
రంజీ ట్రోఫీ క్రికెట్ టోర్నీలో భాగంగా బెంగాల్‌తో జరిగిన ఎలైట్ గ్రూప్ 'బి'మ్యాచ్‌లో హైదరాబాద్ 72 పరుగుల తేడాతో ఓటమి చెందింది. 239 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ 166 పరుగులకే ఆలౌటైంది. హైదరాబాద్ బ్యాటర్లలో తిలక్ వర్మ(90) మినహా మిగతా వారంతా విఫలమయ్యారు. బెంగాల్ బౌలర్లలో ఆక్ష్‌దీప్ నాలుగు వికెట్లు పడగొట్టగా, షబాజ్ ఆహ్మద్ మూడు వికెట్లు సాధించాడు.
ఆంధ్ర, సర్వీసెస్ జట్ల మధ్య మ్యాచ్ ‘డ్రా
తిరువనంతపురం: రంజీ ట్రోఫీ క్రికెట్ టోర్నీలో ఆంధ్ర, సర్వీసెస్ జట్ల మధ్య మ్యాచ్ ‘డ్రా’గా ముగిసింది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం ఆధారంగా ఆంధ్రకు 3 పాయింట్లు లభించాయి. ఆట చివరిరోజు రెండో ఇన్నింగ్స్‌లో ఆంధ్ర జట్టు 4 వికెట్లకు 220 పరుగులు చేసింది. జ్ఞానేశ్వర్ (125; 13 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీ చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment