టీమ్ హైదరాబాద్ తరఫున రంజీ ట్రోఫీ ఆడాలని ఆశించాడు. అయితే తమకు ఓజా అవసరం ఉందంటూ ‘క్యాబ్’ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అతనికి నిరభ్యంతరకర పత్రం (ఎన్ఓసీ) జారీ చేయలేదు. -
కాలుష్యం, పొగమంచుతో ఢిల్లీలోని మ్యాచ్‌లు రద్దు
న్యూఢిల్లీ: హైదరాబాద్-త్రిపుర, బెంగాల్-గుజరాత్ జట్ల మధ్య ఇక్కడ జరగాల్సిన మ్యాచ్‌లను ఉన్నపళంగా రద్దు చేశారు. తీవ్రమైన వాయు కాలుష్యంతో పాటు ఎడతెగని పొగమంచు వల్ల ఆట సాగకపోవడంతో మ్యాచ్‌లను రద్దు చేసినట్లు ఆయా మ్యాచ్‌ల రిఫరీలు వెల్లడించారు. రేపు బెంగాల్ జట్టు కోల్‌కతాకు, గుజరాత్ ఆటగాళ్లు అహ్మదాబాద్‌కు పయనం కానున్నారు. ఇలాంటి కారణంతో రంజీ మ్యాచ్‌లు రద్దవడం ఇదే మొదటిసారి. త్వరలోనే ఈ మ్యాచ్‌లను రీషెడ్యూల్ చేయాలని బీసీసీఐ భావిస్తోంది.