రికీ భుయ్‌ అజేయ శతకం | Ricky Bhuis unbeaten century | Sakshi
Sakshi News home page

రికీ భుయ్‌ అజేయ శతకం

Jan 8 2024 4:29 AM | Updated on Jan 8 2024 4:29 AM

Ricky Bhuis unbeaten century - Sakshi

విశాఖ స్పోర్ట్స్‌: బెంగాల్‌ జట్టుతో జరుగుతున్న రంజీ ట్రోఫీ ఎలైట్‌ డివిజన్‌ గ్రూప్‌ ‘బి’ మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యానికి 71 పరుగుల దూరంలో నిలిచింది. డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర రెడ్డి ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆంధ్ర జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 133 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 339 పరుగులు సాధించింది.

రికీ భుయ్‌ (243 బంతుల్లో 107 బ్యాటింగ్‌; 12 ఫోర్లు, 1 సిక్స్‌) అజేయ సెంచరీ సాధించి ఆంధ్ర జట్టును ఆదుకున్నాడు. ఓవర్‌నైట్‌ స్కోరు 119/3తో మూడో రోజు ఆట కొనసాగించిన ఆంధ్ర మూడు వికెట్లు కోల్పోయి మరో 220 పరుగులు సాధించింది. కెప్టెన్‌ హనుమ విహారి (51; 7 ఫోర్లు)తో కలిసి రికీ భుయ్‌ నాలుగో వికెట్‌కు 87 పరుగులు జత చేశాడు.

అనంతరం నితీశ్‌ కుమార్‌ రెడ్డి (30; 6 ఫోర్లు)తో ఆరో వికెట్‌కు రికీ భుయ్‌ 71 పరుగులు జోడించాడు. ప్రస్తుతం షోయబ్‌ మొహమ్మద్‌ ఖాన్‌ (31 బ్యాటింగ్‌; 4 ఫోర్లు, 1 సిక్స్‌)తో కలిసి రికీ భుయ్‌ ఏడో వికెట్‌కు అజేయంగా 61 పరుగులు జత చేశాడు. బెంగాల్‌ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 409 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement