Indian bowlers
-
మరీ ఇంత దారుణమా.. టీమిండియా బౌలర్లపై దుమ్మెత్తిపోస్తున్న ఫ్యాన్స్
టీమిండియా చేతిలో 0-1 తేడాతో టీ20 సిరీస్‌ను కోల్పోయిన న్యూజిలాండ్ జట్టు వన్డే సిరీస్‌లో ఘనంగా బోణీ కొట్టింది. ఆక్లాండ్ వేదికగా ఇవాళ (నవంబర్ 25) జరిగిన తొలి వన్డేలో 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. శ్రేయస్ అయ్యర్ (80), శిఖర్ ధవన్ (72), శుభ్‌మన్ గిల్ (50) అర్ధసెంచరీలతో రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 306 పరుగులు చేయగా, 307 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన న్యూజిలాండ్ మరో 17 బంతులు మిగిలుండగానే ఆడుతూపాడుతూ విజయం సాధించింది. టామ్ లాథమ్ (104 బంతుల్లో 145; 19 ఫోర్లు, 5 సిక్సర్లు) అజేయ శతకంతో, కెప్టెన్ కేన్ విలియమ్సన్ (98 బంతుల్లో 94 నాటౌట్; 7 ఫోర్లు, సిక్స్) భారీ అర్ధశతకంతో జట్టును విజయతీరాలకు చేర్చారు. ఈ గెలుపుతో 3 మ్యాచ్‌ల సిరీస్‌లో న్యూజిలాండ్ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. కాగా, ఈ మ్యాచ్‌లో భారీ లక్ష్యాన్ని సైతం కాపాడుకోలేక దారుణంగా విఫలమైన టీమిండియా బౌలర్లపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరీ ఇంత పేలవమైన బౌలింగా అని మండిపడుతున్నారు. భారత బౌలర్ల ప్రదర్శన నానాటికీ మరీ తీసికట్టుగా మారుతుందని ధ్వజమెత్తుతున్నారు. ముఖ్యంగా.. కీలక దశలో ఒకే ఓవర్లో 25 పరుగులు సమర్పించుకుని, జట్టు ఓటమికి ప్రధాన కారణమైన శార్దూల్ ఠాకూర్‌పై దుమ్మెత్తిపోస్తున్నారు. శార్దూల్‌ను బౌలర్ అనే వాడిని గూబ గుయ్ అనేలా వాయించాలని సోషల్‌మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. 8.1 ఓవర్లు వేసి 68 పరుగులు సమర్పించుకున్న అర్షదీప్‌ను సైతం ఏకి పారేస్తున్నారు. మరీ ఇంత దారుణంగా తయారయ్యారేంట్రా బాబూ అని తలలుపట్టుకుంటున్నారు. కశ్మీర్ ఎక్స్‌ప్రెస్ అని గొప్పలు చెప్పుకున్న ఉమ్రాన్ మాలిక్ 2 వికెట్లు తీసి పర్వాలేదనిపించినా, ధారాళంగా పరుగులు సమర్పించుకోవడంతో మండిపడుతున్నారు. ఎన్ని మ్యాచ్‌లు అవకాశం ఇచ్చినా చహల్ తీరు మారడం లేదని, ఇతన్ని కూడా పక్కకు పెడితే బుద్ధి వస్తుందని అంటున్నారు. కాస్త పొదుపుగా బౌలింగ్ చేసిన వాషింగ్టన్ సుందర్ (4.2 ఎకానమీ)ను మినహాయించి భారత బౌలర్లందరిపై ఓ రేంజ్లో దుమ్మెత్తిపోస్తున్నారు. -
హడలెత్తించిన ఉమేశ్, సిరాజ్
చెస్టర్ లీ స్ట్రీట్: భారత బౌలర్ల ప్రాక్టీస్ అదిరింది. కౌంటీ సెలెక్ట్ ఎలెవన్‌తో జరుగుతున్న మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన భారత బౌలర్లు ప్రత్యర్థిని తక్కువ పరుగులకే కట్టడి చేశారు. బుధవారం బ్యాటింగ్‌కు దిగిన కౌంటీ జట్టు 82.3 ఓవర్లలో 220 పరుగులకు ఆలౌటైంది. పేసర్లు ఉమేశ్ యాదవ్ (3/22), మొహమ్మద్ సిరాజ్ (2/32) పదునైన బంతులతో కౌంటీ బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టారు. ఓపెనర్ హసీబ్ హమీద్ (246 బంతుల్లో 112; 13 ఫోర్లు) శతకంతో జట్టును ఆదుకున్నాడు. అతడు మినహా మిగిలిన బ్యాట్స్‌మెన్ పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. కౌంటీ తరఫున బరిలోకి దిగిన భారత ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ (1) ప్రాక్టీస్‌ను సద్వినియోగం చేసుకోలేదు. భారత్ 91 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని అందుకుంది. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 306/9తో రెండో రోజు ఆటను కొనసాగించిన భారత్... మరో ఐదు పరుగులు మాత్రమే జోడించి 93 ఓవర్లలో 311 పరుగులకు ఆలౌటైంది. క్రెయిగ్ మిల్స్ నాలుగు వికెట్లు తీశాడు. అవేశ్ ఖాన్ అవుట్ భారత యువ పేసర్ అవేశ్ ఖాన్ ఇంగ్లండ్ పర్యటన అర్ధాంతరంగా ముగిసిపోయింది. గాయంతో ఇంగ్లండ్‌తో జరిగే ఐదు మ్యాచ్‌ల సిరీస్‌కు దూరమయ్యాడు. భారత్‌తో జరుగుతున్న ప్రాక్టీస్ మ్యాచ్‌లో సెలెక్ట్ ఎలెవన్ తరఫున అవేశ్ ఖాన్ బరిలోకి దిగాడు. తొలి రోజు ఆటలో ఇన్నింగ్స్ 10వ ఓవర్‌ను అవేశ్ ఖాన్ బౌలింగ్ చేయగా.... విహారి కొట్టిన రిటర్న్ షాట్‌ను ఆపే ప్రయత్నంలో అతడి ఎడమ చేతి బొటన వేలుకు గాయమైంది. స్కానింగ్‌లో అవేశ్ వేలు విరిగినట్లు తేలింది. అతడు కోలుకోవడానికి కనీసం నెల రోజులకు పైగా సమయం పడుతుందని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. -
భళా... భారత బౌలర్లు
సునీల్ గావస్కర్ ఈ సిరీస్‌లో భారత్ శ్రీలంకతో అద్భుతంగా ఆడుతోంది. అయితే ఇప్పుడు ప్రపంచ క్రికెట్లో లంక బలమైన ప్రత్యర్థి కాదు. బౌలింగ్ పేలవంగా ఉంది. అంతర్జాతీయ స్థాయికి అదేమాత్రం సరితూగదు. కానీ... బ్యాటింగ్‌లో కొందరు మేటి ఆటగాళ్లున్నారు. అయితే వీరిని భారత బౌలర్లు చక్కగా కట్టడి చేశారు. బ్యాటింగ్ పిచ్‌లపై కూడా వారికి అవకాశం ఇవ్వకుండా దెబ్బ తీసిన బౌలర్లను తప్పకుండా అభినందించాల్సిందే. నాలుగో వన్డేలో పేసర్ జస్ప్రీత్ బుమ్రా చెలరేగిన తీరు అద్భుతం. నిప్పులు చెరిగే బౌలింగ్‌తో... వైవిధ్యమైన యార్కర్లతో లంక బ్యాట్స్‌మెన్‌ను బాగా ఇబ్బంది పెట్టాడు. వారి ఇన్నింగ్స్‌ను కోలుకోలేని దెబ్బతీశారు. కొత్త కుర్రాడు శార్దుల్ ఠాకూర్ కూడా ఫ్లాట్ పిచ్‌పై చక్కగా రాణించాడు. కుల్దీప్ యాదవ్, హార్దిక్ పాండ్యా ఇలా అందరూ కలిసి లంక ఇన్నింగ్స్‌ను కూల్చారు. ఈ మ్యాచ్‌లో భువనేశ్వర్‌తో పాటు, కేదార్ జాదవ్, యజువేంద్ర చహల్‌ను డగౌట్‌కు పరిమితం చేసి రాహుల్‌కు మరో అవకాశమిచ్చారు. అయితే వెస్టిండీస్ సిరీస్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచిన రహానేను మరోసారి పక్కన బెట్టడం ఆశ్చర్యపరిచింది. రోహిత్ శర్మ, కెప్టెన్ కోహ్లి భాగస్వామ్యం భారీస్కోరుకు బాట వేసింది. కోహ్లి నిష్క్రమణ తర్వాత హార్దిక్ పాండ్యాకు బదులుగా రాహుల్‌ను బరిలోకి దించి ఉంటే అతను క్రీజులో నిలదొక్కుకునేందుకు మంచి అవకాశం ఉండేది. అయితే కోహ్లి, రోహిత్‌ల సెంచరీలతో పాండ్యా, రాహుల్‌ల వైఫల్యం లెక్కలోకి రాలేదు. ధనంజయ అద్భుతమైన డెలివరికి రాహుల్ పెవిలియన్ చేరాడు. ఏదేమైనా ఆటగాడిపై నమ్మకముంచడం మంచి పనే కానీ... ఇందుకోసం ఓ ఫామ్‌లో ఉన్న బ్యాట్స్‌మన్ (రహానే)ను కాదని ఇవ్వడం మాత్రం తగని పని. మొత్తానికి లంక పర్యటనలో భారత ఆటగాళ్లంతా తమ ప్రతిభను చాటుకున్నారు. బ్యాటింగ్, బౌలింగ్ ఇలా అన్ని రంగాల్లో సత్తా కనబరిచారు. -
భారత బౌలర్ల అరుదైన రికార్డు
చాంపియన్‌ట్రోఫీలో మరో అరుదైన రికార్డు నమోదైంది. ట్రోఫీలో భారత బ్యాట్మెన్లు తమ సత్తాచాటుతుంటే , బౌలర్లు తమ పదునైన బౌలింగ్‌తో ప్రత్యర్థికి చుక్కలు చూపిస్తున్నారు. భువనేశ్వర్ కుమార్, ఉమేష్ యాదవ్, బూమ్రా, జడేలతో బౌలింగ్ లైన్ అసాధారణ రీతిలో చెలరేగిపోతోంది. అనూహ్యంగా అశ్విన్ సైతం జట్టులో వచ్చి బౌలింగ్ బలాన్ని మరింత పెంచాడు. తొలిమ్యాచ్‌లో భారత్ బ్యాట్మెన్ల రాణింపుతో 319 పరుగులు చేయగా, బౌలర్లు తమ పదునైన బౌలింగ్‌తో పాకిస్తాన్‌ను కేవలం 164 పరుగులకే నేలకూల్చారు. అయితే తరువాతి మ్యాచ్‌లో భారత బౌలింగ్ తేలిపోయింది. లంకను ఏ పరిస్థితిల్లో కూడా ఇబ్బంది పెట్టలేక పోయారు. 322 పరుగుల లక్ష్యాన్ని అలవోకగా చేధించింది. భారత బౌలర్లు కేవలం ఒక్క వికెట్ మాత్రమే తీయగలిగారు. అది కూడా ఐదో ఓవర్ నాలుగోబంతికి భువనేశ్వర్ డిక్వెల్లా 7(18)పరుగుల వద్దను పెవిలియన్‌కు పంపాడు. అనంతరం గుణతిలక, మెండిస్‌ల వికెట్లు పడ్డా ఆరెండూ రన్నౌట్లు. మరొకటి రిటైర్డ్ నాటౌట్‌గా పెరీరా వెనుదిరిగాడు. అంటే శ్రీలంకతో కేవలం ఒక్కవికెట్ మాత్రమే అదికూడా4.4 ఓవర్లల్లో. మిగతా 45.2 ఓవర్లలో ఒక్క వికెట్‌కూడా బౌలర్లు తమ ఖాతాలో వేసుకోలేకపోయారు. అనంతరం దక్షిణాఫ్రికా మ్యాచ్‌లో తొలి వికెట్‌గా ఆమ్లా35(69), అశ్విన్ బౌలింగ్‌లో 17.3 ఓవర్లో అవుట్ అయ్యాడు. అంటే శ్రీలంకతో 45.2 ఓవర్లు, ఇటు దక్షిణాఫ్రికాతో 17.2 ఓవర్లు మెత్తం 62.4 ఓవర్లలో భారత బౌలర్లు ఒక్క వికెట్‌కూడా తమ ఖాతాలో వేసుకోలేకపోయారు. అంతార్జాతీయ క్రికెట్లో ఇదీ ఓ రికార్డే. -
వదిలినా దొరికారు
► ఇంగ్లండ్ 268/8 బెయిర్ స్టో అర్ధసెంచరీ ► సమష్టిగా రాణించిన భారత బౌలర్లు ► నాలుగు క్యాచ్‌లు వదిలేసిన ఫీల్డర్లు ఒకటి కాదు రెండు కాదు... ఏకంగా నాలుగు క్యాచ్‌లు వదిలేశారు. పిచ్ నుంచి బౌలర్లకు పెద్దగా సహకారం లేదు... ఇలాంటి స్థితిలో ఏ ప్రత్యర్థరుునా దొరికిన అవకాశాలను వినియోగించుకుని చెలరేగుతుంది. కానీ ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ మాత్రం నిర్లక్ష్యపు షాట్లతో... ఏ మాత్రం బాధ్యత లేని ఆటతీరుతో తొలిరోజే భారత్‌కు దొరికారు. ఫీల్డర్ల నుంచి సహకారం లేకపోరుునా... బౌలర్లు మాత్రం క్రమశిక్షణతో రాణించి మూడో టెస్టులో భారత్‌కు మంచి ఆరంభాన్నిచ్చారు. మొహాలీ: ఆరంభంలో బౌన్స... పాత బంతితో పేసర్ల రివర్స్ స్వింగ్... స్పిన్‌కు అనుకూలిస్తుందని భావించిన పిచ్ నుంచి సహకారం లేకపోరుునా బంతుల్లో వైవిధ్యంతో స్పిన్నర్లు... వెరసి బౌలర్ల సమష్టి కృషితో మూడో టెస్టు తొలి రోజును భారత్ సంతృప్తికరంగా ముగించింది. పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో శనివారం ప్రారంభమైన మూడో టెస్టులో మొదటిరోజు ఆటముగిసే సమయానికి ఇంగ్లండ్ తొలిఇన్నింగ్సలో 90 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 268 పరుగులు చేసింది. బెరుుర్‌స్టో (177 బంతుల్లో 89; 6 ఫోర్లు) అద్భుతమైన ఇన్నింగ్సతో అర్ధసెంచరీ చేయగా... బట్లర్ (80 బంతుల్లో 43; 5 ఫోర్లు) రాణించాడు. వీరిద్దరూ ఆరో వికెట్‌కు 69 పరుగుల భాగస్వామ్యంతో ఇంగ్లండ్‌ను ఆదుకున్నారు. స్టోక్స్ (29) పర్వాలేదనిపించాడు. ఆట ముగిసే సమయానికి రషీద్ (4 బ్యాటింగ్), బ్యాటీ (0 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో ఉమేశ్, జయంత్, జడేజా తలా రెండు వికెట్లు తీసుకోగా... షమీ, అశ్విన్ చెరో వికెట్ పడగొట్టారు. సెషన్ 1: ఆరంభంలో వికెట్లు టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ జాగ్రత్తగా ఇన్నింగ్‌సను ప్రారంభించింది. మూడు, పదో ఓవర్లలో షమీ బౌలింగ్‌లో కుక్ ఇచ్చిన రెండు క్యాచ్‌లను జడేజా, అశ్విన్‌లు వదిలేయడంతో ఇంగ్లండ్ ఊపిరి పీల్చుకుంది. మరో ఎండ్‌లో డిఫెన్సకే ప్రాధాన్యమిచ్చిన హమీద్ (9)... ఉమేశ్ బౌలింగ్‌లో రహానేకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. రెండు బౌండరీలతో ధాటిగా ఇన్నింగ్‌సను ప్రారంభించిన రూట్ (15)కూడా ... వికెట్ల ముందు జయంత్‌కు దొరికిపోయాడు. అశ్విన్ తన తొలిబంతికే కుక్ (27)ను పెవిలియన్‌కు పంపించి ఇంగ్లండ్ వెన్నువిరిచాడు. దీంతో 51 పరుగులకే ఇంగ్లండ్ కీలకమైన మూడు వికెట్లను కోల్పోరుుంది. లంచ్ విరామానికి మరో రెండు ఓవర్లు ఉందనగా అలీ (16) వికెట్‌ను షమీ తీయడంతో సెషన్లో భారత్ ఆధిపత్యం కొనసాగింది. ఓవర్లు: 29; పరుగులు: 92; వికెట్లు: 4 సెషన్ 2: సూపర్ భాగస్వామ్యం ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ స్టోక్స్, బెరుుర్‌స్టో చెత్త బంతుల్ని బౌండరీలకు తరలిస్తూ స్కోరు బోర్డును నడిపించారు. వీరిద్దరూ ఐదో వికెట్‌కు 57 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అద్భుతమైన బంతితో స్టోక్స్ (29)ను అవుట్ చేసి జడేజా ఈ జంటను విడదీశాడు. బట్లర్ అండతో 76 బంతుల్లో బెరుుర్‌స్టో అర్ధసెంచరీ మార్కును చేరుకున్నాడు. తర్వాత మరో వికెట్ పడకుండా ఈ జంట జాగ్రత్త పడింది. ఈ సెషన్లో పార్థీవ్ ఒక క్యాచ్ వదిలేశాడు. ఓవర్లు: 33; పరుగులు: 113; వికెట్లు: 1 సెషన్ 3: బ్యాటింగ్‌లో తడబాటు టీ విరామానంతరం జడేజా బౌలింగ్‌లో బట్లర్ (43) ఇచ్చిన క్యాచ్‌ను మిడాఫ్‌లో కోహ్లి ఒడిసిపట్టడంతో ఆరోవికెట్‌కు 69 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. బెయిర్‌స్టో ఇచ్చిన క్యాచ్‌ను పార్థీవ్ వదిలేశాడు. అనంతరం మరో ఆరు ఓవర్లలో మ్యాచ్ ముగుస్తుందనగా బెరుుర్స్టోను... 89వ ఓవర్లో వోక్స్‌ను అవుట్ చేసి భారత బౌలర్లు రోజును ముగించారు. ఓవర్లు: 28; పరుగులు: 63; వికెట్లు 3 కోహ్లి, స్టోక్స్ వాగ్వాదం భారత కెప్టెన్ కోహ్లి, ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ స్టోక్స్ మధ్య చిన్న వాగ్వాదం జరిగింది. రెండో సెషన్లో నిలకడగా ఆడుతోన్న స్టోక్స్‌ను రవీంద్ర జడేజా అవుట్ చేయడంతో కోహ్లిసేన సంబరాల్లో మునిగింది. వికెట్ కోల్పోరుున ఉక్రోశంలో ఉన్న స్టోక్స్... పెవిలియన్‌కు వెళ్తూ వెళ్తూ కోహ్లిని రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశాడు. దీంతో కోహ్లి కూడా స్టోక్స్‌ను ఉద్దేశించి జవాబు ఇచ్చాడు. ఇద్దరి మధ్య చిన్నపాటి మాటల యుద్ధం జరిగింది. చివరికి కోహ్లి ఈ విషయంపై అంపైర్లకు ఫిర్యాదు చేశాడు. ఈ ఉదంతంలో స్టోక్స్‌ను ఐసీసీ మందలించింది. అతని ఖాతాలో ఒక డీమెరిట్ పారుుంట్‌ను చేర్చింది. రాహుల్‌కు మళ్లీ గాయం భారత ఓపెనర్ కేఎల్ రాహుల్ మళ్లీ గాయపడ్డాడు. విశాఖలో జరిగిన రెండో టెస్టులో ఫీల్డింగ్ చేస్తుండగా తన ముంజేతికి గాయమైంది. నెట్స్‌లో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో తను ఇబ్బందిపడ్డాడు. దీంతో రాహుల్ స్థానంలో కరుణ్ నాయర్ జట్టులోకి వచ్చాడు. గావస్కర్ చేతుల మీదుగా కరుణ్ టెస్టు క్యాప్‌ను అందుకున్నాడు. ‘క్రికెట్లో ఫీల్డర్ల నుంచి క్యాచ్‌లు చేజారిపోవడం సాధారణమే. ఒక్కోసారి వారే అద్భుతమైన క్యాచ్‌లతో బౌలర్‌కి న్యాయం చేస్తారు. ఇదంతా ఆటలో భాగంగానే చూడాలి. రోజురోజుకీ నా ఆట పరిణతి చెందుతుంది. కుంబ్లే, సంజయ్ బంగర్ చెప్పిన విధంగా నా బౌలింగ్‌ను మార్చుకున్నాను. ఆఫ్ స్టంప్ ఆవల బంతుల్ని సంధించి మంచి ఫలితాలను సాధిస్తున్నాను.’ - ఉమేశ్ యాదవ్ -
‘టాప్’ లేపిన ఇషాంత్
- తొలి ఇన్నింగ్స్‌లో లంక బోర్డు ప్రెసిడెంట్ 121 ఆలౌట్ - రెండో ఇన్నింగ్స్‌లో కోహ్లిసేన 112/3 - భారత్‌కు మొత్తం ఆధిక్యం 342 పరుగులు కొలంబో: శ్రీలంక బోర్డు ప్రెసిడెంట్ ఎలెవన్‌తో జరుగుతున్న మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌లో భారత బౌలర్లు విజృంభించారు. పేసర్ ఇషాంత్ శర్మ (5/23) సంచలన స్పెల్‌కు తోడు ఆరోన్ (2/42), అశ్విన్ (2/8)లు సమయోచితంగా స్పందించడంతో శుక్రవారం రెండో రోజు లంక తొలి ఇన్నింగ్స్‌లో 31 ఓవర్లలో 121 పరుగులకే కుప్పకూలింది. డిక్వెల్లా (41), సిరివందన (32), గుణతిలక (28) మాత్రమే రెండంకెల స్కోరు సాధించారు. తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 40 ఓవర్లలో 3 వికెట్లకు 112 పరుగులు చేసింది. పుజారా (31 బ్యాటింగ్), లోకేశ్ రాహుల్ (47 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. రోహిత్ (8), కోహ్లి (18), సాహా (1) మరోసారి విఫలమయ్యారు. ఓవరాల్‌గా భారత్ 342 పరుగుల ఆధిక్యంలో ఉంది. తొలి సెషన్లోనే ఇన్నింగ్స్ ప్రారంభించిన లంక బోర్డు ప్రెసిడెంట్ బ్యాట్స్‌మెన్ ఇషాంత్ దెబ్బకు వణికిపోయారు. అద్భుతమైన స్వింగ్‌తో చెలరేగిన ఈ ఢిల్లీ బౌలర్ తన వరుస నాలుగు ఓవర్లలో లంక ‘టాప్’ను కూల్చేశాడు. రెండుసార్లు హ్యాట్రిక్ మిస్ చేసుకున్న ఇషాంత్ కేవలం 5 పరుగులిచ్చి 5 వికెట్లు తీశాడు. దీంతో లంక 10 పరుగులకే సగం జట్టు పెవిలియన్‌కు చేరుకుంది. లంచ్ తర్వాత ఆరోన్, అశ్విన్‌లు చెలరేగిపోయారు. ఓవరాల్‌గా 18వ ఓవర్లో 50 పరుగులకు చేరుకున్న లంక ఆ వెంటనే సిరివందన వికెట్‌ను కోల్పోయింది. ఈ దశలో డిక్వెల్లా, గుణతిలక ఎనిమిదో వికెట్‌కు 63 పరుగులు జోడించారు. అయితే ఏడు పరుగుల తేడాతో చివరి మూడు వికెట్లు పడటంతో ఆతిథ్య జట్టు ఓ మోస్తరు స్కోరుకే పరిమితమైంది. దీంతో భారత్‌కు 230 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం దక్కింది. అంతకుముందు 314/6 ఓవర్‌నైట్ స్కోరుతో రెండో రోజు ఆట కొనసాగించిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 88.1 ఓవర్లలో 351 పరుగులకు ఆలౌటైంది. రహానే (109; 11 ఫోర్లు, 1 సిక్స్) ఓవర్‌నైట్ స్కోరు వద్దే రిటైర్డ్ అవుట్ కాగా... మిగతా వారు విఫలమయ్యారు. భారత్ ఓవర్‌నైట్ స్కోరుకు మరో 37 పరుగులు జోడించింది. జట్టుతో చేరనున్న రవిశాస్త్రి: భారత జట్టు డెరైక్టర్ రవిశాస్త్రి శనివారం ఉదయం జట్టుతో చేరనున్నారు. యాషెస్ సిరీస్‌లో టీవీ విశ్లేషకుడిగా పని చేసేందుకు ఇంగ్లండ్ వెళ్లిన ఆయన... జింబాబ్వేలో భారత పర్యటనకు కూడా అందుబాటులో లేరు. అయితే మరో యాషెస్ టెస్టు మిగిలుండగానే శ్రీలంక వచ్చి జట్టుతో చేరుతున్నారు. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: 88.1 ఓవర్లలో 351 ఆలౌట్. శ్రీలంక బోర్డు ప్రెసిడెంట్ ఎలెవన్ తొలి ఇన్నింగ్స్: డిసిల్వా (బి) ఇషాంత్ 0; జేకే సిల్వా ఎల్బీడబ్ల్యు (బి) ఇషాంత్ 0; తిరిమన్నే (సి) రాహుల్ (బి) ఇషాంత్ 5; తరంగ ఎల్బీడబ్ల్యు (బి) ఇషాంత్ 0; సిరివందన (సి) సాహా (బి) ఆరోన్ 32; కుశాల్ పెరీరా (బి) ఇషాంత్ 0; జయసూరియా (సి) సా హా (బి) ఆరోన్ 7; డిక్వెల్లా (బి) అశ్విన్ 41; గుణతిలక (సి) ఉమేశ్ (బి) అశ్విన్ 28; గమాగే ఎల్బీడబ్ల్యు (బి) హర్భజన్ 2; కాసన్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు: 6; మొత్తం: (31 ఓవర్లలో ఆలౌట్) 121. వికెట్ల పతనం: 1-0; 2-1; 3-1; 4-10; 5-10; 6-38; 7-51; 8-114; 9-117; 10-121. బౌలింగ్: భువనేశ్వర్ 7-3-17-0; ఇషాంత్ 7-1-23-5; ఉమేశ్ 6-1-24-0; ఆరోన్ 6-0-42-2; అశ్విన్ 3-1-8-2; హర్భజన్ 2-0-7-1. భారత్ రెండో ఇన్నింగ్స్: రోహిత్ ఎల్బీడబ్ల్యు (బి) ఫెర్నాండో 8; కోహ్లి (సి) పతిరన (బి) కాసన్ రజిత 18; సాహా ఎల్బీడబ్ల్యు (బి) ఫెర్నాండో 1; పుజారా బ్యాటింగ్ 31; రాహుల్ బ్యాటింగ్ 47; ఎక్స్‌ట్రాలు: 7; మొత్తం: (40 ఓవర్లలో 3 వికెట్లకు) 112. వికెట్ల పతనం: 1-22; 2-27; 3-28. బౌలింగ్: ఫెర్నాండో 5-0-17-2; లాహిర్ గమాగే 7-0-15-0; కాసన్ రజిత 7-2-16-1; గమాగే 3-2-7-0; పతిరన 10-1-31-0; జయసూరియా 8-0-25-0. -
భారత బౌలర్లు భళా.. కుప్పకూలిన లంక
కొలంబో: శ్రీలంక పర్యటనలో భారత బ్యాట్స్‌మెన్‌తో పాటు బౌలర్లూ సత్తాచాటారు. శ్రీలంక బోర్డు ప్రెసిడెంట్స్ లెవెన్‌తో మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌లో భారత్ ఓవరాల్‌గా 342 పరుగుల భారీ ఆధిక్యంలో నిలిచింది. మ్యాచ్ రెండో రోజు శుక్రవారం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన లంకను భారత బౌలర్లు 121 పరుగులకే కుప్పకూల్చారు. భారత పేసర్ ఇషాంత్ శర్మ (5/23) సూపర్ స్పెల్‌తో విజృంభించి.. లంక టాపార్డర్ పనిపట్టాడు. వరుణ్ ఆరోన్, అశ్విన్ చెరో రెండు వికెట్లు తీశారు. లంక జట్టులో డిక్వెల్లా 41,సిరివర్ధన 32, గునతిలక 28 పరుగులు చేయగా, మిగిలినవారు సింగిల్ డిజిట్‌కు పరిమితమయ్యారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్ రెండో రోజు ఆట ముగిసేసరికి 3 వికెట్లకు 112 పరుగులు చేసింది. పుజారా (31 బ్యాటింగ్), రాహుల్ (47 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. రోహిత్ (8), కోహ్లీ (18), సాహ (1) అవుటయ్యారు. ఓవర్‌నైట్ స్కోరు 314/6తో ఈ రోజు ఉదయం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ 351 పరుగులకు ఆలౌటైంది. -
ఎట్టకేలకు వికెట్ తీసిన బౌలర్లు
సిడ్నీ: ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్ ను అవుట్ చేసేందుకు టీమిండియా బౌలర్లు కష్టపడుతున్నారు. ఇప్పటివరకు జరిగిన ప్రపంచకప్ మ్యాచుల్లో ఊహించని విధంగా రాణించిన భారత బౌలర్లు సెమీస్ లో శ్రమిస్తున్నారు. 15 పరుగులకే తొలి వికెట్ తీసిన బౌలర్లు తర్వాత ప్రభావం చూపలేకపోయారు. 34 ఓవర్ల వరకు వికెట్ తీయలేకపోయారు. స్మిత్, ఫించ్ జోరును అడ్డుకోలేకపోయారు. జోడిని కెప్టెన్ ధోని మొత్తం ఆరుగురు బౌలర్లను ప్రయోగించినా ఫలితం లేకపోయింది. విరాట్ కోహ్లితో ప్రయోగాత్మకంగా ఓవర్ వేయించినా వ్యూహం ఫలించలేదు. స్మిత్, ఫించ్ జోరుతో ఆసీస్ భారీ స్కోరు దిశగా సాగుతోంది. ఎట్టకేలకు 197 పరుగుల స్కోరు వద్ద స్మిత్(105)ను ఉమేష్ యాదవ్ అవుట్ చేశాడు. భారత్ తీసిన రెండు వికెట్లు ఉమేష్ పడగొట్టడం గమనార్హం. -
ఆసీస్ బలహీనతలపై దృష్టి పెట్టాలి
భారత బౌలర్లకు రమీజ్ రాజా సూచన న్యూఢిల్లీ: ప్రపంచకప్ సెమీస్‌లో ఆస్ట్రేలియాను దీటుగా ఎదుర్కోవాలంటే తమ బౌలర్ వహాబ్ రియాజ్‌ను స్ఫూర్తిగా తీసుకోవాలని భారత బౌలర్లకు పాక్ మాజీ కెప్టెన్ రమీజ్ రాజా సూచించారు. ఆసీస్‌తో జరిగిన క్వార్టర్స్ మ్యాచ్‌లో రియాజ్ అద్భుతమైన స్పెల్‌తో చెలరేగాడని గుర్తు చేశారు. ‘రియాజ్ బంతితో అద్భుతాలు చేశాడు. అతని వేగం, కచ్చితమైన బౌన్సర్లకు స్టార్లతో కూడిన ఆసీస్ లైనప్ వద్ద సమాధానం లేకపోయింది. పాక్ మ్యాచ్ అయితే ఓడిపోయిందేమోగానీ రియాజ్ బౌలింగ్ సూపర్బ్. కాబట్టి భారత బౌలర్లు ఆసీస్ బలహీనతలపై దృష్టిపెట్టాలి’ అని రమీజ్ పేర్కొన్నారు. ఆసీస్‌తో మ్యాచ్ ఓడటానికి పాక్ ఫీల్డింగ్ వైఫల్యమే కారణమన్నారు. ‘పాక్ జట్టు ఫీల్డింగ్ ప్రమాణాలకు అనుగుణంగా లేదు. ఆటగాళ్లలో చురుకుదనం కొరవడింది. దీనివల్ల కీలక సమయాల్లో సులువైన క్యాచ్‌లు కూడా జారవిడిచారు. ఉత్తమ ఫీల్డర్లను సరైన ప్రదేశాల్లో నిలబెట్టాలి. కానీ మిస్బా పాతకథే పునరావృతం చేశాడు. మంచి ఫీల్డర్‌ను తీసుకెళ్లి బౌండరీ లైన్ వద్ద పెట్టాడు. దీనివల్ల ఏం లాభం’ అని రమీజ్ విమర్శించారు. ప్రస్తుతం భారత్, ఆసీస్ సెమీస్ మ్యాచ్‌పైనే అందరి దృష్టి నెలకొందన్నారు. -
7 మ్యాచ్‌ల్లో 70 వికెట్లు...
భారత బౌలర్ల గురించి ఈ టోర్నీ ఆరంభం నుంచి బాగా గొప్పగా చెప్పుకుంటున్నాం. కానీ ఇంత అద్భుతమైన బౌలింగ్ లైనప్ మనకుంది అంటే నమ్మలేని విధంగా నిలకడ చూపిస్తున్నారు. వరుసగా ఏడు మ్యాచ్‌ల్లో ఏడు జట్లను ఆలౌట్ చేయడం అంటే... వహ్... ఇంతకంటే ఏం కావాలి. ముఖ్యంగా పేసర్లు చెలరేగిపోతున్న తీరు నభూతో... ఎవరైనా ఒకరు ఇబ్బంది పడుతుంటే రెండో బౌలర్ వెంటనే బంతి అందుకుని తనని ఒత్తిడి నుంచి బయటకు తీసుకెళుతున్నాడు. ఈ మ్యాచ్‌లో మన టాప్ స్టార్ షమీ మీద ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లోనే ఎదురుదాడి జరిగింది. తమీమ్ ఏకంగా మూడు బౌండరీలు బాదాడు. వెంటనే మోహిత్ అందుకుని పరిస్థితి అదుపు తప్పకుండా చూశాడు. ఇక తన రెండో స్పెల్‌లో షమీ మరింత అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఫామ్‌లో ఉన్న మహ్మదుల్లా, నిలకడగా ఆడుతున్న సర్కార్ల వికెట్లతో బంగ్లా వెన్ను విరిచాడు. ఇక ఉమేశ్ తన తొలి స్పెల్ ఐదు ఓవర్లలో కేవలం 9 పరుగులే ఇచ్చి వికెట్ తీశాడు. ఇలా ప్రతి బౌలర్ తన పాత్ర సమర్ధంగా పోషించాడు. మరో 2 మ్యాచ్‌లు ఇదే జోరు చూపితే చాలు. -
బౌలర్లు నేర్చుకోవడం లేదు
గవాస్కర్ వ్యాఖ్య బ్రిస్బేన్: గత విదేశీ పర్యటనల నుంచి భారత బౌలర్లు ఏమీ నేర్చుకోవడం లేదని మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ విమర్శించారు. టెస్టు సిరీస్‌తో పాటు వన్డేల్లోనూ బౌలర్ల ప్రదర్శన బాగాలేదని ధ్వజమెత్తారు. ‘గత కొన్నేళ్లుగా విదేశాల్లో వన్డే క్రికెట్ ఆడుతున్నారు. కానీ ఆ అనుభవం నుంచి బౌలర్లు ఏమాత్రం నేర్చుకోవడం లేదు. ఇది ఆందోళ చెందాల్సిన అంశం. ప్రపంచకప్‌కు సమయం దగ్గరపడుతోంది. టైటిల్ నిలబెట్టుకోవాలంటే సరైన ప్రోత్సాహం అవసరం. ప్రస్తుత పరిస్థితుల్లో బౌలర్లు కేవలం బౌలింగ్ మాత్రమే చేస్తున్నారనిపిస్తోంది. ఈ సుదీర్ఘ పర్యటనలో వాళ్లు నేర్చుకున్నదేమీ కనిపించడం లేదు’ అని సన్నీ పేర్కొన్నారు. అయితే ముక్కోణపు సిరీస్‌లో ఇంగ్లండ్ ప్రదర్శనను భారత్ స్ఫూర్తిగా తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఓపెనర్లుగా ఎవరు వచ్చినా కోహ్లిని నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దించాలని సూచించారు. -
భారత బౌలర్లు ఏమీ నేర్చుకోలేదు: సన్నీ
బ్రిస్బేన్: ఆస్ట్రేలియాలో ముక్కోణపు సిరీస్‌లో భారత బౌలర్ల ప్రదర్శనను మాజీ కెప్టెన్ గవాస్కర్ విమర్శించాడు. గత విదేశీ పర్యటనల్లో భారత బౌలర్లు ఏమీ నేర్చుకోలేదని, ఇది ఆందోళన కలిగించే విషయమని గవాస్కర్ అన్నాడు. గత అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకోకపోవడం వల్లే భారత బౌలర్లు ఆస్ట్రేలియాలో విఫలమవుతున్నారని వ్యాఖ్యానించాడు. త్వరలో జరిగే ప్రపంచ కప్‌లో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలో దిగుతున్న టీమిండియా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయాలని అన్నాడు. ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లో భారత్ ఓడిపోయిన సంగతి తెలిసిందే. తాజాగా ముక్కోణపు వన్డే సిరీస్‌లో వరసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడింది. -
గెలుస్తారా... నిలుస్తారా!
ఎట్టకేలకు భారత బౌలర్లు అంచనాలను మించి రాణించారు. నిలకడైన బౌలింగ్‌తో ప్రత్యర్థిని నిరోధించారు. బ్యాట్స్‌మెన్ చెలరేగిపోకుండా కీలక దశల్లో వికెట్లు తీసి మ్యాచ్‌పై ఆశలు రేపారు. భారత బౌలర్ల సమష్టి ప్రదర్శన నాలుగో రోజు ఆసీస్‌ను వెనుకంజ వేసేలా చేసింది. ఎప్పటిలాగే వేగంగా పరుగులు చేసి భారీ లక్ష్యం నిర్దేశించాలన్న ఆలోచనను కట్టి పడేసింది. అయితే ధోని సేనకు పట్టు చిక్కినట్లే కనిపించినా... షాన్ మార్ష్ చలవతో ఆ జట్టు నిలబడింది. ఎంసీజీలో మూడు రకాల ఫలితాలు వచ్చేందుకు రంగం సిద్ధమైంది. చివరి రోజు ఎంత పెద్ద లక్ష్యమైనా భారత్ ఛేదిస్తుందా, లేక ఆ ప్రయత్నంలో కుప్పకూలుతుందా చూడాలి. కంగారూలు ‘డ్రా’ వైపు మొగ్గుతున్నా... పోరాడితే పోయేదేం లేదు అన్న తరహాలో వాతావరణం ప్రతికూలంగా మారితే తప్ప భారత్ విజయం కోసమే ఆడటం మాత్రం ఖాయం. ఉత్కంఠ స్థితిలో మెల్బోర్న్ టెస్టు ⇒ రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 261/7 ⇒ ప్రస్తుతం 326 పరుగుల ముందంజ ⇒ చివరి రోజు ఏ ఫలితమైనా సాధ్యం మెల్బోర్న్: భారత్, ఆస్ట్రేలియా మూడో టెస్టు మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. నాలుగో రోజు సోమవారం ఆట ముగిసే సమయానికి ఇరు జట్లు సమాన స్థితిలో నిలిచాయి. భారత బౌలర్లు నిలకడగా రాణించడంతో ఆస్ట్రేలియా తమ రెండో ఇన్నింగ్స్‌లో 7 వికెట్ల నష్టానికి 261 పరుగులు చేసింది. క్రిస్ రోజర్స్ (123 బంతుల్లో 69; 8 ఫోర్లు), షాన్ మార్ష్ (131 బంతుల్లో 62; 8 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలు చేశారు. ప్రస్తుతం మార్ష్‌తో పాటు హారిస్ (8 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నాడు. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం 65 పరుగులు కలుపుకొని ఆసీస్ ప్రస్తుతం 326 పరుగులు ముందంజలో ఉంది. అయితే ఇంకా ఆసీస్ తమ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేయలేదు. చివరి రోజు ఆ జట్టు ఎన్ని పరుగులు అదనంగా జోడిస్తుందనేది ఆసక్తికరం. ఒక వేళ ఇదే స్కోరు వద్ద డిక్లేర్ చేస్తే భారత్‌కు విజయావకాశాలు ఉంటాయి. తమ సాధారణ శైలికి భిన్నంగా నాలుగో రోజు చివర్లో ఆసీస్ ఆత్మరక్షణ ధోరణి చూస్తే ఆ జట్టు ‘డ్రా’ వైపే ఆసక్తి చూపిస్తున్నట్లుగా కనిపిస్తోంది. అదే జరిగితే భారత్ సిరీస్ కోల్పోతుంది. సోమవారం వర్షం కారణంగా అంతరాయంతో 77.3 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. ఆఖరి రోజు ఆట అరగంట ముందుగా ప్రారంభమవుతుంది. అంతకుముందు భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 465 పరుగులకే ఆలౌటైంది. ఓవర్‌నైట్ స్కోరుకు మరో 3 పరుగులు మాత్రమే జోడించి చివరి 2 వికెట్లు కోల్పోయింది. హారిస్‌కు 4, జాన్సన్‌కు 3 వికెట్లు దక్కాయి. స్కోరు వివరాలు:- ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 530; భారత్ తొలి ఇన్నింగ్స్: విజయ్ (సి) మార్ష్ (బి) వాట్సన్ 68; ధావన్ (సి) స్మిత్ (బి) హారిస్ 28; పుజారా (సి) హాడిన్ (బి) హారిస్ 25; కోహ్లి (సి) హాడిన్ (బి) జాన్సన్ 169; రహానే (ఎల్బీ) (బి) లయోన్ 147; రాహుల్ (సి) హాజల్‌వుడ్ (బి) లయోన్ 3; ధోని (సి) హాడిన్ (బి) హారిస్ 11; అశ్విన్ (సి) అండ్ (బి) హారిస్ 0; షమీ (సి) స్మిత్ (బి) జాన్సన్ 12; ఉమేశ్ (సి) హాడిన్ (బి) జాన్సన్ 0; ఇషాంత్ (నాటౌట్) 0, ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (128.5 ఓవర్లలో ఆలౌట్) 465 వికెట్ల పతనం: 1-55; 2-108; 3-147; 4-409; 5-415; 6-430; 7-434; 8-462; 9-462; 10-465. బౌలింగ్: జాన్సన్ 30.5-6-133-3; హారిస్ 26-7-70-4; హాజల్‌వుడ్ 25-6-75-0; వాట్సన్ 16-3-65-1; లయోన్ 29-3-108-2; స్మిత్ 2-0-11-0. ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్: వార్నర్ (ఎల్బీ) (బి) అశ్విన్ 40; రోజర్స్ (బి) అశ్విన్ 69; వాట్సన్ (సి) ధోని (బి) ఇషాంత్ 17; స్మిత్ (సి) రహానే (బి) ఉమేశ్ 14; మార్ష్ (బ్యాటింగ్) 62; బర్న్స్ (సి) ధోని (బి) ఇషాంత్ 9; హాడిన్ (సి) ధోని (బి) ఉమేశ్ 13; జాన్సన్ (సి) రహానే (బి) షమీ 15; హారిస్ (బ్యాటింగ్) 8; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం (75 ఓవర్లలో 7 వికెట్లకు) 261 వికెట్ల పతనం: 1-57; 2-98; 3-131; 4-164; 5-176; 6-202; 7-234; బౌలింగ్: ఉమేశ్ 14-1-73-2; షమీ 20-2-75-1; ఇషాంత్ 19-4-49-2; అశ్విన్ 22-2-56-2. సెషన్-1: వార్నర్ దూకుడు నాలుగోరోజు భారత ఇన్నింగ్స్ 15 బంతుల్లోనే ముగిసిం ది. జాన్సన్ తన వరుస ఓవర్లలో ఉమేశ్, షమీలను పెవిలియన్ పంపించాడు. అనంతరం ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌ను వార్నర్ (42 బంతుల్లో 40; 6 ఫోర్లు) దూకుడుగా ఆరంభించాడు. ఉమేశ్ బౌలింగ్‌లో ఐదు ఫోర్లు బాదాడు. ఈ క్రమంలో టెస్టుల్లో 3 వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. 2 పరుగుల వద్ద స్లిప్‌లో కొట్టిన షాట్‌కు బంతి ధావన్‌కు కాస్త ముందు పడటంతో రోజర్స్ బతికిపోయాడు. అయితే పరుగులు ఇవ్వకుండా కట్టడి చేసిన అశ్విన్, ఈ భాగస్వామ్యాన్ని కూడా విడదీశాడు. ఓవర్లు: 2.3, పరుగులు: 3, వికెట్లు: 2 (భారత్) ఓవర్లు: 22, పరుగులు: 90, వికెట్లు: 1 (ఆస్ట్రేలియా) సెషన్-2: రోజర్స్ నిలకడ లంచ్ సమయంలో చాలా సేపు వర్షం కురిసి మ్యాచ్‌కు అడ్డంకిగా మారింది. కొంత విరామం తర్వాత ఆట ప్రారంభమైంది. రోజర్స్ చక్కటి షాట్లతో ఇన్నింగ్స్‌ను నడిపించాడు. 33 పరుగుల వద్ద అతను స్లిప్‌లో ఇచ్చిన క్యాచ్‌ను ధావన్ వదిలేశాడు. మరోవైపు వాట్సన్ (17)ను అవుట్ చేసి ఇషాంత్ దెబ్బ తీయగా, ఫామ్‌లో ఉన్న కెప్టెన్ స్మిత్ (14) ధోని వ్యూహానికి చిక్కాడు. ఉమేశ్ బౌలింగ్‌లో ఫైన్ లెగ్ వైపు ఆడబోయిన స్మిత్ లెగ్ స్లిప్‌లో రహానేకు క్యాచ్ ఇచ్చాడు. మరోసారి అశ్విన్, చక్కటి బంతితో రోజర్స్‌ను బోల్తా కొట్టించడంతో భారత్‌కు పట్టు చిక్కింది. ఓవర్లు: 21, పరుగులు: 84, వికెట్లు: 3 సెషన్-3: ఆదుకున్న మార్ష్ గత టెస్టులో విఫలమైన షాన్ మార్ష్ విరామం తర్వాత కీలక ఇన్నింగ్స్ ఆడాడు. మరోవైపు సహచరులు వెనుదిరుగుతున్నా... ఏకాగ్రత కోల్పోకుండా చక్కటి షాట్లతో ఆకట్టుకున్నాడు. భారత బౌలర్లు మరో సారి ప్రత్యర్థిని నియంత్రించగలిగారు. ఫలితంగా బర్న్స్ (9), హాడిన్ (13), జాన్సన్ (15) తక్కువ వ్యవధిలో వెనుదిరిగారు. 112 బంతుల్లో మార్ష్ అర్ధ సెంచరీని చేరుకున్నాడు. ఓవర్లు: 32, పరుగులు: 87, వికెట్లు: 3 -
'ప్రాక్టీస్' లో బౌలర్లు భేష్
అడిలైడ్: ఆస్ట్రేలియా పర్యటనను భారత జట్టు ఆత్మవిశ్వాసంతో ప్రారంభించింది. తొలి ప్రాక్టీస్ మ్యాచ్ మొదటి రోజు మన ఆటగాళ్లు చక్కటి ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. టీమిండియా బౌలర్లు రాణించడంతో క్రికెట్ ఆస్ట్రేలియా ఎలెవన్ జట్టు తమ తొలి ఇన్నింగ్స్‌లో 71.5 ఓవర్లలో 219 పరుగులకే ఆలౌటైంది. వరుణ్ ఆరోన్ 3 వికెట్లు పడగొట్టగా... కరణ్‌శర్మ, భువనేశ్వర్, షమీ తలా 2 వికెట్లు, అశ్విన్ ఒక వికెట్ తీశారు. అనంతరం భారత్ ఆట ముగిసే సమయానికి 16 ఓవర్లలో వికెట్ నష్టానికి 55 పరుగులు చేసింది. ధావన్ (10) పెవిలియన్ చేరగా...విజయ్ (32 బ్యాటింగ్), పుజారా (13 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నారు. అందరికీ వికెట్ టాస్ గెలిచిన క్రికెట్ ఆస్ట్రేలియా ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. భువనేశ్వర్ తనదైన శైలిలో తొలి ఓవర్లోనే షార్ట్ (0)ను అవుట్ చేసి శుభారంభం అందించాడు. అనంతరం కార్టర్స్ (151 బంతుల్లో 58; 6 ఫోర్లు), టర్నర్ (29) రెండో వికెట్‌కు 51 పరుగులు జత చేసి ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. ఈ దశలో ఆరోన్ మూడు బంతుల వ్యవధిలో రెండు వికెట్లు పడగొట్టి ప్రత్యర్థిని దెబ్బ తీశాడు. అయితే కెల్విన్ స్మిత్ (40)తో కలిసి కార్టర్స్ మరోసారి జట్టును ఆదుకున్నాడు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 74 పరుగులు జోడించారు. లోయర్ ఆర్డర్లో హ్యరీ నీల్సన్ (43 నాటౌట్) రాణించడంతో సీఏ స్కోరు 200 పరుగులు దాటింది. భారత బౌలర్లందరూ కనీసం ఒక వికెట్ పడగొట్టగా...వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా 5 క్యాచ్‌లు పట్టి, ఒక స్టంపింగ్ చేయడం విశేషం. అనంతరం భారత ఇన్నింగ్స్‌లో ధావన్ త్వరగానే అవుటైనా... విజయ్, పుజారా మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు. -
షరా... మామూలే!
మళ్లీ అదే కథ... వేదిక మారినా రాత మారలేదు. భారత బ్యాట్స్‌మెన్ విఫలమైన వికెట్‌పై ఇంగ్లండ్ ఆటగాళ్లు చెలరేగిపోయారు. ఇంగ్లండ్ పేసర్లు నిప్పులు చెరిగిన పిచ్‌పై భారత సీమర్లు తేలిపోయారు. దీనికితోడు ఎప్పటిలాగే క్యాచ్‌లు వదిలేశారు. ఇలా అన్ని విభాగాల్లోనూ విఫలమైన జట్టు ఓ టెస్టు మ్యాచ్‌ను కాపాడుకోవాలని అనుకోవడం అత్యాశే. ఓవల్‌లోనూ ధోనిసేన చతికిలపడింది. ఇంగ్లండ్‌కు భారీ ఆధిక్యం అప్పగించింది. ఇక ఈ మ్యాచ్ ఎన్ని రోజుల్లో ముగుస్తుందనేదే ఆసక్తికరం. ఐదో టెస్టు ►విఫలమైన భారత బౌలర్లు ►తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 385/7 ►ప్రస్తుతం కుక్ సేన ఆధిక్యం 237 లండన్: బ్యాటింగ్‌లో నిలకడగా రాణించిన ఇంగ్లండ్ జట్టు.. ఐదో టెస్టులో భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. కుక్ (183 బంతుల్లో 79; 9 ఫోర్లు), బ్యాలెన్స్ (117 బంతుల్లో 64; 13 ఫోర్లు), రూట్ (129 బంతుల్లో 92 బ్యాటింగ్; 9 ఫోర్లు, 1 సిక్సర్) చెలరేగడంతో రెండో రోజు శనివారం ఆతిథ్య జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 105 ఓవర్లలో 7 వికెట్లకు 385 పరుగులు చేసింది. రూట్‌తో పాటు జోర్డాన్ (19 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం ఇంగ్లండ్ 237 పరుగుల ఆధిక్యంలో ఉంది. బట్లర్ (73 బంతుల్లో 45; 9 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. భారత బౌలర్లలో ఇషాంత్, ఆరోన్, అశ్విన్ తలా రెండు వికెట్లు తీశారు. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: 148 ఆలౌట్ ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: కుక్ (సి) విజయ్ (బి) ఆరోన్ 79; రాబ్సన్ (బి) ఆరోన్ 37; బ్యాలెన్స్ (సి) పుజారా (బి) అశ్విన్ 64; బెల్ (సి) ధోని (బి) ఇషాంత్ 7; రూట్ బ్యాటింగ్ 92; అలీ (బి) అశ్విన్ 14; బట్లర్ (సి) అశ్విన్ (బి) ఇషాంత్ 45; వోక్స్ (సి) ధోని (బి) భువనేశ్వర్ 0; జోర్డాన్ బ్యాటింగ్ 19; ఎక్స్‌ట్రాలు: 28; మొత్తం: (105 ఓవర్లలో 7 వికెట్లకు) 385. వికెట్ల పతనం: 1-66; 2-191; 3-201; 4-204; 5-229; 6-309; 7-318 బౌలింగ్: భువనేశ్వర్ 24-3-86-1; ఇషాంత్ 24-8-58-2; ఆరోన్ 25-1-111-2; బిన్నీ 12-0-58-0; అశ్విన్ 20-2-55-2 లండన్: బ్యాటింగ్‌లో నిలకడగా రాణించిన ఇంగ్లండ్ జట్టు.. ఐదో టెస్టులో భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. కుక్ (183 బంతుల్లో 79; 9 ఫోర్లు), బ్యాలెన్స్ (117 బంతుల్లో 64; 13 ఫోర్లు), రూట్ (129 బంతుల్లో 92 బ్యాటింగ్; 9 ఫోర్లు, 1 సిక్సర్) చెలరేగడంతో రెండో రోజు శనివారం ఆతిథ్య జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 105 ఓవర్లలో 7 వికెట్లకు 385 పరుగులు చేసింది. రూట్‌తో పాటు జోర్డాన్ (19 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం ఇంగ్లండ్ 237 పరుగుల ఆధిక్యంలో ఉంది. బట్లర్ (73 బంతుల్లో 45; 9 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. భారత బౌలర్లలో ఇషాంత్, ఆరోన్, అశ్విన్ తలా రెండు వికెట్లు తీశారు. సెషన్-1 : ఆరంభంలోనే ఝలక్ 62/0 ఓవర్‌నైట్ స్కోరుతో రెండో రోజు ఆట కొనసాగించిన ఇంగ్లండ్... రెండో ఓవర్లోనే రాబ్సన్ (37) వికెట్‌ను కోల్పోయింది. అయితే కుక్, బ్యాలెన్స్ సమయోచితంగా ఆడుతూ భారత బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టారు. వికెట్ కూడా బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండటంతో వీరిద్దరు సులువుగా పరుగులు చేస్తూ 31వ ఓవర్లో ఇంగ్లండ్‌ను 100 పరుగుల మైలురాయిని దాటించారు. సీమర్లు వికెట్లు తీయలేకపోవడంతో లంచ్‌కు కొద్ది ముందు అశ్విన్‌ను బరిలోకి దించారు. అయినా ఈ వ్యూహం ఫలించలేదు. స్పిన్‌ను తెలివిగా ఎదుర్కొన్న కుక్ 41వ ఓవర్లో అర్ధసెంచరీ పూర్తి చేశాడు. ఓవర్లు: 26; పరుగులు: 86; వికెట్లు: 1 సెషన్-2 : 13 పరుగులకు 3 వికెట్లు లంచ్ తర్వాత భారత్ పుంజుకునే అవకాశాన్ని ఫీల్డర్లు జారవిడిచారు. ఆరోన్ (50వ ఓవర్), అశ్విన్ (55వ ఓవర్) బౌలింగ్‌లో కుక్ ఇచ్చిన రెండు క్యాచ్‌లను విజయ్, రహానేలు నేలపాలు చేశారు. మరికొద్దిసేపటికే ఆరోన్ బౌలింగ్‌లోనే కుక్ ఇచ్చిన లో క్యాచ్‌ను ఈసారి విజయ్ నేర్పుగా ఒడిసిపట్టుకున్నాడు. కుక్, బ్యాలెన్స్ రెండో వికెట్‌కు 125 పరుగుల భాగస్వామ్యం జోడించారు. తర్వాత విజృంభించిన భారత బౌలర్లు చకచకా బ్యాలెన్స్, బెల్ (7)లను అవుట్ చేశారు. దీంతో ఇంగ్లండ్ 33 బంతుల వ్యవధిలో 13 పరుగుల తేడాతో మూడు కీలక వికెట్లు కోల్పోయింది. మొయిన్ అలీ (14) వెంటనే అవుటైనా... రూట్, బట్లర్ క్రమంగా ఇన్నింగ్స్‌ను నిర్మించారు. ఓవర్లు: 28; పరుగులు: 98; వికెట్లు: 4 సెషన్-3 : రూట్ నిలకడ టీ తర్వాత రూట్, బట్లర్ నెమ్మదిగా ఆడారు. అడపాదడపా బౌండరీలతో స్కోరును పెంచే ప్రయత్నం చేశారు. ధోని బౌలర్లను తరచూ మార్చినా ఈ జోడిని మాత్రం విడదీయలేకపోయారు. దాదాపు 19 ఓవర్లపాటు భారత బౌలర్లకు కొరకరాని కొయ్యగా తయారైన ఈ ద్వయాన్ని చివరకు ఇషాంత్ విడగొట్టాడు. మామూలుగా వచ్చిన బంతిని లెగ్‌సైడ్ ఆడిన బట్లర్ షార్ట్ మిడ్ వికెట్లో అశ్విన్ చేతికి చిక్కాడు. దీంతో రూట్, బట్లర్‌ల మధ్య ఆరో వికెట్‌కు నెలకొన్న 80 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాతి ఓవర్లోనే భువనేశ్వర్... వోక్స్ (0)ను అద్భుతమైన బంతితో డకౌట్ చేశాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన జోర్డాన్... రూట్‌కు చక్కని సహకారం అందించాడు. బౌలర్లు ఒత్తిడి పెంచినా ఏమాత్రం తడబాటు లేకుండా బ్యాటింగ్ చేశాడు. ఫలితంగా ఈ ఇద్దరు ఎనిమిదో వికెట్‌కు అజేయంగా 67 పరుగులు జోడించి మరో వికెట్ పడకుండా రోజు ముగించారు. ఓవర్లు: 32; పరుగులు: 139; వికెట్లు: 2 -
మీర్పూర్ వన్డేలో భారత్ మెరుపు విజయం
-
4.4 ఓవర్లు.. 4 పరుగులు.. 6 వికెట్లు
మిర్పూర్: స్టువార్ట్ బిన్నీ రికార్డ్ బౌలింగ్ తో బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో వన్డేలో భారత్ 47 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్ ను 2-0తో గెల్చుకుంది. రైనా సేన నిర్దేశించిన 106 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బంగ్లాదేశ్ 17.4 ఓవర్లలో 58 పరుగులకు ఆలౌటయింది. వర్షం అంతరాయం కలిగించడంతో మ్యాచ్ ను 41 ఓవర్లకు కుదించారు. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 25.3 ఓవర్లలో 105 పరుగులకు ఆలౌటయింది. రైనా 27 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. స్వల్ప లక్ష్యాన్ని చేరుకునేందుకు బరిలోకి దిగిన బంగ్లాకు భారత బౌలర్లు చుక్కలు చూపించారు. మొహిత్ శర్మ, స్టువార్ట్ బిన్నీ ధాటికి బంగ్లా బ్యాట్స్‌మెన్ నిలబడలేకపోయారు. ముఖ్యంగా బిన్నీ తన పదునైన బౌలింగ్ తో అత్యుత్తమ గణంకాలు నమోదు చేశాడు. అంతేకాకుండా తక్కువ పరుగులిచ్చి ఎక్కువ వికెట్లు తీసిన భారతీయ బౌలర్ గా రికార్డు సృష్టించాడు. స్టువార్ట్ బిన్నీ 4.4 ఓవర్లలో 4 పరుగులు మాత్రమే ఇచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. మొహిత్ శర్మ 4 వికెట్లు నేలకూల్చాడు. బంగ్లా ఆటగాళ్లలో మిథున్ అలీ(26), ముష్ఫికర్ రహీం(11) మాత్రమే రెండంకెల స్కోరు చేయగలిగారు. నలుగురు డకౌటయ్యారు. స్టువార్ట్ బిన్నీ 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అందుకున్నాడు. -
గె(ని)లుస్తారా!
ఇక బ్యాట్స్‌మెన్‌దే భారం భారత్ లక్ష్యం 407 ప్రస్తుతం 87/1 రెండో ఇన్నింగ్స్‌లో కివీస్ 105 ఆలౌట్ తొలి టెస్టులో ఒక్కసారిగా చెలరేగిన బౌలర్లు భారత్‌ను మ్యాచ్‌లో నిలబెట్టారు. అయితే కివీస్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని ఛేదించే బాధ్యతను బ్యాట్స్‌మెన్‌కు వదిలేశారు. దీంతో రసవత్తరంగా సాగుతున్న టెస్టులో కుర్రాళ్లు గె(ని)లుస్తారా! అన్నది ఆసక్తికరంగా మారింది. ఆక్లాండ్: న్యూజిలాండ్ పర్యటనలో భారత బౌలర్లు తొలిసారి తమ పూర్తిస్థాయి ప్రతిభను ప్రదర్శించారు. ఇన్నింగ్స్ బ్రేక్‌లో ధోని ఏం చెప్పాడోగానీ అంచనాలకు మించి రాణించారు. ఫలితంగా రెండో ఇన్నింగ్స్‌లో కివీస్ బ్యాట్స్‌మెన్‌ను వణికించారు. 105 పరుగులకు ఆలౌట్ చేసి మ్యాచ్‌ను భారత్ వైపు తిప్పి బ్యాట్స్‌మెన్‌పై భారం వేశారు. దీంతో ఈడెన్‌పార్క్‌లో జరుగుతున్న తొలి టెస్టు రసకందాయంలో పడింది. న్యూజిలాండ్ నిర్దేశించిన 407 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్ మూడో రోజు శనివారం ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 25 ఓవర్లలో వికెట్ నష్టానికి 87 పరుగులు చేసింది. విజయ్ (13) విఫలమైనా.... శిఖర్ ధావన్ (70 బంతుల్లో 49 బ్యాటింగ్; 5 ఫోర్లు), పుజారా (61 బంతుల్లో 22 బ్యాటింగ్; 1 ఫోర్, 1 సిక్సర్) నిలకడగా ఆడుతున్నారు. అంతకుముందు 130/4 ఓవర్‌నైట్ స్కోరుతో మూడో రోజు ఆట కొనసాగించిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 60 ఓవర్లలో 202 పరుగులకు ఆలౌటైంది. ఫలితంగా కివీస్‌కు 301 పరుగుల ఆధిక్యం లభించింది. రోహిత్ (120 బంతుల్లో 72; 8 ఫోర్లు, 1 సిక్సర్) టాప్ స్కోరర్. రవీంద్ర జడేజా (44 బంతుల్లో 30 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్సర్) ఫర్వాలేదనిపించాడు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్‌లో 41.2 ఓవర్లలో 105 పరుగులకు కుప్పకూలింది. రాస్ టేలర్ (73 బంతుల్లో 41; 4 ఫోర్లు, 1 సిక్సర్) మినహా మిగతా వారు విఫలమయ్యారు. ఊ 72 పరుగులకు 6 వికెట్లు షెడ్యూల్ కంటే మ్యాచ్ అరగంట ముందుగా ప్రారంభం కావడంతో పిచ్‌పై ఉండే తేమను కివీస్ బౌలర్లు పూర్తిగా సద్వినియోగం చేసుకున్నారు. క్రీజులో కుదురుకునేందుకు ప్రయత్నిస్తున్న రహానే (26), రోహిత్‌లను ఆరు బంతుల వ్యవధిలో అవుట్ చేశారు. సౌతీ బంతిని ఆడబోయి తొలి స్లిప్‌లో రహానే క్యాచ్ ఇవ్వగా, రోహిత్ ఓ పేలవమైన షాట్‌కు వెనుదిరిగాడు. వీరిద్దరి మధ్య ఐదో వికెట్‌కు 87 పరుగుల భాగస్వామ్యం నెలకొంది. 4 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న ధోని (10) ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. అయితే రెండో ఎండ్‌లో జడేజా మాత్రం మొండిగా పోరాడుతూ... జహీర్ (14)తో కలిసి ఫాలో ఆన్ మార్క్‌ను దాటించాడు. చివర్లో ఇషాంత్ (0), షమీ (2) వెంటవెంటనే అవుట్ కావడంతో భారత్ ఓ మాదిరి స్కోరుకే పరిమితమైంది. ఓవరాల్‌గా భారత్ 72 పరుగులకు చివరి ఆరు వికెట్లు కోల్పోయింది. వాగ్నేర్ 4, బౌల్ట్, సౌతీ చెరో మూడు వికెట్లు తీశారు. ఊ స్కోరు వివరాలు న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్: 503 ఆలౌట్ భారత్ తొలి ఇన్నింగ్స్: ధావన్ (సి) విలియమ్సన్ (బి) బౌల్ట్ 0; విజయ్ (బి) వాగ్నేర్ 26; పుజారా (సి) వాట్లింగ్ (బి) బౌల్ట్ 1; కోహ్లి (సి) ఫుల్టన్ (బి) సౌతీ 4; రోహిత్ (బి) బౌల్ట్ 72; రహానే (సి) టేలర్ (బి) సౌతీ 26; ధోని (సి) వాట్లింగ్ (బి) వాగ్నేర్ 10; జడేజా నాటౌట్ 30; జహీర్ (సి) వాట్లింగ్ (బి) వాగ్నేర్ 14; ఇషాంత్ (సి) బౌల్ట్ (బి) సౌతీ 0; షమీ (సి) ఫుల్టన్ (బి) వాగ్నేర్ 2; ఎక్స్‌ట్రాలు: 17; మొత్తం: (60 ఓవర్లలో ఆలౌట్) 202. వికెట్ల పతనం: 1-1; 2-3; 3-10; 4-51; 5-138; 6-138; 7-167; 8-188; 9-189; 10-202 బౌలింగ్: బౌల్ట్ 17-2-38-3; సౌతీ 19-6-38-3; అండర్సన్ 5-0-29-0; వాగ్నేర్ 11-0-64-4; సోధి 6-0-13-0; విలియమ్సన్ 2-0-9-0. న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్: ఫుల్టన్ (సి) జడేజా (బి) షమీ 5; రూథర్‌ఫోర్డ్ ఎల్బీడబ్ల్యు (బి) షమీ 0; విలియమ్సన్ (సి) జడేజా (బి) జహీర్ 3; టేలర్ (సి) రహానే (బి) జహీర్ 41; బి.మెకల్లమ్ రనౌట్ 1; అండర్సన్ (బి) షమీ 2; వాట్లింగ్ (బి) ఇషాంత్ 11; సౌతీ (సి) పుజారా (బి) జడేజా 14; సోధి (సి) రోహిత్ (బి) ఇషాంత్ 0; వాగ్నేర్ (సి) జడేజా (బి) ఇషాంత్ 14; బౌల్ట్ నాటౌట్ 7; ఎక్స్‌ట్రాలు: 7; మొత్తం: (41.2 ఓవర్లలో ఆలౌట్) 105. వికెట్ల పతనం: 1-1; 2-9; 3-11; 4-15; 5-25; 6-63; 7-78; 8-78; 9-80; 10-105 బౌలింగ్: షమీ 12-1-37-3; జహీర్ 9-2-23-2; ఇషాంత్ 10.2-3-28-3; జడేజా 9-4-10-1; రోహిత్ 1-0-3-0. భారత్ రెండో ఇన్నింగ్స్: విజయ్ (సి) వాట్లింగ్ (బి) సౌతీ 13; ధావన్ బ్యాటింగ్ 49; పుజారా బ్యాటింగ్ 22; ఎక్స్‌ట్రాలు: 3; మొత్తం: (25 ఓవర్లలో వికెట్ నష్టానికి) 87. వికెట్ల పతనం: 1-36; బౌలింగ్: బౌల్ట్ 6-0-28-0; సౌతీ 5-0-18-1; వాగ్నేర్ 6-2-11-0; అండర్సన్ 3-0-8-0; సోధి 4-1-17-0; విలియమ్సన్ 1-0-5-0. ఊ కుప్పకూలిన కివీస్ తన తొలి రెండు ఓవర్లలో రూథర్‌ఫోర్డ్ (0), ఫుల్టన్ (5)లను అవుట్ చేసిన షమీ కివీస్‌కు షాకిచ్చాడు. అయితే టేలర్ నిలకడగా ఆడేందుకు ప్రయత్నించినా... రెండో ఎండ్‌లో విలియమ్సన్‌ను జహీర్ కట్టడి చేశాడు. లంచ్‌కు ముందు జడేజా అద్భుతమైన త్రోకు మెకల్లమ్ రనౌట్ అయ్యాడు. లంచ్ తర్వాత షమీ... అండర్సన్ (2)ను వెనక్కిపంపాడు. దీంతో 25 పరుగులకే సగం జట్టు పెవిలియన్‌కు చేరడంతో టేలర్‌పై ఒత్తిడి పెరిగిపోయింది. చివర్లో సౌతీ (14), వాగ్నేర్ (14) కాపాడే ప్రయత్నం చేసినా భారత బౌలర్ల క్రమశిక్షణ ముందు తలవంచారు.