
శ్రీనగర్: రానున్న లోక్‌సభ ఎన్నికలల్లో జమ్ముకశ్మీర్, లడఖ్‌లో కలిసి పోటీచేయనున్నట్లు కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ ప్రకటించాయి. ప్రతిపక్ష ఇండియా కూటమిలోని మిత్రపక్షాలలైన ఈ రెండు పార్టీల మధ్య తాజాగా సీట్ల ఒప్పందం ఖరారైంది. చెరో మూడు స్థానాల్లో ఈ రెండు పార్టీలు పోటీ చేయనున్నాయి. ఉదంపూర్, జమ్ము, లడఖ్ లోక్‌సభ స్థానాల నుంచి కాంగ్రెస్ అభ్యర్థులు పోటీ పడనున్నారు.
అనంత్‌నాగ్, బారాముల్లా, శ్రీనగర్ లోక్‌సభ స్థానాల నుంచి ఎన్సీ అభ్యర్థులు బరిలో ఉండనున్నారు. కాంగ్రెస్ నేతలు పవన్ ఖేరా, సల్మాన్ ఖుర్షీద్‌తో జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు ఒమర్ అబ్దుల్లా సీటు షేరింగ్ ఒప్పందాన్ని ప్రకటించారు. ఇదిలా ఉండగా పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ ఇప్పటికే కశ్మీర్‌లోని మూడు స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించారు. అనంత్‌నాగ్ స్థానం నుంచి ఆమె పోటీ చేస్తున్నారు. ఇక్కడ ఎన్సీ అభ్యర్థితోపాటు గులాం నబీ ఆజాద్‌తో ముఫ్తీ తలపడనున్నారు.
చదవండి: టీఎంసీ ఎంపీల ఆందోళన.. ఈడ్చుకెళ్లిన పోలీసులు