బౌలర్లు నేర్చుకోవడం లేదు
గవాస్కర్ వ్యాఖ్య
బ్రిస్బేన్: గత విదేశీ పర్యటనల నుంచి భారత బౌలర్లు ఏమీ నేర్చుకోవడం లేదని మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ విమర్శించారు. టెస్టు సిరీస్‌తో పాటు వన్డేల్లోనూ బౌలర్ల ప్రదర్శన బాగాలేదని ధ్వజమెత్తారు. ‘గత కొన్నేళ్లుగా విదేశాల్లో వన్డే క్రికెట్ ఆడుతున్నారు. కానీ ఆ అనుభవం నుంచి బౌలర్లు ఏమాత్రం నేర్చుకోవడం లేదు. ఇది ఆందోళ చెందాల్సిన అంశం. ప్రపంచకప్‌కు సమయం దగ్గరపడుతోంది.
టైటిల్ నిలబెట్టుకోవాలంటే సరైన ప్రోత్సాహం అవసరం. ప్రస్తుత పరిస్థితుల్లో బౌలర్లు కేవలం బౌలింగ్ మాత్రమే చేస్తున్నారనిపిస్తోంది. ఈ సుదీర్ఘ పర్యటనలో వాళ్లు నేర్చుకున్నదేమీ కనిపించడం లేదు’ అని సన్నీ పేర్కొన్నారు. అయితే ముక్కోణపు సిరీస్‌లో ఇంగ్లండ్ ప్రదర్శనను భారత్ స్ఫూర్తిగా తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఓపెనర్లుగా ఎవరు వచ్చినా కోహ్లిని నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దించాలని సూచించారు.