ranji trphy
-
రంజీ జట్టులో రాష్ట్ర మంత్రి..
ప్రతిష్టాత్మక రంజీ ట్రోఫీలో పాల్గొనే 22 మంది సభ్యుల బెంగాల్ జట్టును సోమవారం ప్రకటించారు. ఈ జట్టుకు అభిమన్యు ఈశ్వరన్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. అయితే ఈ జట్టులో వెటరన్ ఆటగాడు, బెంగాల్ క్రీడా శాఖా మంత్రి మనోజ్ తివారీకు చోటు దక్కింది. రాజకీయ అరంగేట్రం చేసిన ఏడాది లోపే జట్టులోకి రావడం గమనార్హం. తివారీ తన చివరి మ్యాచ్‌ను గత రంజీ ట్రోఫీ ఫైనల్లో సౌరష్ట్రాపై ఆడాడు. ఇక రంజీ ట్రోఫీలో భాగంగా జనవరి 13న బెంగాల్ తమ తొలి మ్యాచ్‌లో త్రిపురతో తలపడనుంది. అయితే జట్టులో 7గురు ఆటగాళ్లు కరోనా బారిన పడడంతో బెంగాల్ శిబిరంలో గందరగోళం నెలకొంది. బెంగాల్ జట్టు: అభిమన్యు ఈశ్వరన్ (సి), మనోజ్ తివారీ, సుదీప్ ఛటర్జీ, అనుస్తుప్ మజుందార్, అభిషేక్ రామన్, సుదీప్ ఘరామి, అభిషేక్ దాస్, రిత్టిక్ ఛటర్జీ, రిత్విక్ రాయ్ చౌదరి, అభిషేక్ పోరెల్, షాబాజ్ అహ్మద్, సయన్ శేఖర్ దేరెప్, సయన్ శేఖర్ దేరెప్, ఐ. కాజీ జునైద్ సైఫీ, సకీర్ హబీబ్ గాంధీ, ప్రదీప్త ప్రమాణిక్, గీత్ పూరి, నీలకంఠ దాస్ మరియు కరణ్ లాల్. చదవండి: Nz Vs Ban 1st Test: అత్యంత చెత్త రివ్యూ ఇదే... అనవసరంగా.. -
లదాఖ్ క్రికెటర్లు కశ్మీర్ తరఫున...
న్యూఢిల్లీ: కేంద్రపాలిత ప్రాంతంగా గుర్తింపు పొందిన లదాఖ్‌కు చెందిన క్రికెటర్లు ఇకపై రంజీ ట్రోఫీలో జమ్మూ కశ్మీర్ జట్టుకు ప్రాతినిధ్యం వహించవచ్చు. ఈ విషయంపై బీసీసీఐ పరిపాలకుల కమిటీ (సీఓఏ) చీఫ్ వినోద్ రాయ్ స్పష్టతనిచ్చారు. ఇప్పటి వరకు లదాఖ్‌కు చెందిన ఒక్క ఆటగాడు కూడా కశ్మీర్ క్రికెట్ టీమ్‌కు ప్రాతినిధ్యం వహించలేదు. ‘ఇప్పటికిప్పుడు లదాఖ్‌కు ప్రత్యేక క్రికెట్ సంఘం అవసరం లేదు. ఆ ప్రాంతానికి చెందినవారు బీసీసీఐ దేశవాళీ టోర్నీల్లో కశ్మీర్ జట్టు తరఫున ఆడవచ్చు. ప్రస్తుతానికి అది కూడా చండీగఢ్ తరహా కేంద్ర పాలిత ప్రాంతమే. ఇక్కడి ఆటగాళ్లు పంజాబ్, హరియాణా తరఫున ఎలా ఆడుతున్నారో లదాఖ్æ క్రికెటర్లు కూడా అలాగే ఆడతారు’ అని వినోద్ రాయ్ చెప్పారు. మరోవైపు కశ్మీర్ రంజీ జట్టు హోమ్ మ్యాచ్‌లను శ్రీనగర్ నుంచి మార్చే ఆలోచన ఏదీ లేదని ఆయన అన్నారు. -
ఆంధ్రకు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం
సాక్షి, విశాఖపట్నం: మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ సమష్టిగా రాణించడంతో పంజాబ్‌తో జరిగిన రంజీ ట్రోఫీ మ్యాచ్‌ను ఆంధ్ర జట్టు ‘డ్రా’గా ముగించింది. ఓవర్‌నైట్ స్కోరు 328/5తో ఆదివారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఆంధ్ర చివరకు 423 పరుగులకు ఆలౌటైంది. ఏడు పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సంపాదించింది. చివరి రోజు ఆంధ్ర 95 పరుగులు జతచేసి మిగిలిన ఐదు వికెట్లు కోల్పోయింది. రికీ భుయ్ (181; 15 ఫోర్లు, 4 సిక్స్‌లు) క్రితం రోజు స్కోరుకు 30 పరుగులు జతచేసి పెవిలియన్ చేరగా... షోయబ్ ఖాన్ (52; 6 ఫోర్లు) అర్ధశతకం సాధించాడు. పంజాబ్ బౌలర్లలో అరంగేట్రం స్పిన్నర్ మయాంక్ మార్కండే 5 వికెట్లు పడగొట్టాడు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన పంజాబ్ ఆట ముగిసే సమయానికి 2 వికెట్లకు 102 పరుగులు చేసింది. శుబ్‌మన్ గిల్ (54 నాటౌట్; 7 ఫోర్లు) అర్ధసెంచరీతో మెరిశాడు. ఆంధ్ర బౌలర్లలో విజయ్ కుమార్, షోయబ్ ఖాన్ చెరో వికెట్ పడగొట్టారు. అంతకుముందు పంజాబ్ తొలి ఇన్నింగ్స్‌లో 414 పరుగులకు ఆలౌటైంది. మ్యాచ్ ‘డ్రా’గా ముగిసినా తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సంపాదించిన ఆంధ్రకు మూడు పాయింట్లు, పంజాబ్‌కు ఒక పాయింట్ లభించాయి. హైదరాబాద్ మ్యాచ్ ‘డ్రా’ తిరువనంతపురం: వర్షం అంతరాయం కలిగించిన కేరళ, హైదరాబాద్ మ్యాచ్ ‘డ్రా’గా ముగిసింది. ఓవర్‌నైట్ స్కోరు 30/1తో ఆదివారం చివరి రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన హైదరాబాద్ ఆట ముగిసే సమయానికి 112 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. సందీప్ (155 బంతుల్లో 56 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్) అర్ధశతకం సాధించగా... హిమాలయ్ అగర్వాల్ (132 బంతుల్లో 48; 7 ఫోర్లు), సుమంత్ (136 బంతుల్లో 42 నాటౌట్; 5 ఫోర్లు) ఆకట్టుకున్నారు. అంతకుముందు కేరళ తొలి ఇన్నింగ్స్‌లో 495/6 వద్ద డిక్లేర్ చేసింది. మ్యాచ్‌లో రెండు జట్ల ఇన్నింగ్స్‌లు పూర్తి కాకపోవడంతో రెండు జట్లకు చెరో పాయింట్ కేటాయించారు. -
ఆంధ్ర, త్రిపుర మ్యాచ్ ‘డ్రా’
అగర్తల: ఆంధ్ర, త్రిపుర మధ్య హోరాహోరీగా సాగిన రంజీ ట్రోఫీ గ్రూప్ ‘సి’ సమరం చివరకు ‘డ్రా’గా ముగిసింది. మ్యాచ్ చివరి రోజు ఆదివారం ఆంధ్ర జట్టు దూకుడుగా ఆడి సవాల్ విసరగా... ఆ తర్వాత త్రిపుర కూడా లక్ష్య ఛేదనలో వెనకడుగు వేయలేదు. చివరకు వెలుతురులేమితో మ్యాచ్‌కు ముగింపు లభించింది. 322 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆట ముగిసే సమయానికి త్రిపుర 56 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ స్మిత్ పటేల్ (99 బంతుల్లో 107 నాటౌట్; 11 ఫోర్లు, 1 సిక్స్) దూకుడుగా ఆడి సెంచరీ చేయగా, ఉత్తమ్ బోస్ (46 బంతుల్లో 53; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించాడు. భార్గవ్ భట్‌కు 2 వికెట్లు దక్కాయి. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 51/1తో ఆట కొనసాగించిన ఆంధ్ర తమ రెండో ఇన్నింగ్స్‌ను 4 వికెట్లకు 234 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. శ్రీకర్ భరత్ (50; 8 ఫోర్లు) అర్ధ సెంచరీ చేయగా, అశ్విన్ హెబర్ (32 బంతుల్లో 44 నాటౌట్; 3 సిక్స్‌లు), సుమంత్ (42 బంతుల్లో 39 నాటౌట్; 3 ఫోర్లు), రికీ భుయ్ (43 బంతుల్లో 39; 4 ఫోర్లు, ఒక సిక్స్) రాణించారు. ఆంధ్ర 5.08 రన్‌రేట్‌తో పరుగులు చేయడం విశేషం. తాజా ఫలితంతో ఐదు మ్యాచ్‌ల తర్వాత 18 పాయింట్లతో ఆంధ్ర ఈ గ్రూప్‌లో అగ్రస్థానంలో ఉంది. తమ ఆఖరి మ్యాచ్‌లో ఆంధ్ర, ముంబైతో తలపడుతుంది. ఈ నెల 17 నుంచి సొంతగడ్డపై ఒంగోలులో జరిగే ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధిస్తే చాలు ఆంధ్ర క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. -
రంజీ సెమీస్‌లో మధ్యప్రదేశ్
ముంబై:ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన మధ్యప్రదేశ్ రంజీ ట్రోఫీలో సెమీఫైనల్ కు చేరింది. క్వార్టర్ ఫైనల్లో భాగంగా బెంగాల్ తో జరిగిన మ్యాచ్ లో మధ్యప్రదేశ్ 355 పరుగుల తేడాతో విజయం సాధించి సెమీస్ కు చేరింది. మధ్యప్రదేశ్ నిర్దేశించిన 788 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బెంగాల్ 91.4 ఓవర్లలో 432 పరుగులకే ఆలౌటైంది. 113/3 ఓవర్ నైట్ స్కోరుతో ఆదివారం ఐదో రోజు రెండో ఇన్నింగ్స్ ను కొనసాగించిన బెంగాల్ తీవ్రంగా ప్రతిఘటించినా ఓటమి తప్పలేదు. బెంగాల్ ఆటగాళ్లలో మనోజ్ తివారీ(124), పంకజ్ షా(118)లు శతకాలతో రాణించగా, అశోక్ దిండా(52) హాఫ్ సెంచరీ నమోదు చేయడం మినహా ఆ జట్టులో మిగతా ఆటగాళ్ల నుంచి సహకారం అందలేదు. మధ్యప్రదేశ్ బౌలర్లలో ఇషాంత్ పాండే నాలుగు వికెట్లు , చంద్రకాంత్ సాక్యూర్ మూడు వికెట్లు సాధించి బెంగాల్ పతనాన్ని శాసించారు. ఈ మ్యాచ్ లో మొత్తం ఎనిమిది వికెట్లు తీసిన ఈశ్వర్ పాండేకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. ఫిబ్రవరి 13న కటక్ లో ప్రారంభమయ్యే సెమీ ఫైనల్లో ముంబైతో మధ్యప్రదేశ్ తలపడనుంది. మధ్యప్రదేశ్ తొలి ఇన్నింగ్స్ 348 ఆలౌట్, రెండో ఇన్నింగ్స్ 560/9 డిక్లేర్ బెంగాల్ తొలి ఇన్నింగ్స్ 121 ఆలౌట్, రెండో ఇన్నింగ్స్ 432 ఆలౌట్