
లండన్ : మన్కడింగ్ వివాదంలో చిక్కుకొని తీవ్ర విమర్శలపాలవుతున్న కింగ్స్‌ఎలెవెన్ పంజాబ్ కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్‌కు క్రికెట్ నిబంధనలు రూపొందించే ఎంసీసీ (మెరిలిన్ క్రికెట్ క్లబ్) మద్దుతుగా నిలిచింది. సోమవారం రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌లో అశ్విన్.. రాజస్తాన్ ఆటగాడు జోస్ బట్లర్ మన్కడింగ్ విధానంలో ఔట్ చేసిన విషయం తెలిసిందే. బట్లర్ ఔట్ రాజస్తాన్ విజయవకాశాలు దెబ్బతీయగా.. పంజాబ్‌న విజయానికి కారణమైంది. అయితే అశ్విన్ క్రీడాస్పూర్తిగా విరుద్దంగా ప్రవర్తించాడని అభిమానులు, మాజీ క్రికెటర్లు అతనిపై దుమ్మెత్తిపోస్తున్నారు. దీంతో మన్కడింగ్ నిబంధన తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో ఎంసీసీ ఆ నిబంధనపై వివరణ ఇచ్చింది. ఈ విషయంలో అశ్విన్‌ది ఏమాత్రం తప్పులేదని, అతడు నిబంధనల మేరకే నడుచుకున్నాడని స్పష్టం చేసింది. అంతేకాకుండా మన్కడింగ్ నిబంధన ఉండాల్సిన అవసరం ఎంతో ఉందని మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొంది.
చదవండి : మన్కడింగ్ ఔట్ అంటే ఏంటో తెలుసా?
‘ఈ నిబంధన ఎంతో ముఖ్యం. ఇది లేకుంటే నాన్‌స్ట్రైకర్స్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తారు. బౌలర్ బంతి వేయకుండానే సగం పిచ్ దాటేస్తారు. ఇలా జరగకుండాలంటే ఈ నిబంధన ఉండాల్సిందే. ఇక బౌలర్ బ్యాట్స్‌మన్‌ను హెచ్చరించాలనే విషయం నిబంధనలో లేదు. ఇది క్రీడాస్పూర్తికి విరుద్దం కూడా కాదు. బౌలర్ బంతి వేయకుండానే నాన్‌స్ట్రైకర్ క్రీజు దాటితేనే రనౌట్ అవుతారు. ఒక వేళ అశ్విన్ కావాలనే అలా చేసి ఉంటే మాత్రం అది క్రీడా స్పూర్తికి విరుద్దం. కానీ అశ్విన్ అలా చేయలేదని చెప్పాడు. టీవీ అంపైర్ కూడా నిబంధనల ప్రకారమే ఔట్ ఇచ్చాడు. నాన్‌స్ట్రైకర్స్ మాత్రం ఎప్పుడూ జాగ్రత్తగానే ఉండాలి. నిబంధనలకు విరుద్దంగా అడ్వాంటేజ్ తీసుకోవడానికి ప్రయత్నించకూడదు. బౌలర్లు కూడా నిబంధనలకు లోబడే టైమ్ ఫ్రేమ్‌లోనే బౌలింగ్ చేయాలి’ అని 41.16 నిబంధనపై ఎంసీసీ స్పష్టతనిచ్చింది.
చదవండి: అశ్విన్ ఏందీ తొండాట..!
Comments
Please login to add a commentAdd a comment