
న్యూఢిల్లీ: కేంద్రపాలిత ప్రాంతంగా గుర్తింపు పొందిన లదాఖ్‌కు చెందిన క్రికెటర్లు ఇకపై రంజీ ట్రోఫీలో జమ్మూ కశ్మీర్ జట్టుకు ప్రాతినిధ్యం వహించవచ్చు. ఈ విషయంపై బీసీసీఐ పరిపాలకుల కమిటీ (సీఓఏ) చీఫ్ వినోద్ రాయ్ స్పష్టతనిచ్చారు. ఇప్పటి వరకు లదాఖ్‌కు చెందిన ఒక్క ఆటగాడు కూడా కశ్మీర్ క్రికెట్ టీమ్‌కు ప్రాతినిధ్యం వహించలేదు. ‘ఇప్పటికిప్పుడు లదాఖ్‌కు ప్రత్యేక క్రికెట్ సంఘం అవసరం లేదు. ఆ ప్రాంతానికి చెందినవారు బీసీసీఐ దేశవాళీ టోర్నీల్లో కశ్మీర్ జట్టు తరఫున ఆడవచ్చు. ప్రస్తుతానికి అది కూడా చండీగఢ్ తరహా కేంద్ర పాలిత ప్రాంతమే. ఇక్కడి ఆటగాళ్లు పంజాబ్, హరియాణా తరఫున ఎలా ఆడుతున్నారో లదాఖ్æ క్రికెటర్లు కూడా అలాగే ఆడతారు’ అని వినోద్ రాయ్ చెప్పారు. మరోవైపు కశ్మీర్ రంజీ జట్టు హోమ్ మ్యాచ్‌లను శ్రీనగర్ నుంచి మార్చే ఆలోచన ఏదీ లేదని ఆయన అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment