
శ్రీలంక క్రికెట్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ త్వరలో కొత్త పాత్రలోకి ప్రవేశించబోతున్నాడు. తమిళుల ప్రాబల్యం అధికంగా ఉన్న నార్తర్న్ ప్రావిన్స్‌కు మురళీధరన్‌ను గవర్నర్‌గా నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గవర్నర్ పదవిని స్వీకరించాలంటూ లంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స స్వయంగా ఆహ్వానించినట్లు సమాచారం. శ్రీలంక తరఫున 133 టెస్టులు ఆడి 800 వికెట్లు తీసిన 47 ఏళ్ల మురళీధరన్ 2011 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్‌తో రిటైర్మెంట్ ప్రకటించాడు.