Vinoo Mankad
-
'మన్కడింగ్'పై పోరాటం చేసిన మాజీ క్రికెటర్ రాహుల్ మన్కడ్ కన్నుమూత
Rahul Mankad Passed Away: భారత మాజీ క్రికెటర్, దిగ్గజ ఆటగాడు వినూ మన్కడ్ చిన్న కుమారుడు ముంబై మాజీ ఆల్‌రౌండర్ రాహుల్ మన్కడ్ (66) అలియాస్ జిగ్గా భాయ్ కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న రాహుల్.. బుధవారం (మార్చి 30) లండన్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. తండ్రి వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని క్రికెటర్‌గా ఎదిగిన రాహుల్.. 1972-85 మధ్యకాలంలో ముంబై రంజీ జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. జిగ్గా భాయ్.. ముంబై తరఫున 47 మ్యాచ్‌లు ఆడి 5 శతకాలు, 12 అర్ధ శతకాల సాయంతో 2111 పరుగులు, 162 వికెట్లు పడగొట్టాడు. రాహుల్ మన్కడ్ కు భార్య ఇద్దరు పిల్లలున్నారు. రాహుల్ సోదరులు అశోక్ మన్కడ్, అతుల్ మన్కడ్ కూడా క్రికెటర్లుగా రాణించారు. వీరిలో అశోక్ టీమిండియాకు ప్రాతనిధ్యం వహించాడు. రాహుల్ మృతిపై పలవురు మాజీ క్రికెటర్లు, ప్రముఖ జర్నలిస్టు రాజ్‌దీప్ సర్దేశాయ్ ట్విటర్ వేదికగా సంతాపం తెలిపారు. కాగా, రాహుల్.. తన తండ్రి వినూ మన్కడ్ పేరు మీద ఉన్న ‘మన్కడింగ్' (నాన్ స్ట్రైకింగ్ ఎండ్ లో ఉన్న బ్యాటర్ ను బౌలర్ ఔట్ చేయడం) ను నిషేధించాలని జీవితాంతం పోరాడారు. అయితే ఇటీవలే మెరిల్బోర్న్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) మన్కడింగ్ అనే పదాన్ని నిషేధించి, అలా ఔట్ అయిన విధానాన్ని సాధారణ రనౌట్ గానే పరిగణించాలని నిర్ణయించింది. అయితే ఈ నిబంధన కార్యరూపం దాల్చకుండానే రాహుల్ కన్నుమూయడం బాధాకరం. మన్కడింగ్‌కు సంబంధించి ఎంసీసీ కొత్త రూల్స్ ఈ ఏడాది అక్టోబర్ నుంచి అమల్లోకి రానున్నాయి. చదవండి: షేన్ వార్న్‌కు కడసారి వీడ్కోలు పలికిన దిగ్గజ క్రికెటర్లు -
జడేజా సరికొత్త రికార్డు.. టీమిండియా తరపున మూడో ఆటగాడిగా
టీమిండియా, శ్రీలంక మధ్య జరుగతున్న తొలి టెస్టు రవీంద్ర టెస్టుగా మారిపోయింది. బ్యాటింగ్‌లో 150కి పైగా పరుగులు.. బౌలింగ్‌లో ఐదు వికెట్లతో మెరిసి ఆల్‌రౌండర్ అనే పదానికి మరోసారి అర్థం చెప్పాడు. స్వదేశీ పిచ్‌లపై తన బౌలింగ్ ఎంత ప్రమాదకరంగా ఉంటుందో మరోసారి రుచి చూపించాడు. లంకతో తొలి టెస్టులో ముందు బ్యాటింగ్‌లో 228 బంతుల్లో 17 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 175 పరుగులు నాటౌట్‌గా నిలిచాడు. ఆ తర్వాత బౌలింగ్‌లో 13 ఓవర్లు వేసి 41 పరుగులిచ్చి ఐదు వికెట్లు తీశాడు. తద్వారా జడేజా టెస్టుల్లో సరికొత్త రికార్డు సృష్టించాడు. అవేంటో పరిశీలిద్దాం. ►ఒకే టెస్టు మ్యాచ్‌లో 150కి పైగా పరుగులు.. ఐదు వికెట్లు తీసిన ఆరో ఆటగాడిగా .. టీమిండియా తరపున మూడో ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ►ఇంతకముందు టీమిండియా తరపున వినూ మాన్కడ్ 1952లో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టులో బ్యాటింగ్‌లో 184 పరుగులు.. బౌలింగ్‌లో ఐదు వికెట్లు తీశాడు. ►1962లో వెస్టిండీస్‌తో టెస్టులో మరో భారత క్రికెటర్ పాలి ఉమ్రిగర్ 172 పరుగులు నాటౌట్.. ఐదు వికెట్లు తీశాడు ►ఇక ఓవరాల్‌గా జడేజా ఆరో స్థానంలో ఉండగా.. వినూ మాన్కడ్, డెనిస్ అట్కిన్సన్, పాలి ఉమ్రిగర్, గ్యారీ సోబర్స్, ముస్తాక్ మహ్మద్ ఉన్నారు. ►జడేజా ఆఖరుసారి టెస్టుల్లో 2017లో ఐదు వికెట్లు తీశాడు. అప్పుడు ప్రత్యర్థి శ్రీలంకనే కావడం విశేషం. కొలంబో వేదికగా జరిగిన ఆ టెస్టులో జడేజా 152 పరుగులిచ్చి ఐదు వికెట్లు పడగొట్టాడు. తాజాగా మరోసారి శ్రీలంకపై ఐదు వికెట్ల ఫీట్‌ను సాధించాడు. ►జడేజాకు టెస్టుల్లో ఐదు వికెట్లు తీయడం ఇది పదోసారి. ►ఇక టెస్టులో టీమిండియా శ్రీలంకపై తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యం సాధించడం పదోసారి కావడం విశేషం. A 5⃣-wicket haul for @imjadeja as #TeamIndia wrap Sri Lanka innings for 174 🔥🔥 Follow the match ▶️ https://t.co/XaUgOQVg3O#INDvSL | @Paytm pic.twitter.com/iJoGxRr6cY — BCCI (@BCCI) March 6, 2022 -
'మన్కడింగ్' అనడం ఆపేయండి.. గంగూలీకి మాజీ క్రికెటర్ కుమారుడి లేఖ
Vinoo Mankad Son Rahul Writes Email To Sourav Ganguly Stop Using Mankading.. క్రికెట్లో మన్కడింగ్ అనే పదం వినగానే.. మొదటగా గుర్తుకువచ్చేది టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్. మన్కడింగ్ అంటే.. బౌలర్ బంతి వేయకముందే నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న బ్యాట్స్‌మన్ క్రీజు దాటి బయటకు వెళితే.. బౌలర్‌కు రనౌట్ చేసే అవకాశం ఉంటుంది. దీనిని అశ్విన్ 2019 ఐపీఎల్ సందర్భంగా రాజస్తాన్ రాయల్స్ ఆటగాడు జాస్ బట్లర్‌పై ఉపయోగించడం అప్పట్లో వివాదానికి దారి తీసింది. ఈ విషయంలో కొందరు అశ్విన్‌ను తప్పు బడితే.. మరికొందరు అతన్ని సమర్థించారు. చదవండి: Rahul Dravid: కోచ్ అనే పదానికి అర్థం మారుస్తున్న ద్రవిడ్.. వీడియో వైరల్ అయితే అంతకముందే టీమిండియా నుంచి వినూ మన్కడ్ రెండుసార్లు ఒకే ఆటగాడిని మన్కడింగ్ చేశారు. 1947-48లో టీమిండియా ఆస్ట్రేలియాలో పర్యటించింది. సిడ్నీ వేదికగా జరిగిన తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్ బ్యాట్స్‌మన్ బిల్ బ్రౌన్ పదేపదే క్రీజు దాటుతుండడంతో వినూ మాన్కడ్ అతన్ని హెచ్చరించాడు. మరోసారి బిల్ బ్రౌన్ బంతి వేయకుండానే క్రీజు దాటడంతో మాన్కడ్ బ్రౌన్‌ను మన్కడింగ్ చేశాడు. ఆ తర్వాత రెండో టెస్టులోనూ బ్రౌన్ ఇదే తరహాలో చేయడంతో వినూ మాన్కడ్ ఈసారి అతనికి వార్నింగ్ ఇవ్వకుండానే మన్కడింగ్(రనౌట్ చేశాడు). ఈ చర్య అప్పట్లో పెద్ద వివాదంగా మారింది. కాగా ఈ వివాదం తర్వాతే వినూకు.. వినూ మన్కడ్ అని పేరు రావడం విశేషం. చదవండి: ఎందుకు ఆగిపోయావు అశ్విన్..? అయితే బీసీసీఐ మాత్రం ఇప్పటికి మన్కడింగ్ అనే పదాన్ని వాడుతుండడంపై వినూ మన్కడ్ కుమారుడు రాహుల్ మన్కడ్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. తాజగా రాహుల్ మన్కడ్ బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి మన్కడింగ్ అంశంపై ఈమెయిల్ ద్వారా లేఖ రాశారు. ఐసీసీ మన్కడింగ్ పదాన్ని తొలగించిందని.. దానిని రనౌట్ అనే పిలుస్తుందని.. ఇప్పటికైనా బీసీసీఐ మన్కడింగ్ అని పిలవడం మానేయాలంటూ లేఖ ద్వారా గంగూలీని కోరాడు. ''నా తండ్రి వినూ మన్కడ్ దేశం తరపున ప్రాతినిధ్యం వహించిన తొలితరం క్రికెటర్లలో ఒకరు. ఆటగాడిగా ఎంతో గౌరవం సంపాదించిన ఆయనపై మన్కడింగ్ అనే పదం ఉపయోగించడం నాకు బాధ కలిగించింది. ఐసీసీ ఆ పదాన్ని తొలగించింది. క్రికెట్ లా బుక్స్ ప్రకారం మన్కడింగ్‌ను రనౌట్ అనే పేరుతో పిలుస్తున్నారు. మన్కడింగ్ అనే పదం వినగానే నా తండ్రి పేరు ఎక్కువగా వినిపిస్తుంది. ఇది నాకు నచ్చలేదు. అందుకే బీసీసీఐని విజ్ఞప్తి చేస్తున్నా. మన్కడింగ్ అని పిలవడం ఆపేయండి.. ఐసీసీ ప్రకారం దానిని రనౌట్‌గా పరిగణించడం ఉత్తమం'' అంటూ పేర్కొన్నారు. చదవండి: అరంగేట్ర మ్యాచ్‌లోనే నలుగురిని మన్కడింగ్ చేసిన బౌలర్ ఇక వినూ మాన్కడ్ టీమిండియా తరపున 44 టెస్టులు ఆడి 2109 పరుగులు చేశాడు. మంచి ఆల్‌రౌండర్‌గా గుర్తింపు పొందిన మాన్కడ్ బౌలింగ్‌లోనూ 132 వికెట్లు తీశాడు. 1996లో క్రికెట్లో అతని సేవలకు గాను భారత ప్రభుత్వం అతని పేరుమీద పోస్టల్ స్టాంప్ విడుదల చేసింది. ఇక ఈ ఏడాది మొదట్లో వినూ మన్కడ్ ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు సంపాదించారు. -
ఐసీసీ ‘హాల్ ఆఫ్ ఫేమ్’లో వినూ మన్కడ్, సంగక్కర
దుబాయ్: తొలి ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌ను పురస్కరించుకొని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) పది మంది దిగ్గజ క్రికెటర్లకు ‘హాల్ ఆఫ్ ఫేమ్’లో చోటు కల్పించింది. ఇందులో భారత్ నుంచి దివంగత క్రికెటర్ వినూ మన్కడ్‌కు... శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కరకుమార సంగక్కరకు స్థానం దక్కింది. 1978లో మృతి చెందిన వినూ మన్కడ్ భారత్ తరఫున 1947 నుంచి 1959 మధ్య కాలంలో 44 టెస్టులు ఆడి 2,109 పరుగులు చేయడంతోపాటు 162 వికెట్లు తీశారు. మేటి ఆల్‌రౌండర్‌గా పేరున్న వినూ మన్కడ్ 1952లో ఇంగ్లండ్‌తో లార్డ్స్‌లో జరిగిన టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో 72, రెండో ఇన్నింగ్స్‌లో 184 పరుగులు చేయడంతోపాటు బౌలింగ్‌లో ఏకంగా 97 ఓవర్లు వేశారు. దిగ్గజ క్రికెటర్ సంగక్కర శ్రీలంక తరఫున 134 టెస్టులు (12,400 పరుగులు), 404 వన్డేలు (14,234 పరుగులు), 56 టి20 మ్యాచ్‌లు (1,382 పరు గులు) ఆడాడు. వినూ మన్కడ్, సంగక్కరలతోపాటు మోంటీ నోబుల్ (ఆస్ట్రేలియా), కాన్స్టన్ టైన్ (వెస్టిండీస్), స్టాన్ మెక్‌కేబ్ (ఆస్ట్రేలియా), డెక్స్టర్ (ఇంగ్లండ్), హేన్స్ (వెస్టిండీస్), బాబ్ విల్లీస్ (ఇంగ్లండ్), ఆండీ ఫ్లవర్ (జింబాబ్వే) కూడా ‘హాల్ ఆఫ్ ఫేమ్’లో స్థానం పొందారు. చదవండి: సిరీస్‌తోపాటు ‘టాప్’ ర్యాంక్ సొంతం -
‘అశ్విన్ తప్పులేదు.. మన్కడింగ్ ఉండాల్సిందే’
లండన్ : మన్కడింగ్ వివాదంలో చిక్కుకొని తీవ్ర విమర్శలపాలవుతున్న కింగ్స్‌ఎలెవెన్ పంజాబ్ కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్‌కు క్రికెట్ నిబంధనలు రూపొందించే ఎంసీసీ (మెరిలిన్ క్రికెట్ క్లబ్) మద్దుతుగా నిలిచింది. సోమవారం రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌లో అశ్విన్.. రాజస్తాన్ ఆటగాడు జోస్ బట్లర్ మన్కడింగ్ విధానంలో ఔట్ చేసిన విషయం తెలిసిందే. బట్లర్ ఔట్ రాజస్తాన్ విజయవకాశాలు దెబ్బతీయగా.. పంజాబ్న విజయానికి కారణమైంది. అయితే అశ్విన్ క్రీడాస్పూర్తిగా విరుద్దంగా ప్రవర్తించాడని అభిమానులు, మాజీ క్రికెటర్లు అతనిపై దుమ్మెత్తిపోస్తున్నారు. దీంతో మన్కడింగ్ నిబంధన తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో ఎంసీసీ ఆ నిబంధనపై వివరణ ఇచ్చింది. ఈ విషయంలో అశ్విన్‌ది ఏమాత్రం తప్పులేదని, అతడు నిబంధనల మేరకే నడుచుకున్నాడని స్పష్టం చేసింది. అంతేకాకుండా మన్కడింగ్ నిబంధన ఉండాల్సిన అవసరం ఎంతో ఉందని మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొంది. చదవండి : మన్కడింగ్ ఔట్ అంటే ఏంటో తెలుసా? ‘ఈ నిబంధన ఎంతో ముఖ్యం. ఇది లేకుంటే నాన్‌స్ట్రైకర్స్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తారు. బౌలర్ బంతి వేయకుండానే సగం పిచ్ దాటేస్తారు. ఇలా జరగకుండాలంటే ఈ నిబంధన ఉండాల్సిందే. ఇక బౌలర్ బ్యాట్స్‌మన్‌ను హెచ్చరించాలనే విషయం నిబంధనలో లేదు. ఇది క్రీడాస్పూర్తికి విరుద్దం కూడా కాదు. బౌలర్ బంతి వేయకుండానే నాన్‌స్ట్రైకర్ క్రీజు దాటితేనే రనౌట్ అవుతారు. ఒక వేళ అశ్విన్ కావాలనే అలా చేసి ఉంటే మాత్రం అది క్రీడా స్పూర్తికి విరుద్దం. కానీ అశ్విన్ అలా చేయలేదని చెప్పాడు. టీవీ అంపైర్ కూడా నిబంధనల ప్రకారమే ఔట్ ఇచ్చాడు. నాన్‌స్ట్రైకర్స్ మాత్రం ఎప్పుడూ జాగ్రత్తగానే ఉండాలి. నిబంధనలకు విరుద్దంగా అడ్వాంటేజ్ తీసుకోవడానికి ప్రయత్నించకూడదు. బౌలర్లు కూడా నిబంధనలకు లోబడే టైమ్ ఫ్రేమ్‌లోనే బౌలింగ్ చేయాలి’ అని 41.16 నిబంధనపై ఎంసీసీ స్పష్టతనిచ్చింది. చదవండి: అశ్విన్ ఏందీ తొండాట..! -
మన్కడింగ్ ఔట్ అంటే ఏంటో తెలుసా?
సాక్షి, హైదరాబాద్ : ‘మన్కడింగ్ ఔట్’ గత అర్ధరాత్రి నుంచి సోషల్ మీడియాలో మార్మోగుతున్న పేరు. క్రికెట్ అభిమానుల మధ్య చర్చకు వస్తున్న పదం. రాజస్తాన్ రాయల్స్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్ అశ్విన్ బ్యాట్స్‌మన్‌ను ఔట్ చేయడానికి ఈ తరహా టెక్నిక్ ఉపయోగించడంతో ఈ పదం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఈ టెక్నిక్‌తో రాజస్తాన్ బ్యాట్స్‌మెన్ జోస్ బట్లర్‌ను అశ్విన్ పెవిలియన్‌కు చేర్చాడు. నిబంధనలు అది ఔటేనని చెబుతున్నా.. అభిమానులు, మాజీ క్రికెటర్లు మాత్రం తొండాటని అశ్విన్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. మన్కడింగ్ ఔట్ ... క్రికెట్లోని వివాదాస్పద నిబంధనల్లో ఒకటి. క్రికెట్ నియమావళి 41.16 ప్రకారం బౌలర్ బంతి విసరకముందే నాన్ స్ట్రయికర్ క్రీజ్ దాటినప్పుడు అతడిని అవుట్ చేసే అవకాశం ఈ నిబంధన కల్పిస్తుంది. అయితే దీన్ని1947–48 ఆస్ట్రేలియా పర్యటనలో తొలిసారిగా భారత దిగ్గజ బౌలర్ వినూ మన్కడ్ చేయడంతో ఆయన పేరుమీదుగా మన్కడింగ్ నిబంధనగా క్రికెట్ నిబంధనలు రూపొందించే ఎంసీసీ (మెరిలిన్ క్రికెట్ క్లబ్) నియమావళిలో చేర్చింది. ఆ పర్యటనలో వినూ మన్కడ్ బౌలింగ్ చేస్తున్న సమయంలో ఆసీస్ బ్యాట్స్‌మన్ బిల్ బ్రౌన్ పదేపదే బంతి వేయకముందే క్రీజు వదిలి పరుగుకు ప్రయత్నించాడు. దీంతో పలుమార్లు మన్కడ్ అతన్ని వారించినా వినిపించుకోలేదు. దీంతో బ్రౌన్ క్రీజు దాటిన తర్వాత మన్కడ్ అతన్ని రనౌట్ చేయడంతో అతనిపై తీవ్ర విమర్శలు చెలరేగాయి. ఈ పర్యటనలో మరోసారి కూడా మన్కడ్ ..బ్రౌన్‌ను ఔట్ చేశాడు. అప్పటినుంచి ఈ రనౌట్‌ను మన్కడింగ్ ఔట్‌గా పిలుస్తున్నారు. బౌలర్లకు అనుకూలంగా మార్పు.. అయితే తొలుత నిబంధన 42.15 ప్రకారం బౌలర్ బంతి విసరకముందే నాన్ స్ట్రయికర్ క్రీజ్ దాటినప్పుడు మాత్రమే అతడిని అవుట్ చేసే అవకాశం కలిగేది. కానీ ఎంసీసీ బౌలర్లకు అనుకూలంగా ఈ నిబంధనను 41.16 గా మార్చేసింది. గతంలో బౌలర్ యాక్షన్‌కు ముందు మాత్రమే ఔట్ చేసే అవకాశముండేది. కానీ సవరించిన నిబంధనలో యాక్షన్ (బంతి విడుదలకు ముందు చేయి పూర్తిగా తిరిగినా) తర్వాత కూడా ఔట్ చేసే వెసులుబాటు కల్పించారు. అయితే ఇది క్రీడాస్పూర్తి విరుద్దమని, ఈ నిబంధనను తొలిగించాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది. గవాస్కర్ గరం.. ఈ మన్కడింగ్ పదాన్నే పూర్తిగా తొలిగించాలని భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఏంసీసీకి సూచించారు. క్రీడాస్ఫూర్తికి విరుద్ధమైన రనౌట్‌గా పరిగణించే ఈ ప్రక్రియకు భారత క్రికెట్ దిగ్గజం పేరును కొనసాగించడాన్ని ఆయన తప్పుబట్టారు. అంతగా అవసరమైతే తొలిసారిగా ఇలా ఔటైన బిల్ బౌన్ పేరు మీదుగా బౌన్డ్ అని పిలువాలంటూ పేర్కొన్నాడు. -
'అప్పుడు వారు.. ఇప్పుడు వీరు'
ముంబై: భారత క్రికెట్ జట్టుకు ప్రధాన కోచ్‌గా పనిచేసిన అనిల్ కుంబ్లే దాదాపు ఐదు నెలల క్రితం తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లితో విభేదాలు కారణంగా కుంబ్లే తన పదవి నుంచి తప్పుకున్నాడన్నది కాదనలేని సత్యం. అయితే వీరిద్దరి వివాదాన్ని సుమారు 65 ఏళ్ల నాటి సంఘటనతో పోల్చారు రామచంద్ర గుహ. బీసీసీఐ పాలకుల కమిటీ సభ్యత్వానికి ఆరు నెలల క్రితం రాజీనామా చేసిన గుహ.. తొలిసారి క్రికెట్ గురించి బహిరంగంగా పెదవి విప్పారు. కొన్ని నెలల క్రితం కోహ్లి-కుంబ్లేల మధ్య చోటు చేసుకున్న వివాదాన్ని 1952లో సీకే నాయుడు-వినూ మన్కడ్ వివాదంతో పోల్చారు. బాంబే జింఖానా మైదానంలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన గుహ మాట్లాడారు. 'బీసీసీఐ పరిపాలకుల కమిటీకి ఆరు నెలల క్రితం రాజీనామా చేశాను. ఆ తర్వాత క్రికెట్‌పై బహిరంగంగా మాట్లాడటం ఇదే తొలిసారి. 1952లో కల్నల్ సీకే నాయుడు, వినూ మన్కడ్ మధ్య పెద్ద వివాదం నడిచింది. ఆ సమయంలో నాయుడు సెలక్షన్ కమిటీ ఛైర్మన్‌గా ఉండగా,. వినూ మన్కడ్ అద్భుతమైన క్రికెటర్. అది భారత జట్టు ఇంగ్లండ్‌లో పర్యటించిన సమయం. లంకాషైర్ నుంచి మన్కడ్‌కు ఓ ఒప్పందం ప్రతిపాదన వచ్చింది. జట్టులోకి తీసుకుంటారని నాకు హామీ ఇస్తే లంకషైర్తో ఒప్పందం కుదుర్చుకోనని మన్కడ్ బీసీసీఐకి తెలిపారు. ‘మేమెలాంటి హామీ ఇవ్వలేం అని అందుకు నాయుడు బదులిచ్చారు. ఆ క్రమంలోనే లార్డ్స్‌లో జరిగిన తొలి టెస్టులో ఓడింది. మన్కడ్ ఆడాడు. తొలి ఇన్నింగ్స్‌లో 72, రెండో ఇన్నింగ్స్‌లో 184 పరుగులు చేశాడు. అప్పుడు సీకే నాయుడు, మన్కడ్‌కు మధ్య వివాదం ఏ విధంగా జరిగిందో.. ఇప్పుడు కోహ్లి-కుంబ్లేల మధ్య జరిగింది. కాకపోతే అప్పుడు క్రికెట్ పరిపాలకులది పైచేయి ఉంటే.. ఇప్పుడు ఆటగాళ్లే క్రికెట్ పరిపాలన విధానాన్ని శాసిస్తున్నారు' అని గుహ అభిప్రాయపడ్డాడు. -
ఆ విషయం చెప్పింది వినూమన్కడే: గవాస్కర్
ముంబై: తాను భారత క్రికెట్ టీంకు సెలెక్ట్ అయ్యానని చెప్పింది మాజీ భారత కెప్టెన్ ఆల్ రౌండర్ వినుమన్కడేనని మాజీ దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ గుర్తుచేసుకున్నాడు. గత రాత్రి దిగ్గజ క్రికెటర్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన వినూమన్కడ్ 100వ జయంతి వేడుకలకు హాజరైన సన్నీ ఆయనతో గడిపిన జ్ఞాపకలను నెమరువేసుకున్నాడు. 1917 ఏప్రిల్ 12న జన్మించిన వినూమన్కడ్ భారత్ తరుపున 44 టెస్టులు ఆడి 2,109 పరుగులతో 162 వికెట్లు పడగొట్టాడు. 4 దశాబ్దల క్రితం మా ఇంట్లోకి వెళ్తుండగా నాకు తియ్యని వార్తని మా గురువు వినుమన్కడ్ ఫోన్లో వినిపించారని సన్నీ తెలిపాడు. ‘వినూ భాయ్ ఫోన్లో బెటా నువ్వు భారత క్రికెట్ జట్టుకు ఎంపికయ్యావు, ఫ్రీగా బ్యాటింగ్ చేయి’ అన్న మాటలను సన్నీ ఈ వేడుకలో గుర్తు చేసుకున్నాడు. ఈ మాటలు నాకెంతో సంతోషం కల్గించాయని గవాస్కర్ పేర్కొన్నాడు. గవాస్కర్ 1971లో వెస్టిండీస్ పర్యటనకు తొలిసారి భారత జట్టుకు ఎంపికయ్యాడు. ఆ పర్యటనలో ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ డాన్ బ్రాడ్‌మన్ సైతం వినుమన్కడ్ గురించి గొప్పగా చెప్పాడని భారత్ తరుపున 125 టెస్టులు ఆడి 10,122 పరుగులు చేసిన గవాస్కర్ పేర్కొన్నాడు. ఈ వేడుకలకు భారత మాజీ క్రికెటర్లు అజిత్ వాడెకర్, వాసు, మాధవ్ ఆప్టే, సలీం దురాణీలు పాల్గొన్నారు.