gavaskar
-
Rohit Sharma: టీమిండియా కొంప కొల్లేరు చేస్తున్న రోహిత్
-
టీమిండియాకు మరో ధోని దొరికేశాడు
-
మోహిత్ కి పాండ్య పాఠాలు చెప్పడం ఏంటి ..!
-
లిటిల్ మాస్టర్ గుండెలపై ధోనీ సంతకం..
-
'వేలంలో ఏకంగా 10.75 కోట్లు.. అతడు ఒక అద్భుతమైన బౌలర్'
ఐపీఎల్-2022 మెగా వేలంలో టీమిండియా పేసర్ హర్షల్ పటేల్‌ను దక్కించకోవడానికి చాలా ప్రాంఛైజీలు పోటీ పడ్డాయి. చివరకి ఆర్సీబీ రూ. 10.75 కోట్ల భారీ ధరకు హర్షల్ పటేల్‌ను కొనుగోలు చేసింది. ఈ నేపథ్యంలో హర్షల్ పటేల్‌పై భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ ప్రశంసల వర్షం కురిపించాడు. మెగా వేలంలో హర్షల్ పటేల్ తగిన ధర దక్కిందని సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. ఇక వెస్టిండీస్‌తో జరిగిన తొలి టీ20లో రెండు వికెట్లు పడగొట్టి భారత విజయంలో హర్షల్ పటేల్ తన వంతు పాత్ర పోషించాడు. "వేలంలో దక్కిన ప్రతీ పైసా, ప్రతీ రూపాయికి హర్షల్ పటేల్ అర్హుడు. గత ఏడాది సీజన్లో హర్షల్ అద్భుతమైన ప్రదర్శన చేశాడు. అంతకుముందు అతడి బౌలింగ్ పేస్‌లో ఏటువంటి మార్పు లేకపోవడంతో బ్యాటర్లు ఈజీగా ఎదుర్కొనేవారు. కానీ అతడు ఇప్పుడు తనను తాను రూపు దిద్దు కున్నాడు. ప్రస్తుతం అద్భుతమైన పేస్‌తో హర్షల్ పటేల్ బౌలింగ్ చేస్తున్నాడు. తన పేస్‌లో మార్పులతో బ్యాటర్లను అతడు ఇబ్బంది పెడుతున్నాడు. అదే విధంగా అఖరి ఓవర్లలో అతడు స్లో బౌన్సర్లు, యార్కర్లు బౌలింగ్ చేయగలడు" అని గవాస్కర్ పేర్కొన్నాడు. చదవండి: IPL 2022: ఆర్సీబీ కెప్టెన్‌గా దక్షిణాఫ్రికా స్టార్ ఆటగాడు.. వేలంలో 7కోట్లు! -
పుజారా,రహానేలు కీలకం
న్యూఢిల్లీ:ఆస్ట్రేలియాతో త్వరలో ప్రారంభం కానున్న సిరిస్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లి మొదటి టెస్ట్‌కు మాత్రమే అందుబాటులో ఉండడంపై మాజీ కెప్టెన్ బ్యాటింగ్ దిగ్గజం సునీల్ గవాస్కర్ స్పందించారు. డిసెంబర్ 17న అడిలైడ్‌లో తొలి టెస్ట్ తరువాత కోహ్లి స్వదేశానికి రానున్న నేపథ్యంలో టెస్ట్ స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్ చేతేశ్వర్ పుజారా ,మరో సీనియర్ బ్యాట్స్‌మెన్ అజింక్యా రహానే బ్యాటింగ్ భారాన్ని మోయాలని సూచించారు. తన భార్య అనుష్క శర్మ మొదటి బిడ్డకు జన్మనిస్తుండటంతో కోహ్లి భారత్‌కు తిరిగి రావడం తెలిసిందే. టెస్ట్ వైస్ కెప్టెన్ రహానె మిగిలిన మూడు మ్యాచ్‌లలో భారత జట్టుకు నాయకత్వం వహిస్తాడు. పూజారాతో పాటు అదనపు బాధ్యతలను భరించాల్సిన అవసరం ఉందని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. "కెప్టెన్ లేకపోవడంతో మిగిలిన ఆటగాళ్లు బాధ్యతను తీసుకుని,అతని గైర్హాజరు కనపడకుండా ఆడాలని సూచించారు. రహానే , చేతేశ్వర్ పుజారాకు ఇది కఠినమైన సవాల్. ఈ ఇద్దరు ఆటగాళ్ళు తమ చెమట చిందించాల్సి ఉంటుందని"అని గవాస్కర్ అన్నారు పుజారానే ఉత్తమం. గవాస్కర్ కూడా పూజారాను బ్యాటింగ్ చేయమని ప్రోత్సహించాడు, 2018-19లో భారతదేశం చివరిసారి ఆస్ట్రేలియాలో పర్యటించింది. బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లో పుజారా అత్యధిక పరుగులు చేసి సిరీస్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. సిరీస్ మొత్తం నిలకడగా ఆడుతూ 74.42 సగటుతో మూడు సెంచరీలు,ఒక హఫ్ సెంచరీ సహాయంతో 521 పరుగులు చేశాడు. భారతదేశపు చారిత్రాత్మక 2-1 విజయానికి సౌరాష్ట్ర బ్యాట్స్ మాన్ సహనం, శాస్త్రీయ శైలి ఒక ప్రధాన కారణం. అతను దాదాపు 30 గంటలు బ్యాటింగ్ చేశాడు 1258 బంతులను ఎదుర్కొన్నాడు, ఆస్ట్రేలియాలో జరిగిన టెస్ట్ సిరీస్‌లో అత్యధిక బంతులను ఎదుర్కొన్న రాహుల్ ద్రవిడ్ రికార్డును బద్దలు కొట్టాడు. పరుగుల గురించి పెద్దగా చింతించకుండా ఎక్కువ సేపు బ్యాటింగ్ చేయడం ద్వారా బౌలర్లను ఎదుర్కొవటం పుజారాకు ఇష్టం. మిచెల్ స్టార్క్, పాట్ కమ్మిన్స్, జోష్ హాజిల్‌వుడ్ మరియు నాథన్ లియోన్లాంటి ప్రఖ్యాత ఆసీస్ దాడి అతని ఏకాగ్రతను దెబ్బతీయడానికి చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. పుజారా బ్యాటింగ్ శైలి గురించి చిన్న ఆధారం కూడా లభించకపోవటంతో అలసిపోయినట్లు అనిపించింది, అందుకే దాదాపు రెండు సంవత్సరాల క్రితం చేసినట్లుగానే పూజారాను తన సహజమైన ఆట ఆడటానికి మేనేజ్మెంట్ ప్రోత్సహించాలని గవాస్కర్ చెప్పాడు. సెంచరీలు వస్తున్నంత కాలం పరుగులు ఎలా పొందాలో ఎవరూ అతనికి చెప్పకూడదు అని అన్నారు. పుజారాని స్వేచ్ఛగా,ఎటువంటి ఒత్తిడి లేకుండా ఆడనివ్వాలి. అది టీమ్ కి అనుకూలంగా మారుతుంది. అతను స్థిరంగా ఉంటాడు.దానివల్ల తన చుట్టూ ఉన్న బ్యాట్స్‌మెన్ కూడా పరుగులు చేయడానికి ప్రయత్నిస్తారని 10,000 పరుగులు చేసిన మొదటి బ్యాట్స్‌మెన్ అయిన లిటిల్ చాంప్ వ్యాఖ్యానించాడు. -
గావస్కర్: ఇంగ్లండ్, వెంగ్‌సర్కార్: ఇండియా
ముంబై: త్వరలో జరుగనున్న ఐసీసీ వన్డే వరల్డ్‌కప్‌ను ఆతిథ్య దేశం ఇంగ్లండ్ గెలుచుకుంటుందని భారత బ్యాటింగ్ దిగ్గజం సునీల్ గావస్కర్ అభిప్రాయపడగా... కోహ్లి సారథ్యంలోని భారత జట్టే ఈ మెగా టోర్నీలో ఫేవరెట్‌గా బరిలో దిగి టైటిల్‌ను కైవసం చేసుకుంటుందని మరో మాజీ స్టార్ బ్యాట్స్‌మన్ దిలీప్ వెంగ్‌సర్కార్ ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశాడు. సోమవారం జరిగిన ‘టి20 ముంబై లీగ్’ ప్రారంభోత్సవంలో వీరిద్దరూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గావస్కర్ మాట్లాడుతూ 2015 ప్రపంచకప్‌లో పేలవ ప్రదర్శన తర్వాత ఇంగ్లండ్ జట్టు పటిష్టమైన వన్డే జట్టుగా ఎదిగిందని సన్నీ విశ్లేషించాడు. సొంతగడ్డపై ఆడనుండటం ఇంగ్లండ్‌కు కలిసొచ్చే అంశం కాబట్టి ఆ జట్టు ప్రపంచకప్‌ను అందుకునే అవకాశాలు ఈసారి ఎక్కువగా ఉన్నాయని వివరించాడు. అయితే భారత మాజీ కెప్టెన్ దిలీప్ వెంగ్‌సర్కార్ మాత్రం కోహ్లి సేనకే తన మద్దతు తెలిపాడు. ప్రపంచ కప్ గెలిచేందుకు భారత్‌కిదే అద్భుత అవకాశమని అన్నాడు. ‘ఈ టోర్నీలో భారత జట్టే ఫేవరేట్. కోహ్లి సేనకే టైటిల్ అందుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆటగాళ్లంతా మంచి ఫామ్ఉన్నారు’ అని వెంగీ అన్నాడు. -
పంచరత్నాలు
ఒకటా... రెండా...? ఏడు దశాబ్దాల ప్రయాణం! పదకొండు సిరీస్‌ల ప్రస్థానం! నలభై నాలుగు టెస్టుల పరంపర! గెలిచింది మాత్రం ఐదంటే ఐదే! ఆస్ట్రేలియా గడ్డపై టీమిండియాకు ఎంతటి గడ్డు కాలం సాగిందో చెప్పేందుకు ఈ గణాంకాలే నిదర్శనం. కాలక్రమంలో వెస్టిండీస్, ఇంగ్లండ్‌లపై వారివారి దేశాల్లోనే సిరీస్‌లు నెగ్గిన భారత్‌కు కంగారూలు మాత్రం ఇంతవరకు కొరుకుడుపడలేదు. ఇందులో తుది ఫలితం సంగతి అటుంచి... ఓ ఐదుసార్లు మాత్రం మన జట్టు విజయాలను ఒడిసిపట్టింది. ఆ పంచ రత్నాలేమిటో చూద్దామా..! సాక్షి క్రీడా విభాగం ఎవరెన్ని చెప్పనీ... ఆస్ట్రేలియా ఎంత బలహీనపడనీ... టీమిండియా ఎంత బలంగా ఉండనీ... కంగారూ దేశంలో ‘టెస్టు సిరీస్ నెగ్గడం’ మనకింకా తీరని కలే! స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి పోరాడుతున్నా... అదో అందని ద్రాక్షే! సిరీస్ సంగతి సరే... అసలు తొలి విజయానికే 30 ఏళ్లు పట్టిందంటే ఆసీస్‌తో సమరం ఎంత కఠిన సవాలో తెలుస్తోంది. అంతెందుకు...? ఈ ఆధునిక యుగంలోనూ వారి గడ్డపై టెస్టు నెగ్గి పదేళ్లయిందంటేనే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఈసారి విరాట్ కోహ్లి సేన కొంత మెరుగైన ఫలితం సాధించే అవకాశం కనిపిస్తోన్న నేపథ్యంలో, గతంలో రెండేసి వరుస సిరీస్‌లలో టీమిండియా అందుకున్న ఆణిముత్యాల్లాంటి ఓ ఐదు విజయాలివి... పెర్త్‌లో పటాకా... 2008 జనవరి 16–19 అంపైరింగ్ నిర్ణయాలతో వివాదాస్పదమై, అప్పటికే రెండు టెస్టులను కోల్పోయి, మంకీ గేట్ దుమారంతో సంచలనం రేపిన సిరీస్ ఇది. అయితే... ‘ఈ సిరీస్‌లో ఒక్క జట్టే క్రీడా స్ఫూర్తితో ఆడింది’ అన్న ఒకే ఒక్క మాటతో భారత కెప్టెన్ అనిల్ కుంబ్లే ఇచ్చిన పంచ్ ఆస్ట్రేలియన్లు తలొంచుకునేలా చేసింది. అదే సమయంలో కుంబ్లే జట్టులో ఆత్మవిశ్వాసం నింపి సారథిగా విశిష్టతను చాటుకున్నాడు. ఈ క్రమంలో మూడో టెస్టులో ద్రవిడ్ (93), సచిన్ (71) రాణించడంతో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 330కి ఆలౌటైంది. ఆర్పీ సింగ్ (4/68) మెరుపులతో పాటు ఇషాంత్, ఇర్ఫాన్ పఠాన్, కుంబ్లే రెండేసి వికెట్లు పడగొట్టడంతో ఆసీస్‌ను 212కే కట్టడి చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో లక్ష్మణ్ (79) స్పెషల్ ఇన్నింగ్స్, సెహ్వాగ్ (43), ఇర్ఫాన్ (46) ఆకట్టుకోవడంతో టీమిండియా 294 పరుగులు చేసింది. 412 పరుగుల ఛేదనలో ఆసీస్‌ను ఇర్ఫాన్ (3/54), ఆర్పీ సింగ్ (2/95) దెబ్బ కొట్టారు. దీంతో ఆ జట్టు 340కే ఆలౌటై లక్ష్యానికి 72 పరుగుల దూరంలో నిలిచిపోయింది. ఈ సిరీస్‌లో కొత్త కుర్రాడు ఇషాంత్ శర్మ... ఆసీస్ దిగ్గజ బ్యాట్స్‌మన్ రికీ పాంటింగ్‌ను తీవ్రంగా ఇబ్బంది పెట్టడంతో వార్తల్లో నిలిచాడు. మెల్బోర్న్ మెరుపు 1977 డిసెంబర్ 30– 1978 జనవరి 4 ఆస్ట్రేలియాలో తొలి టెస్టు (1947) ఆడిన 30 ఏళ్లకు... మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ) వేదికగా టీమిండియాకు ఓ గెలుపు దక్కింది. వాస్తవానికి ఈ సిరీస్ భారత్‌కు ఓ మరుపురానిదిగా మిగిలిపోయేదే. ‘కెర్రీ ప్యాకర్’ ఉదంతంతో చాపెల్ సోదరులు, డెన్నిస్ లిల్లీ వంటి ఉద్ధండులు దూరమవడంతో కొంత బలహీనపడిన ఆసీస్... ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో తొలి రెండు టెస్టులను అతి కష్టం మీద (16 పరుగులు, 2 వికెట్లు) నెగ్గింది. మూడో దాంట్లో మాత్రం మనదే పైచేయి అయింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత్... ఓపెనర్లు సునీల్ గావస్కర్, చేతన్ చౌహాన్ ఖాతా తెరవకుండా ఔటైనా, మొహిందర్ అమర్నాథ్ (72), గుండప్ప విశ్వనాథ్ (59) అర్ధశతకాలతో కోలుకుంది. వెంగ్‌సర్కార్ (37), వినూ మన్కడ్ (44), సయ్యద్ కిర్మాణీ (29) తలోచేయి వేయడంతో 256 పరుగులకు ఆలౌటైంది. బీఎస్ చంద్రశేఖర్ (6/52) స్పిన్ మాయ, బిషన్‌సింగ్ బేడి (2/71), కర్సన్ ఘావ్రీ (2/37) దెబ్బకు ఆసీస్ 213 పరుగులకే పరిమితమైంది. రెండో ఇన్నింగ్స్‌లో లిటిల్ మాస్టర్ గావస్కర్ (118) అద్భుత శతకం, విశ్వనాథ్ (54) అర్ధశతకాలకు తోడు అమర్నాథ్ (41) రాణించడంతో భారత్ 343 పరుగులు చేసింది. చంద్రశేఖర్ (6/52) మరోసారి ఆరేయగా... బేడి (4/58) మిగతా వారి పని పట్టాడు. దీంతో 386 పరుగుల ఛేదనలో ప్రత్యర్థి 164కే చాప చుట్టేసింది. టీమిండియా 222 పరుగులతో జయభేరి మోగించింది. సిడ్నీలో సూపర్...: 1978 జనవరి 7–12 మెల్బోర్న్ విజయం ఊపును కొనసాగించిన భారత్ వెంటనే జరిగిన సిడ్నీ టెస్టునూ కైవసం చేసుకుంది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్... చంద్రశేఖర్ (4/30), బేడి (3/49) ధాటికి తొలి ఇన్నింగ్స్‌లో 131 పరుగులకే కుప్పకూలింది. విశ్వనాథ్ (79), ఘావ్రీ (64) అర్ధ శతకాలతో పాటు గావస్కర్ (49), చౌహాన్ (42), వెంగ్‌సర్కార్ (48), కిర్మాణీ (42) తోడ్పాటుతో 396/8 వద్ద డిక్లేర్ చేసింది. ఫాలోఆన్‌లో కంగారూలను ఎరాపల్లి ప్రసన్న (4/51) దెబ్బకొట్టాడు. చంద్రశేఖర్, బేడి, ఘావ్రీ తలా రెండేసి వికెట్లు పడగొట్టారు. దీంతో ఆసీస్ 263కే ఆలౌటైంది. భారత్ ఇన్నింగ్స్, 2 పరుగులతో వరుసగా రెండో విజయం సాధించింది. అయితే, ఐదో టెస్టు (ఆడిలైడ్) నాలుగో ఇన్నింగ్స్‌లో 492 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో మన జట్టు తీవ్రంగా పోరాడి 445 వద్ద ఆగిపోయింది. 47 పరుగులతో నెగ్గిన ఆసీస్ సిరీస్‌ను 3–2తో కైవసం చేసుకుంది. మళ్లీ మొదటి చోటే...: 1981 ఫిబ్రవరి 7–11 ఈ పర్యటనలో తొలి టెస్టు ఓడి, రెండో టెస్టును ‘డ్రా’ చేసుకున్న టీమిండియా మూడో దాంట్లో విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో సిరీస్ 1–1తో సమమైంది. అయినా, చివరి టెస్టులో భారత్ విజయాన్ని ప్రత్యేకంగా చెప్పుకోక తప్పదు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన మన జట్టు గుండప్ప విశ్వనాథ్ (114) వీరోచిత శతకంతో తొలి ఇన్నింగ్స్‌లో 237 పరుగులు చేయగలిగింది. అలెన్ బోర్డర్ (124) శతకం, గ్రెగ్ చాపెల్ (76), వాల్టర్ (78) అర్ధశతకాలతో ఆసీస్ 419 పరుగులు చేసింది. ఓపెనర్లు గావస్కర్ (70), చేతన్ చౌహాన్ (85) ఇచ్చిన శుభారంభాన్ని వెంగ్‌సర్కార్ (41), విశ్వనాథ్ (30), సందీప్ పాటిల్ (36) సద్వినియోగం చేయడంతో రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 324 పరుగులు చేయగలిగింది. 142 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో ఆసీస్‌ను కపిల్ దేవ్ (5/28) కుదేలు చేశాడు. దీంతో ఆ జట్టు 83 పరుగులకే ఆలౌటై 59 పరుగుల తేడాతో ఓడింది. లక్ష్మణ్ స్పెషల్ ద్రవిడ్ డబుల్... అడిలైడ్: 2003 డిసెంబర్ 12–16 అటు రికీ పాంటింగ్ (242), ఇటు రాహుల్ ద్రవిడ్ (233) డబుల్ సెంచరీల మోతతో రెండు జట్లు హోరాహోరీగా తలపడిన మ్యాచ్ ఇది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ 556 పరుగులకు ఆలౌటైంది. అనిల్ కుంబ్లే (5/154) ఐదు వికెట్లు పడగొట్టాడు. స్కోరు 85/4 ఉన్న దశలో డబుల్ సెంచరీతో ద్రవిడ్, భారీ శతకంతో వీవీఎస్ లక్ష్మణ్ (148) ఐదో వికెట్‌కు 385 పరుగులు జోడించడంతో భారత్ 523 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో అజిత్ అగార్కర్ (6/41) అద్భుత స్పెల్‌తో ప్రధాన బ్యాట్స్‌మెన్‌ను ఔట్ చేయడంతో ఆసీస్ 196కే పరిమితమైంది. 229 పరుగుల ఛేదనలో ద్రవిడ్ (72)కు సెహ్వాగ్ (47), సచిన్ (37), లక్ష్మణ్ (32) సహకారం అందించడంతో భారత్ 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. ఈ సిరీస్‌లో మొదటి టెస్టు ‘డ్రా’ కాగా... భారత్ రెండో దాంట్లో గెలిచి 1–0 ఆధిక్యంలో నిలిచింది. ఇలా జరగడం ఇదే తొలిసారి కావడం విశేషం. అయితే, ఆసీస్ మూడో టెస్టును 9 వికెట్లతో గెల్చుకుని సిరీస్‌ను 1–1తో ‘డ్రా’ చేసింది. 1981 తర్వాత 22 ఏళ్లకు ఆస్ట్రేలియాలో భారత్ టెస్టు గెలవడం గమనార్హం. -
ధోనిని టార్గెట్ చేస్తారా?
న్యూఢిల్లీ: ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా వెస్టిండీస్ తో జరిగిన నాల్గో వన్డేలో టీమిండియా ఓటమికి మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఒక్కడినే బాధ్యుణ్ని చేయడం సమంజసం కాదని దిగ్గజ క్రికెటర్ సునీల్ గావస్కర్ అభిప్రాయపడ్డాడు.స్వల్ప లక్ష్యాన్ని ఛేదించడంలో జట్టు మొత్తం విఫలమైతే, ప్రత్యేకంగా ధోనినే టార్గెట్ చేయడం ఏమిటని ప్రశ్నించాడు. ' నాల్గో వన్డేలో భారత జట్టు ఓటమికి ధోని ఒక్కడే కారణమా. అందరికీ ధోని మ్యాచ్ ను గెలిపించకపోవడమే కనబడుతుందా. జట్టంతా విఫలం చెందితే ధోనిని విమర్శిస్తారా. ఇది కరెక్ట్ కాదు'అని గావస్కర్ అండగా నిలిచాడు. ఇదిలా ఉంచితే, భారత క్రికెట్ జట్టుకు తదుపరి కోచ్ ఎవరైతే బాగుంటుందనే ప్రశ్నకు రవిశాస్త్రి తొలి ప్రాధాన్యత ఇచ్చాడు గావస్కర్. టీమిండియా జట్టుతో కలిసి డైరెక్టర్ గా పనిచేసిన అనుభవం ఉన్న రవిశాస్త్రి తగిన వ్యక్తి అనుకుంటున్నట్లు పేర్కొన్నాడు. మరొకవైపు వీరేంద్ర సెహ్వాగ్, టామ్ మూడీలను కూడా గావస్కర్ సమర్ధించాడు. ఐపీఎల్లో కింగ్స్ పంజాబ్ కు కోచ్ గా చేసిన సెహ్వాగ్ తన బాధ్యతల్ని చక్కగా నిర్వర్తించాడని, అదే సమయంలో సన్ రైజర్స్ బ్యాటింగ్ కోచ్ గా మూడీ సేవలు కూడా అమోఘమన్నాడు. -
'కోహ్లి.. నిన్ను నీవు అద్దంలో చూసుకో'
బెంగళూరు:ఐపీఎల్-10 సీజన్ లో పేలవమైన ఆట తీరును కనబరుస్తున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లిపై దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ విమర్శలు గుప్పించాడు. గత కొన్ని మ్యాచ్ ల్లో విరాట్ ఆట తీరు చూస్తే చాలా దారుణంగా ఉందంటూ మండిపడ్డ గవాస్కర్.. ఒకసారి అతని ఆటను అద్దంలో చూసుకుంటే మంచిదంటూ హితబోధ చేశాడు. ' బెంగళూరు ఆట కంటే ముందు విరాట్ ఆటను నిశితంగా పరిశీలించుకుంటే మంచిది. కింగ్స్ పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో విరాట్ ఒక చెత్త షాట్ కు అవుటయ్యాడు. అది కచ్చితంగా మంచి షాట్ కాదు. ఈడెన్ గార్డెన్ లో కేకేఆర్ తో ఆడిన షాట్ చూడండి. అది కూడా చెత్త షాట్. కచ్చితమైన క్రికెటింగ్ షాట్లు ఆడటంలో విరాట్ పూర్తిగా విఫలమవుతున్నాడు. ఒకసారి విరాట్ ఆటను ఆత్మపరిశీలన చేసుకుంటే మంచిది' అని గవాస్కర్ విమర్శలు గుప్పించాడు. ఒక కెప్టెన్ గా విరాట్ పై ఎంతో బాధ్యత ఉన్నప్పుడు నిర్లక్ష్య పూరిత షాట్లు సమంజసం కాదని చురకలంటించాడు. అతను ఫామ్ లేకపోయినప్పటికీ, కనీసం క్రీజ్ లో ఉండి కచ్చితమైన క్రికెటింగ్ షాట్లను ఆడే ప్రయత్నమే విరాట్ చేయలేదని గవాస్కర్ దుయ్యబట్టాడు.ఒక మంచి ఆటగాడు చెత్త షాట్లకు అవుతుంటే ఒకసారి ఆటను పునఃపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. -
ఆ విషయం చెప్పింది వినూమన్కడే: గవాస్కర్
ముంబై: తాను భారత క్రికెట్ టీంకు సెలెక్ట్ అయ్యానని చెప్పింది మాజీ భారత కెప్టెన్ ఆల్ రౌండర్ వినుమన్కడేనని మాజీ దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ గుర్తుచేసుకున్నాడు. గత రాత్రి దిగ్గజ క్రికెటర్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన వినూమన్కడ్ 100వ జయంతి వేడుకలకు హాజరైన సన్నీ ఆయనతో గడిపిన జ్ఞాపకలను నెమరువేసుకున్నాడు. 1917 ఏప్రిల్ 12న జన్మించిన వినూమన్కడ్ భారత్ తరుపున 44 టెస్టులు ఆడి 2,109 పరుగులతో 162 వికెట్లు పడగొట్టాడు. 4 దశాబ్దల క్రితం మా ఇంట్లోకి వెళ్తుండగా నాకు తియ్యని వార్తని మా గురువు వినుమన్కడ్ ఫోన్లో వినిపించారని సన్నీ తెలిపాడు. ‘వినూ భాయ్ ఫోన్లో బెటా నువ్వు భారత క్రికెట్ జట్టుకు ఎంపికయ్యావు, ఫ్రీగా బ్యాటింగ్ చేయి’ అన్న మాటలను సన్నీ ఈ వేడుకలో గుర్తు చేసుకున్నాడు. ఈ మాటలు నాకెంతో సంతోషం కల్గించాయని గవాస్కర్ పేర్కొన్నాడు. గవాస్కర్ 1971లో వెస్టిండీస్ పర్యటనకు తొలిసారి భారత జట్టుకు ఎంపికయ్యాడు. ఆ పర్యటనలో ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ డాన్ బ్రాడ్‌మన్ సైతం వినుమన్కడ్ గురించి గొప్పగా చెప్పాడని భారత్ తరుపున 125 టెస్టులు ఆడి 10,122 పరుగులు చేసిన గవాస్కర్ పేర్కొన్నాడు. ఈ వేడుకలకు భారత మాజీ క్రికెటర్లు అజిత్ వాడెకర్, వాసు, మాధవ్ ఆప్టే, సలీం దురాణీలు పాల్గొన్నారు. -
కపిల్‌ను నేనెప్పుడూ వద్దనలేదు
భారత క్రికెట్ దిగ్గజాలలో సమకాలీకులు గవాస్కర్, కపిల్ల మధ్య విభేదాలు ఉన్నాయని, అందుకే 1984లో ఇంగ్లండ్‌తో టెస్టుకు కపిల్‌ను ఎంపిక చేయకుండా గవాస్కర్ అడ్డుకున్నారని ఇంతకాలం ప్రచారంలో ఉంది. మూడు దశాబ్దాల తర్వాత నాటి ఘటన గురించి సన్నీ నోరు విప్పారు. కపిల్‌ను జట్టులోకి ఎంపిక చేయకుండా అప్పట్లో ఓ సెలక్టర్ అడ్డుపడ్డారని, ఆయన పేరును తర్వాత చెబుతానని చెప్పారు. జట్టు ఎంపికలో కెప్టెన్ పాత్ర ఏమీ ఉండదని, కపిల్‌ను తానెప్పుడూ వద్దనుకోలేదని గవాస్కర్ తెలిపారు. -
'కటక్‌కు రెండేళ్లు మ్యాచ్‌లు కేటాయించరాదు'
న్యూఢిల్లీ: భారత్, దక్షిణాఫ్రికా రెండో టి-20 మ్యాచ్ సందర్భంగా కటక్ స్టేడియంలో ప్రేక్షకులు మైదానంలోకి బాటిళ్లు విసిరి రభస చేయడంపై టీమిండియా మాజీ కెప్టెన్ గవాస్కర్ తీవ్రంగా స్పందించాడు. కటక్ బారాబతి స్టేడియంలో రెండేళ్ల పాటు అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లు నిర్వహించకుండా నిషేధం విధించాలని గవాస్కర్ సూచించాడు. సోమవారం కటక్‌లో జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 6 వికెట్లతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. భారత్ 92 పరుగులకు ఆలౌటయిన తర్వాత ప్రేక్షకులు వాటర్ బాటిళ్లను మైదానంలోకి విసిరి ఆటకు అంతరాయం కలిగించారు. ప్రేక్షకుల అనుచిత ప్రవర్తనను గవాస్కర్ తప్పుపట్టాడు. ఈ ఘటనకు పోలీసులదే బాధ్యతని అన్నాడు. కటక్‌కు మరో రెండేళ్ల అంతర్జాతీయ మ్యాచ్ కేటాయించకపోవడంతో పాటు ఒడిశా క్రికెట్ సంఘానికి సబ్సిడీలు ఆపేయాలని గవాస్కర్ సూచించారు. -
‘ఎక్కడైనా’ ఆడగలడు
♦ ఏ స్థానంలో అయినా బ్యాటింగ్‌కు సిద్ధం ♦ ఏ దేశంలో అయినా నిలకడగా పరుగులు ♦ భారత క్రికెట్ భవిష్యత్తు అజింక్య రహానే సాక్షి క్రీడావిభాగం : రెండో టెస్టులో అనూహ్యంగా మూడో స్థానంలో రహానేను బరిలోకి దించినపుడు అంతా అతనిపై జాలి పడ్డారు. తొలి ఇన్నింగ్స్‌లో అతను విఫలం అయ్యాక గవాస్కర్‌లాంటి దిగ్గజమే ‘బలి చేశారు’ అంటూ బహిరంగంగా వ్యాఖ్యానించారు. కానీ రహానే ఇలాంటివేమీ పట్టించుకోలేదు. తన కర్తవ్యం మాత్రం సమర్థంగా నిర్వర్తించాడు. ముంబై తరఫున రంజీ ట్రోఫీలో మూడో స్థానం లో ఆడిన మ్యాచ్‌లను గుర్తు చేసుకున్నాడు. అదే స్ఫూర్తితో రెండో ఇన్నింగ్స్‌లో చెలరేగి శతకం సాధించాడు. సవాల్‌ను స్వీకరించడం 27 ఏళ్ల ‘జింక్స్’కు కొత్తేం కాదు. టెస్టుల్లో అరంగేట్రం చేసినప్పుడు తన ఫస్ట్‌క్లాస్ కెరీర్లో ఎన్నడూ ఆడని ఆరో స్థానంలో పంపిస్తే అక్కడా సత్తా చాటాడే కానీ తనకు సాధ్యం కాదని చేతులెత్తేయలేదు. 17 టెస్టుల్లో ఇప్పటికే నాలుగు స్థానాల్లో ఆడేశాడు. అన్ని చోట్లా కనీసం 40పైనే అతని బ్యాటింగ్ సగటు ఉంది. నిరాడంబరుడు ముంబైనుంచి వచ్చినా చాలా మంది అక్కడి క్రికెటర్లలో కనిపించే ‘మెరుపు’ అతని ప్రవర్తనలో కనిపించదు. సాదాసీదా వ్యక్తిత్వం, నిరాడంబరత, సాధారణ మధ్యతరగతి మనస్తత్వం. టెస్టు ఆడేటప్పుడు అతను పాతతరం ఆటగాడిగా అనిపిస్తాడు. ఫుల్ స్లీవ్స్‌ను మోచేతుల వరకు మడిచి ఫీల్డింగ్ చేస్తుంటే 60వ దశకం ఆటగాడిని గుర్తుకు తెస్తాడు. ఒంటి నిండా టాటూలతో మోడ్రన్‌గా కనిపించే తరంలో ఉన్నా తాను దానికి దూరం. అయితే అంత మాత్రాన అతని ఆట సంప్రదాయం కాదు. రహానే దూకుడు, ఆధునికత్వం అంతా ఆడే షాట్లలో కనిపిస్తుంది. కొలంబో టెస్టులో పరిస్థితికి తగినట్లుగా ముందు నిలదొక్కుకొని, ఆ తర్వాత అజింక్య చూడచక్కని బ్యాటింగ్‌తో అలరించాడు. టెస్టు క్రికెట్లో కూడా వినోదం అందించవచ్చనేది ఈ ఇన్నింగ్స్‌తో రహానే చూపించాడు. ‘ఇన్ని స్థానాల్లో బాగా ఆడావు కదా, అయినా నీకిష్టమైన స్థానం ఏమిటి’ అని మీడియా ప్రశ్నిస్తే... మీరే చెప్పారు కదా అన్ని చోట్లా బాగా ఆడానని, ఇక ప్రశ్నే లేదు అంటూ బదులివ్వడం అతని ఆత్మవిశ్వాసాన్ని చూపిస్తుంది. దూకుడుగానూ ఆడతాడు రహానే బ్యాటింగ్‌లో కొత్త రూపం గత డిసెంబర్లో ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టులో కనిపించింది. నెమ్మదిగా ఆడే సంప్రదాయవాది మాత్రమే కాదు, అవసరమైతే ఏ గేర్‌లోనైనా బండిని పరుగెత్తించగలనని అతను నిరూపించాడు. దూకుడుకు మారుపేరైన కోహ్లి ఈ మ్యాచ్‌లో సెంచరీ చేసేందుకు 166 బంతులు తీసుకుంటే, రహానేకు మాత్రం 127 బాల్స్ సరిపోయాయి. ప్రతీ ఆసీస్ బౌలర్‌పై చెలరేగి అతను 21 బౌండరీలు బాదాడు. ఐపీఎల్లో ధాటిగా ఆడటంతో పాటు 58 బంతుల్లోనే సెంచరీ చేసిన రికార్డు ఉన్న రహానే... టెస్టు క్రికెట్లోనూ పరిస్థితిని బట్టి మారగలడని మెల్బోర్న్ ఇన్నింగ్స్ నిరూపించింది. అంతకు ముందు డర్బన్ టెస్టులో స్టెయిన్‌ను వరుస పెట్టి బాదిన బౌండరీలు అజింక్య ఆటతీరుకు ఉదాహరణ. ద్రవిడ్ మార్గదర్శనంలో... ముంబై క్రికెటర్‌గా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న తర్వాతే రాహుల్ ద్రవిడ్‌తో రహానే సాంగత్యం కుదిరింది. అయితే ఐపీఎల్ జట్టు రాజస్తాన్ రాయల్స్ సభ్యుడిగా, మెంటార్‌గా ద్రవిడ్ చేసిన మార్గదర్శనం అతని కెరీర్‌పై చాలా ప్రభావం చూపించిందని రహానే స్వయంగా చెప్పుకున్నాడు. అటు బ్యాటింగ్ మెరుగు కావడంతో పాటు కఠిన పరిస్థితుల్లో ఆడటంలాంటివి అతనినుంచి రహానే స్ఫూర్తి పొందాడు. వెల్లింగ్టన్లో సాధించిన తొలి సెంచరీని అతను తన రోల్ మోడల్ ద్రవిడ్‌కే అంకితమివ్వడం విశేషం. రహానే ఆటతీరు, శైలి, వ్యక్తిత్వం ద్రవిడ్‌ను గుర్తుకు తెస్తుండగా... ఇప్పుడు మూడో స్థానంలో ఆడిన బ్యాటింగ్‌తో ‘వాల్’ పోలికలు కనిపించాయి. ఎనిమిది క్యాచ్‌లతో ప్రపంచ రికార్డు సృష్టించిన రహానే స్లిప్ ఫీల్డర్‌గా కూడా ద్రవిడ్ స్థానాన్ని భర్తీ చేసినట్లున్నాడు. కెప్టెన్‌గానూ అవకాశం... రెండో టెస్టులో కోహ్లి గాయంతో బయటికి వెళ్లినప్పుడు విజయ్ తర్వాత కొద్ది సేపు రహానే కూడా కెప్టెన్‌గా వ్యవహరించాడు. అదే సమయంలో మ్యాథ్యూస్ వికెట్ పడింది. ఇది తనకు చాలా సంతృప్తినిచ్చిందని రహానే నేరుగా చెప్పాడు. ఆటతీరు మెరుగు పడిన కొద్దీ అతనిలోని నాయకత్వ లక్షణాలు కూడా బయట పడుతున్నాయి. గతంలో ముంబై తరఫున ఒక ఫస్ట్ క్లాస్, ఒక టి20 కెప్టెన్‌గా విఫలమైన రహానే...ఇటీవల జింబాబ్వేతో కెప్టెన్‌గా మూడు వన్డేల్లో విజయాన్ని అందించాడు. ఇప్పటికిప్పుడు అతని నాయకత్వ బాధ్యతలు దక్కే అవకాశం లేకపోయినా, జట్టు వ్యూహాల్లో అతను చురుకైన పాత్ర పోషిస్తున్నాడు. అన్ని చోట్లా డిపెండబుల్ బ్యాట్స్‌మన్‌గా మారిన రహానేకు విదేశీ టూర్లలో వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేసే అవకాశం కూడా ఉంది. కాపాడుకోవాలి... మూడో స్థానంలో అద్భుతంగా ఆడిన రహానే అక్కడే కొనసాగుతాడా లేక కోహ్లి కొత్త వ్యూహాల్లో భా గంగా మళ్లీ స్థానం మారతాడా అనేది ఆసక్తికరం. సాధారణంగా అగ్రశ్రేణి ఆటగాళ్లను ఒక స్థానానికి పరిమితం చేస్తేనే మంచి ఫలితాలు వస్తాయనేది చరిత్ర చెప్పిన సత్యం. అన్ని చోట్లా బాగా ఆడగలగడం మంచిదే. కానీ ఎక్కడో ఒక చోట ‘మాస్టర్’ కావాల్సిందే. గతంలో తాను ఓపెనింగ్ స్థానంనుంచి దిగువకు ఆడనని గట్టిగా చెప్పిన సచిన్ ఉన్నాడు...కెరీర్లో ఒకే ఒక సారి నాలుగో స్థానంలో ఆడి తన అత్యధిక స్కోరు (236) చేసినా...మళ్లీ పట్టుబట్టి ఓపెనింగ్‌కు వెళ్లిపోయిన గవాస్కర్ ఉదంతం కూడా మనకు ఉంది. రహానేను కూడా వేర్వేరు స్థానాలతో ఇబ్బంది పెట్టకుండా కాపాడుకుంటేనే భారత్‌ను మేలు జరుగుతుంది. రహానే ప్రపంచంలోని అన్ని వేదికల్లో సత్తా చాటాడు. అతని ఆరు అత్యధిక స్కోర్లు వేర్వేరు మైదానాల్లో ఉండటం విశేషం. 1. 147 ఆస్ట్రేలియాపై మెల్బోర్న్ 2. 126 శ్రీలంకపై కొలంబో 3. 118 న్యూజిలాండ్‌పై వెల్లింగ్టన్ 4. 103 ఇంగ్లండ్‌పై లార్డ్స్ 5. 98 బంగ్లాదేశ్‌పై ఫతుల్లా 6. 96 దక్షిణాఫ్రికాపై డర్బన్ -
'మాటలు ఆపి ఆటపై దృష్టిపెట్టండి'
న్యూఢిల్లీ: టీమిండియా మేనేజ్మెంట్ మాటలు ఆపి, ఆటపై దృష్టిసారించాలని మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ హితవు పలికారు. శ్రీలంకతో తొలి టెస్టులో భారత్ ఘోరపరాజయం అనంతరం గవాస్కర్ పైవిధంగా స్పందించారు. దూకుడు స్వభావం మాటలు, తాత్కాలిక చర్చలు ఆపి మెరుగైన ఆట ఆడటంపై దృష్టిసారించాల్సిన సమయం ఆసన్నమనైందని గవాస్కర్ అన్నారు. శ్రీలంకతో గాలె టెస్టులో నాలుగోరోజు 176 పరుగుల లక్ష్యసాధనలో భారత్ 63 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. కాగా లంకతో మూడు టెస్టుల సిరీస్‌లో టీమిండియా గాడిలో పడుతుందని గవాస్కర్ విశ్వాసం వ్యక్తం చేశాడు. -
త్వరలోనే కోచ్‌ను నియమిస్తారు: గవాస్కర్
న్యూఢిల్లీ : కొత్తగా ఏర్పాటు చేసిన బీసీసీఐ సలహాదారుల కమిటీ తొందరలోనే భారత్ జట్టు కోసం కోచ్‌ను వెతికి పట్టుకుంటుందని బ్యాటింగ్ దిగ్గజం సునీల్ గవాస్కర్ నమ్మకాన్ని వ్యక్తం చేశారు. క్రికెట్‌ను సరైన దిశలో నడిపించేందుకు ఈ కమిటీ... బీసీసీఐతో కలిసి ఓపికగా పని చేయాలని సలహా ఇచ్చారు. సలహాదారుల కమిటీని ఏర్పాటు చేయాలన్న బోర్డు నిర్ణయం సరైందేనని చెప్పారు. సలహా కమిటీ ఏం చేస్తుందో చెప్పాలి : బేడి సచిన్, లక్ష్మణ్, గంగూలీలతో కూడిన సలహా కమిటీ ఏర్పాటుపై మాజీ కెప్టెన్ బిషన్ సింగ్ బేడి సంతోషం వ్యక్తం చేశారు. అయితే ఈ కమిటీ విధి విధానాలను స్పష్టం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ‘సరైన రీతిలోనే ఈ కమిటీని ఏర్పాటు చేశారు. అయితే సభ్యులకు ఎలాంటి అధికారం ఉందో వేచి చూడాలి. ఆ ముగ్గురి సేవలను వినియోగించుకోవాలనే ఆలోచన రావడం హర్షణీయం. అంతకన్నా ముందు ఈ కమిటీ గురించి క్షుణ్ణంగా వివరించాల్సిన బాధ్యత బోర్డుకు ఉంది. ఇది నామమాత్రంగా మిగలకూడదు’ అని బేడి అన్నారు. -
భారత బౌలర్లు ఏమీ నేర్చుకోలేదు: సన్నీ
బ్రిస్బేన్: ఆస్ట్రేలియాలో ముక్కోణపు సిరీస్‌లో భారత బౌలర్ల ప్రదర్శనను మాజీ కెప్టెన్ గవాస్కర్ విమర్శించాడు. గత విదేశీ పర్యటనల్లో భారత బౌలర్లు ఏమీ నేర్చుకోలేదని, ఇది ఆందోళన కలిగించే విషయమని గవాస్కర్ అన్నాడు. గత అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకోకపోవడం వల్లే భారత బౌలర్లు ఆస్ట్రేలియాలో విఫలమవుతున్నారని వ్యాఖ్యానించాడు. త్వరలో జరిగే ప్రపంచ కప్‌లో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలో దిగుతున్న టీమిండియా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయాలని అన్నాడు. ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లో భారత్ ఓడిపోయిన సంగతి తెలిసిందే. తాజాగా ముక్కోణపు వన్డే సిరీస్‌లో వరసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడింది. -
కవలలు...కలలు...
అమర్నాథ్లు, గవాస్కర్‌లు...పటౌడీలు, పఠాన్లు...ఇలా ఎంతో మంది తండ్రీ కొడుకులు, అన్నదమ్ములు భారత క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. కొంత మంది సోదరులు కలిసి ఒకే మ్యాచ్‌లో ఆడితే, మరి కొందరు తమ తరంలో జట్టులో భాగమయ్యారు. అయితే కవల సోదరులు మాత్రం ఎప్పుడూ టీమిండియా తరఫున ఆడలేదు. అయితే చెన్నైకి చెందిన బాబా అపరాజిత్, బాబా ఇంద్రజిత్ భవిష్యత్తులో ఆ ఘనతను సొంతం చేసుకోవాలని పట్టుదలగా ఉన్నారు. భారత్‌లో ఫస్ట్ క్లాస్ స్థాయి క్రికెట్ మ్యాచ్ ఆడిన తొలి కవలలుగా ఇప్పటికే గుర్తింపు తెచ్చుకున్న ఈ ఇద్దరు జాతీయ జట్టుకూ అలాగే కలిసి ఆడాలని కలలు కంటున్నారు. ఒకరి తర్వాత మరొకరు... ఈ బాబా బ్రదర్స్ తండ్రి డాక్టర్ ఆర్ఎన్ బాబా తమిళనాడు క్రికెట్ సంఘంలో సీనియర్ సభ్యుడు. సహజంగానే తండ్రి కారణంగా వీరిద్దరు క్రికెట్ వైపు ఆకర్షితులయ్యారు. వీరిలో ఇంద్రజిత్ ముందుగా గుర్తింపు తెచ్చుకున్నాడు. టాపార్డర్ బ్యాట్స్‌మన్‌గా, లెగ్‌స్పిన్నర్‌గా అతను తన ప్రతిభను ప్రదర్శించాడు. తమిళనాడు అండర్-16, అండర్-19 జట్లకు అతను కెప్టెన్‌గా వ్యవహరించాడు. అయితే 2012 అండర్-19 ప్రపంచకప్ ప్రాబబుల్స్‌లో ఇంద్రజిత్ పేరున్నా...అసలు జట్టులో చోటు దక్కలేదు. మరో సోదరుడు అపరాజిత్‌కు మాత్రం ఆల్‌రౌండర్ కోటాలో అనూహ్యంగా స్థానం దక్కింది. అంతకు ముందు ఏడాదే తమిళనాడు తరఫున రంజీ ట్రోఫీలో కూడా ఆడి ఉండటం అపరాజిత్‌కు కలిసొచ్చింది. కలిసికట్టుగా... గత ఏడాది డిసెంబర్లో రంజీ ట్రోఫీలో భాగంగా చెన్నైలో తమిళనాడు, సౌరాష్ట్ర మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ఇంద్రజిత్ ఫస్ట్ క్లాస్ క్రికెట్లోకి అడుగు పెట్టాడు. రెండేళ్లనుంచి జట్టులో ఉన్న అపరాజిత్ కూడా ఈ మ్యాచ్‌లో భాగం కావడంతో... ఈ జోడి భారత దేశవాళీ క్రికెట్లో కొత్త అధ్యాయాన్ని సృష్టించింది. ఫస్ట్ క్లాస్ క్రికెట్ కలిసి ఆడిన తొలి భారత కవలలుగా బాబా బ్రదర్స్ గుర్తింపు తెచ్చుకున్నారు. -
బీసీసీఐకి ఇద్దరు అధ్యక్షులు
న్యూఢిల్లీ: ఒక్క రోజులోనే రకరకాల మలుపులు తిరిగిన ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ కేసు వ్యవహారంలో చివరకు అందరికీ సంతోషకరమైన ఆదేశాలే వచ్చాయి. కేసును విచారిస్తున్న ద్విసభ్య సుప్రీం కోర్టు బెంచ్ ఏకే పట్నాయక్, ఇబ్రహీం ఖలీఫుల్లా జారీ చేసిన ఆదేశాల ప్రకారం ఎవరేం చేయాలంటే... గవాస్కర్: ఐపీఎల్‌కు సంబంధించినంత వరకు బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు. మిగిలిన బోర్డు వ్యవహారాలతో సంబంధం లేదు. బీసీసీఐ కామెంటేటర్‌గా ఉన్న కాంట్రాక్టును వదిలేసుకోవాలి. ఇందుకుగాను పరిహారం పొందొచ్చు. అంటే బోర్డు చరిత్రలో తొలిసారి ‘పెయిడ్ అధ్యక్షుడు’గా గవాస్కర్ వ్యవహరించబోతున్నారు. అయితే ఐపీఎల్‌ను నడపడానికి గవర్నింగ్ కౌన్సిల్ ఉంది. లీగ్ సీఈఓ సుందర్ రామన్‌ను కొనసాగించాలా లేదా అనే విషయంలో గవాస్కర్ నిర్ణయం తీసుకోవచ్చు. తను కావాలంటే కొత్తగా ఎవరినైనా లీగ్ నిర్వహణ కోసం నియమించుకోవచ్చు. శివలాల్ యాదవ్: ఐపీఎల్ మినహా మిగిలిన బోర్డు వ్యవహారాలన్నింటికి సంబంధించి శివలాల్ యాదవ్ తాత్కాలిక అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు. కేసు విచారణ ముగిసే వరకు లేదా తర్వాతి ఏజీఎమ్ వరకు బోర్డు పూర్తి పరిపాలనా బాధ్యత శివలాల్దే.శ్రీనివాసన్: ఈ కేసు విచారణ ముగిసే వరకు అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటారు. జూన్‌లో ఐసీసీ ఛైర్మన్ పదవి చేపడతారు. విచారణ ముగిశాక తిరిగి బోర్డు అధ్యక్ష బాధ్యతలు తీసుకోవచ్చు. ఐపీఎల్: లీగ్‌కు ఎలాంటి సమస్యా లేదు. ఎప్పటిలాగే ఎనిమిది జట్లు ఆడతాయి. రాజస్థాన్, చెన్నై జట్లు కూడా పాల్గొంటాయి. ‘క్రికెట్ అభిమానుల కోసం ఈ రెండు జట్లను అనుమతిస్తున్నాం’ అని సుప్రీం బెంచ్ వ్యాఖ్యానించింది. కాబట్టి ఎప్పటిలాగే ఏప్రిల్ 16న యూఏఈలో ఐపీఎల్ ప్రారంభమవుతుంది. ఇతర ముఖ్య అంశాలు ఇండియా సిమెంట్స్ కంపెనీకి చెందిన ఉద్యోగులెవరూ బోర్డు కార్యకలాపాల్లో పాల్గొనకూడదు. అయితే ఆటగాళ్లు, కామెంటేటర్లకు ఇది వర్తించదు. అంటే ఇండియా సిమెంట్స్ ఉపాధ్యక్షుడు ధోనికి సంబంధించి ఎలాంటి అడ్డంకులూ లేవు. తను ఎప్పటిలాగే క్రికెట్ ఆడుకోవచ్చు. అన్ని వాదనలు పూర్తయి తుది తీర్పు వెలువడే వరకు ఈ ఆదేశాలన్నీ అమల్లో ఉంటాయి. ఏప్రిల్ 16న తదుపరి విచారణ జరుగుతుంది. సమర్థవంతంగా నిర్వర్తిస్తా... విశాఖపట్నం, న్యూస్‌లైన్: సుప్రీంకోర్టు తనపై నమ్మకంతో అప్పజెప్పిన బీసీసీఐ తాత్కాలిక అధ్యక్ష బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తిస్తానని భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ వ్యాఖ్యానించారు. తన ఆటలాగే విధుల్లోనూ అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు ప్రయత్నిస్తానని ఆయన అన్నారు. శుక్రవారం ఇక్కడ ఒక ప్రైవేట్ పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో గవాస్కర్ పాల్గొన్నారు. ‘బీసీసీఐ అధ్యక్షుడిగా పని చేసేందుకు నేను తగిన వాడినని సుప్రీంకోర్టు భావించడం నా అదృష్టం. దీనినో గౌరవంగా భావిస్తున్నా. నా క్రికెట్ కెరీర్‌లాగే ఇక్కడ కూడా మెరుగైన ప్రదర్శన ఇస్తాను’ అని సన్నీ చెప్పారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... భగవాన్ సత్యసాయి బాబా అంటే తనకు చిన్నప్పటి నుంచి ఎంతో ఇష్టమని, ఆయన ఆశీస్సుల వల్లే బీసీసీఐ అధ్యక్ష పదవి తనను వరించిందన్నారు. చాలా సంతోషం... సాక్షి, హైదరాబాద్: బీసీసీఐ అధ్యక్షుడిగా తాను ఎంపిక కావడం పట్ల మాజీ క్రికెటర్, సీనియర్ ఉపాధ్యక్షులు నందలాల్ శివలాల్ యాదవ్ సంతోషం వ్యక్తం చేశారు. తాను ఈ పరిణామాలు ఊహించలేదని, అయితే అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. ‘ఐపీఎల్‌ను మినహాయించి అధ్యక్షుడిగా ఇతర బీసీసీఐ బాధ్యతలు నాకు అప్పజెప్పటం ఆనందంగా ఉంది. బోర్డుతో పాటు హెచ్‌సీఏలో కూడా క్రికెట్ వ్యవహారాల నిర్వహణలో నాకున్న అనుభవం ఇప్పుడు ఉపయోగపడుతుందని భావిస్తున్నా’ అని శివలాల్ చెప్పారు. వీలైనంత త్వరగా బాధ్యతలు చేపడతానని యాదవ్ చెప్పారు. ‘పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత నేను ఎలా ముందుకు సాగాలో నిర్ణయించుకుంటాను. నా వైపు నుంచి బోర్డును బాగా నడిపేందుకు ప్రయత్నిస్తాను’ అని శివలాల్ పేర్కొన్నారు. -
ఇక భారత్‌కు కష్టమే: గవాస్కర్
వెల్లింగ్టన్: న్యూజిలాండ్‌తో రెండో టెస్టులో భారత్ విజయం సాధించడం అసాధ్యమని సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డారు. ఇక ఓడిపోకుండా కనీసం డ్రా చేసుకోవడానికి ప్రయత్నించాలని సూచించారు. ‘ఈ పరిస్థితికి భారత బౌలర్లను తప్పుబట్టలేం. నిజానికి మెకల్లమ్ అత్యద్భుతంగా ఆడాడు. వాట్లింగ్ కూడా నాణ్యమైన ఇన్నింగ్స్ ఆడాడు. వీళ్లిద్దరూ ఆడుతున్నంతసేపు పిచ్ బ్యాటింగ్‌కు సహకరించింది’ అని గవాస్కర్ చెప్పారు. భారత్‌కు ఓ నాణ్యమైన బౌలింగ్ ఆల్‌రౌండర్ అవసరాన్ని ఈ టెస్టు మరోసారి బయటపెట్టిందని అన్నారు. ‘ఏడో స్థానంలో బ్యాటింగ్ చేయగల నాణ్యమైన బౌలింగ్ ఆల్‌రౌండర్ భారత్‌కు కావాలి. ఆ లోటు ఈ టెస్టులో మరోసారి తెలిసొచ్చింది’ అని సన్నీ అభిప్రాయపడ్డారు.