ఆ విషయం చెప్పింది వినూమన్కడే: గవాస్కర్
ముంబై: తాను భారత క్రికెట్ టీంకు సెలెక్ట్ అయ్యానని చెప్పింది మాజీ భారత కెప్టెన్ ఆల్ రౌండర్ వినుమన్కడేనని మాజీ దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ గుర్తుచేసుకున్నాడు. గత రాత్రి దిగ్గజ క్రికెటర్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన వినూమన్కడ్ 100వ జయంతి వేడుకలకు హాజరైన సన్నీ ఆయనతో గడిపిన జ్ఞాపకలను నెమరువేసుకున్నాడు. 1917 ఏప్రిల్ 12న జన్మించిన వినూమన్కడ్ భారత్ తరుపున 44 టెస్టులు ఆడి 2,109 పరుగులతో 162 వికెట్లు పడగొట్టాడు.
4 దశాబ్దల క్రితం మా ఇంట్లోకి వెళ్తుండగా నాకు తియ్యని వార్తని మా గురువు వినుమన్కడ్ ఫోన్‌లో వినిపించారని సన్నీ తెలిపాడు. ‘వినూ భాయ్ ఫోన్‌లో బెటా నువ్వు భారత క్రికెట్ జట్టుకు ఎంపికయ్యావు, ఫ్రీగా బ్యాటింగ్ చేయి’ అన్న మాటలను సన్నీ ఈ వేడుకలో గుర్తు చేసుకున్నాడు. ఈ మాటలు నాకెంతో సంతోషం కల్గించాయని గవాస్కర్ పేర్కొన్నాడు. గవాస్కర్ 1971లో వెస్టిండీస్ పర్యటనకు తొలిసారి భారత జట్టుకు ఎంపికయ్యాడు. ఆ పర్యటనలో ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ డాన్ బ్రాడ్‌మన్ సైతం వినుమన్కడ్ గురించి గొప్పగా చెప్పాడని భారత్ తరుపున 125 టెస్టులు ఆడి 10,122 పరుగులు చేసిన గవాస్కర్ పేర్కొన్నాడు. ఈ వేడుకలకు భారత మాజీ క్రికెటర్లు అజిత్ వాడెకర్, వాసు, మాధవ్ ఆప్టే, సలీం దురాణీలు పాల్గొన్నారు.