ప్రతిష్టాత్మక రంజీ ట్రోఫీలో పాల్గొనే 22 మంది సభ్యుల బెంగాల్ జట్టును సోమవారం ప్రకటించారు. ఈ జట్టుకు అభిమన్యు ఈశ్వరన్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. అయితే ఈ జట్టులో వెటరన్ ఆటగాడు, బెంగాల్ క్రీడా శాఖా మంత్రి మనోజ్ తివారీకు చోటు దక్కింది. రాజకీయ అరంగేట్రం చేసిన ఏడాది లోపే జట్టులోకి రావడం గమనార్హం. తివారీ తన చివరి మ్యాచ్‌ను గత రంజీ ట్రోఫీ ఫైనల్లో సౌరష్ట్రాపై ఆడాడు. ఇక రంజీ ట్రోఫీలో భాగంగా జనవరి 13న బెంగాల్ తమ తొలి మ్యాచ్‌లో త్రిపురతో తలపడనుంది. అయితే జట్టులో 7గురు ఆటగాళ్లు కరోనా బారిన పడడంతో బెంగాల్ శిబిరంలో గందరగోళం నెలకొంది.
బెంగాల్ జట్టు: అభిమన్యు ఈశ్వరన్ (సి), మనోజ్ తివారీ, సుదీప్ ఛటర్జీ, అనుస్తుప్ మజుందార్, అభిషేక్ రామన్, సుదీప్ ఘరామి, అభిషేక్ దాస్, రిత్టిక్ ఛటర్జీ, రిత్విక్ రాయ్ చౌదరి, అభిషేక్ పోరెల్, షాబాజ్ అహ్మద్, సయన్ శేఖర్ దేరెప్, సయన్ శేఖర్ దేరెప్, ఐ. కాజీ జునైద్ సైఫీ, సకీర్ హబీబ్ గాంధీ, ప్రదీప్త ప్రమాణిక్, గీత్ పూరి, నీలకంఠ దాస్ మరియు కరణ్ లాల్.
చదవండి: Nz Vs Ban 1st Test: అత్యంత చెత్త రివ్యూ ఇదే... అనవసరంగా..
Comments
Please login to add a commentAdd a comment