భారత బౌలర్ల అరుదైన రికార్డు
చాంపియన్‌ట్రోఫీలో మరో అరుదైన రికార్డు నమోదైంది. ట్రోఫీలో భారత బ్యాట్‌మెన్లు తమ సత్తాచాటుతుంటే , బౌలర్లు తమ పదునైన బౌలింగ్‌తో ప్రత్యర్థికి చుక్కలు చూపిస్తున్నారు. భువనేశ్వర్ కుమార్, ఉమేష్ యాదవ్, బూమ్రా, జడేలతో బౌలింగ్ లైన్ అసాధారణ రీతిలో చెలరేగిపోతోంది. అనూహ్యంగా అశ్విన్ సైతం జట్టులో వచ్చి బౌలింగ్ బలాన్ని మరింత పెంచాడు.
తొలిమ్యాచ్‌లో భారత్ బ్యాట్‌మెన్ల రాణింపుతో 319 పరుగులు చేయగా, బౌలర్లు తమ పదునైన బౌలింగ్‌తో పాకిస్తాన్‌ను కేవలం 164 పరుగులకే నేలకూల్చారు. అయితే తరువాతి మ్యాచ్‌లో భారత బౌలింగ్ తేలిపోయింది. లంకను ఏ పరిస్థితిల్లో కూడా ఇబ్బంది పెట్టలేక పోయారు. 322 పరుగుల లక్ష్యాన్ని అలవోకగా చేధించింది. భారత బౌలర్లు కేవలం ఒక్క వికెట్ మాత్రమే తీయగలిగారు. అది కూడా ఐదో ఓవర్ నాలుగోబంతికి భువనేశ్వర్ డిక్‌వెల్లా 7(18)పరుగుల వద్దను పెవిలియన్‌కు పంపాడు. అనంతరం గుణతిలక, మెండిస్‌ల వికెట్లు పడ్డా ఆరెండూ రన్నౌట్లు. మరొకటి రిటైర్డ్ నాటౌట్‌గా పెరీరా వెనుదిరిగాడు.
అంటే శ్రీలంకతో కేవలం ఒక్కవికెట్ మాత్రమే అదికూడా4.4 ఓవర్లల్లో. మిగతా 45.2 ఓవర్లలో ఒక్క వికెట్‌కూడా బౌలర్లు తమ ఖాతాలో వేసుకోలేకపోయారు. అనంతరం దక్షిణాఫ్రికా మ్యాచ్‌లో తొలి వికెట్‌గా ఆమ్లా35(69), అశ్విన్ బౌలింగ్‌లో 17.3 ఓవర్లో అవుట్ అయ్యాడు. అంటే శ్రీలంకతో 45.2 ఓవర్లు, ఇటు దక్షిణాఫ్రికాతో 17.2 ఓవర్లు మెత్తం 62.4 ఓవర్లలో భారత బౌలర్లు ఒక్క వికెట్‌కూడా తమ ఖాతాలో వేసుకోలేకపోయారు. అంతార్జాతీయ క్రికెట్‌లో ఇదీ ఓ రికార్డే.