భారత బౌలర్లు భళా.. కుప్పకూలిన లంక
కొలంబో: శ్రీలంక పర్యటనలో భారత బ్యాట్స్మెన్తో పాటు బౌలర్లూ సత్తాచాటారు. శ్రీలంక బోర్డు ప్రెసిడెంట్స్ లెవెన్తో మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్లో భారత్ ఓవరాల్గా 342 పరుగుల భారీ ఆధిక్యంలో నిలిచింది.
మ్యాచ్ రెండో రోజు శుక్రవారం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన లంకను భారత బౌలర్లు 121 పరుగులకే కుప్పకూల్చారు. భారత పేసర్ ఇషాంత్ శర్మ (5/23) సూపర్ స్పెల్తో విజృంభించి.. లంక టాపార్డర్ పనిపట్టాడు. వరుణ్ ఆరోన్, అశ్విన్ చెరో రెండు వికెట్లు తీశారు. లంక జట్టులో డిక్వెల్లా 41,సిరివర్ధన 32, గునతిలక 28 పరుగులు చేయగా, మిగిలినవారు సింగిల్ డిజిట్కు పరిమితమయ్యారు.
అనంతరం రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్ రెండో రోజు ఆట ముగిసేసరికి 3 వికెట్లకు 112 పరుగులు చేసింది. పుజారా (31 బ్యాటింగ్), రాహుల్ (47 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. రోహిత్ (8), కోహ్లీ (18), సాహ (1) అవుటయ్యారు. ఓవర్నైట్ స్కోరు 314/6తో ఈ రోజు ఉదయం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ 351 పరుగులకు ఆలౌటైంది.