సెంచరీతో బెంగాల్‌ను ఆదుకున్న అనుస్తుప్‌ | Anustup Majumdar Made Century Against Bengal In Ranji Trophy Semi Final | Sakshi
Sakshi News home page

సెంచరీతో బెంగాల్‌ను ఆదుకున్న అనుస్తుప్‌

Published Sun, Mar 1 2020 3:17 AM | Last Updated on Sun, Mar 1 2020 3:17 AM

Anustup Majumdar Made Century Against Bengal In Ranji Trophy Semi Final - Sakshi

కోల్‌కతా: మిడిల్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మన్‌ అనుస్తుప్‌ (120 బ్యాటింగ్‌; 18 ఫోర్లు, సిక్స్‌) అజేయ సెంచరీతో బెంగాల్‌ను ఆదుకోవడంతో... కర్ణాటకతో ఆరంభమైన రంజీ ట్రోఫీ క్రికెట్‌ టోర్నీ సెమీఫైనల్‌ మ్యాచ్‌లో ఆ జట్టు తొలి రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 9 వికెట్లకు 275 పరుగులు చేసింది. బెంగాల్‌ ఒక దశలో 67 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో అనుస్తుప్‌... అహ్మద్‌ (35; 7 ఫోర్లు)తో ఏడో వికెట్‌కు 72 పరుగులు, అకాశ్‌ దీప్‌ (44; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు)తో కలిసి ఎనిమిదో వికెట్‌కు 103 పరుగులు జోడించాడు. గుజరాత్‌తో జరుగుతున్న మరో సెమీఫైనల్లో సౌరాష్ట్ర  ఆట ముగిసే సమయానికి 5 వికెట్లకు 217 పరుగులు చేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement