రంజీ క్రికెట్ చరిత్రలో ఒక అరుదైన ఫీట్ చోటుచేసుకుంది. జట్టులో ఉన్న టాప్-9 మంది ఆటగాళ్లు కనీసం హాఫ్ సెంచరీతో మెరిశారు. బెంగాల్, జార్ఖండ్‌ల మధ్య జరుగుతున్న తొలి క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో బుధవారం ఈ అద్భుతం జరిగింది. ఫస్ట్‌క్లాస్ క్రికెట్ చరిత్రలో టాప్-9 మంది బ్యాటర్స్ ఒకే ఇన్నింగ్స్‌లో కనీసం అర్థసెంచరీ చేయడం ఇదే మొదటిసారి. ఇంతకముందు 1893లో ఆస్ట్రేలియాకు చెందిన 8 మంది బ్యాటర్లు ఆక్స్‌ఫర్డ్ అండ్ కేమ్‌బ్రిడ్జ్ యునివర్సిటీ జట్టుపై అర్థసెంచరీలు సాధించారు. ఈ 8 మంది వరుసగా టాప్-8 బ్యాటర్స్ మాత్రం కాదు. కానీ తాజాగా బెంగాల్ జట్టు మాత్రం ఈ విషయంలో ప్రపంచ రికార్డు నెలకొల్పింది.
బెంగాల్ జట్టులో వరుసగా తొమ్మిది మంది బ్యాటర్స్ కనీసం హాఫ్ సెంచరీ మార్క్ సాధించారు. ఈ తొమ్మిది మందిలో సుదీప్ గరామీ(380 బంతుల్లో 21 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 186 పరుగులు), అనుస్తుప్ మజుందార్(194 బంతుల్లో 15 ఫోర్ల సాయంతో 117 పరుగులు) సెంచరీలతో మెరవగా.. ఓపెనర్లు అభిమన్యు ఈశ్వరన్ 65, మరో ఓపెనర్ అభిషేక్ రమణ్ మొదట 41 పరుగుల వద్ద రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరిగాడు. మజుందార్ ఔటైన తర్వాత మళ్లీ బ్యాటింగ్‌కు వచ్చి 61 పరుగులు చేసి ఔటయ్యాడు.
ఇక ఐదో స్థానంలో వచ్చిన ఎంపీ మనోజ్ తివారి 73 పరుగులతో ఆకట్టుకోగా.. వికెట్ కీపర్ అభిషేక్ పొరేల్ 68 పరుగులు చేశాడు. ఇక మ్యాచ్‌లో చివరి వికెట్‌గా వెనుదిరిగిన షాబాజ్ అహ్మద్ 78 పరుగులు చేశాడు. ఆ తర్వాత ఎనిమిది, తొమ్మిదో స్థానంలో వచ్చిన మోండల్ 53 నాటౌట్, ఆకాశ్‌దీప్( 18 బంతుల్లో 8 సిక్సర్లతో 53 పరుగులు) టి20 తరహాలో అలరించాడు. ఇలా తొమ్మిది మంది బ్యాటర్లు కనీసం హాఫ్ సెంచరీ నమోదు చేయడంతో బెంగాల్ జట్టు 7 వికెట్ల నష్టానికి 773 పరుగులు భారీ స్కోరు వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది.
అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన జార్ఖండ్ 34 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది. కెప్టెన్ సౌరబ్ తివారీ 25, విరాట్ సింగ్ 13 పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకముందు ఓపెనర్ నిజామ్ సిద్దికీ 53 పరుగులు చేసి ఔటవ్వగా.. మరో ఓపెనర్ కుమార్ డియోబ్రాత్ 11 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు.
చదవండి: Ranji Trophy 2022: నమ్మశక్యం కాని క్యాచ్.. వీడియో వైరల్
రహానే స్థానంలో అరంగేట్రం.. డబుల్ సెంచరీతో కొత్త చరిత్ర; ఎవరీ సువేద్ పార్కర్
Bengal Creates History!#Cricket #FirstClassCricket #Bengal #RanjiTrophy pic.twitter.com/BN8gziQNrB
— CRICKETNMORE (@cricketnmore) June 8, 2022
Comments
Please login to add a commentAdd a comment