![Wriddhiman Saha and Mohammaed Shami picked in Bengal squad for quarterfinal - Sakshi](/styles/webp/s3/article_images/2022/05/17/sha.jpg.webp?itok=WaX3sAU6)
PC: BCCI
రంజీ ట్రోఫీ 2021-2022లో భాగంగా జార్ఖండ్‌తో జరగనున్న క్వార్టర్ ఫైనల్‌కు క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ తమ జట్టును ప్రకటించింది. లీగ్ దశ నుంచి వైదొలిగిన వృద్ధిమాన్ సాహా తిరిగి మళ్లీ బెంగాల్ జట్టు తరపున ఆడనున్నాడు. క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ పేసర్ మహమ్మద్ షమీని కూడా ఎంపిక చేసింది. అయితే రానున్న రోజుల్లో బీజీ షెడ్యూల్ ఉన్నందున మహమ్మద్ షమీ అందుబాటుపై సందిగ్ధం నెలకొంది.
ఇక శ్రీలంకతో స్వదేశంలో జరిగిన టెస్ట్ సిరీస్‌కు ఎంపిక కాకపోవడంతో సాహా.. రంజీ ట్రోఫీ లీగ్ దశ నుంచి తప్పుకున్నాడు. సాహా ప్రస్తుతం ఐపీఎల్-2022లో గుజరాత్ టైటాన్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ సీజన్‌లో సాహా అద్భుతంగా రాణిస్తున్నాడు. ఇప్పటి వరకు ఈ ఏడాది సీజన్‌లో మ్యాచ్‌లు ఆడిన సాహా 281 పరుగులు సాధించాడు. క్వార్టర్ ఫైనల్ జూన్ 6న బెంగళూరు వేదికగా జరగనుంది.
బెంగాల్ జట్టు:
అభిమన్యు ఈశ్వరన్ (కెప్టెన్), మనోజ్ తివారీ, వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), మహ్మద్ షమీ, అనుస్తుప్ మజుందార్, సుదీప్ ఛటర్జీ, షాబాజ్ అహ్మద్, అభిషేక్ రామన్, రిటిక్ ఛటర్జీ, సయన్ శేఖర్ మొండల్, ముఖేష్ కుమార్, ఆకాశ్ దీప్, ఇషాన్ గ్హో, ఆర్. రాయ్ చౌదరి, ప్రదీప్త ప్రమాణిక్, కరణ్ లాల్, నీలకంఠ దాస్, సుదీప్ ఘరామి, అభిషేక్ పోరెల్, మహమ్మద్ కైఫ్, అంకిత్ మిశ్రా
Comments
Please login to add a commentAdd a comment