బ్రిస్బేన్: ఆస్ట్రేలియాలో ముక్కోణపు సిరీస్లో భారత బౌలర్ల ప్రదర్శనను మాజీ కెప్టెన్ గవాస్కర్ విమర్శించాడు. గత విదేశీ పర్యటనల్లో భారత బౌలర్లు ఏమీ నేర్చుకోలేదని, ఇది ఆందోళన కలిగించే విషయమని గవాస్కర్ అన్నాడు. గత అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకోకపోవడం వల్లే భారత బౌలర్లు ఆస్ట్రేలియాలో విఫలమవుతున్నారని వ్యాఖ్యానించాడు.
త్వరలో జరిగే ప్రపంచ కప్లో డిఫెండింగ్ చాంపియన్గా బరిలో దిగుతున్న టీమిండియా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయాలని అన్నాడు. ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్లో భారత్ ఓడిపోయిన సంగతి తెలిసిందే. తాజాగా ముక్కోణపు వన్డే సిరీస్లో వరసగా రెండు మ్యాచ్ల్లో ఓడింది.
భారత బౌలర్లు ఏమీ నేర్చుకోలేదు: సన్నీ
Published Tue, Jan 20 2015 8:33 PM | Last Updated on Sat, Sep 2 2017 7:59 PM
Advertisement
Advertisement