![Harshal Patel deserves every penny earned at the IPL auction Says Sunil Gavaskar - Sakshi](/styles/webp/s3/article_images/2022/02/17/Sunil-Gavaskar.jpg.webp?itok=c86OX8ni)
ఐపీఎల్-2022 మెగా వేలంలో టీమిండియా పేసర్ హర్షల్ పటేల్‌ను దక్కించకోవడానికి చాలా ప్రాంఛైజీలు పోటీ పడ్డాయి. చివరకి ఆర్సీబీ రూ. 10.75 కోట్ల భారీ ధరకు హర్షల్ పటేల్‌ను కొనుగోలు చేసింది. ఈ నేపథ్యంలో హర్షల్ పటేల్‌పై భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ ప్రశంసల వర్షం కురిపించాడు. మెగా వేలంలో హర్షల్ పటేల్ తగిన ధర దక్కిందని సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. ఇక వెస్టిండీస్‌తో జరిగిన తొలి టీ20లో రెండు వికెట్లు పడగొట్టి భారత విజయంలో హర్షల్ పటేల్ తన వంతు పాత్ర పోషించాడు. "వేలంలో దక్కిన ప్రతీ పైసా, ప్రతీ రూపాయికి హర్షల్ పటేల్ అర్హుడు.
గత ఏడాది సీజన్‌లో హర్షల్ అద్భుతమైన ప్రదర్శన చేశాడు. అంతకుముందు అతడి బౌలింగ్ పేస్‌లో ఏటువంటి మార్పు లేకపోవడంతో బ్యాటర్లు ఈజీగా ఎదుర్కొనేవారు. కానీ అతడు ఇప్పుడు తనను తాను రూపు దిద్దు కున్నాడు. ప్రస్తుతం అద్భుతమైన పేస్‌తో హర్షల్ పటేల్ బౌలింగ్ చేస్తున్నాడు. తన పేస్‌లో మార్పులతో బ్యాటర్లను అతడు ఇబ్బంది పెడుతున్నాడు. అదే విధంగా అఖరి ఓవర్లలో అతడు స్లో బౌన్సర్లు, యార్కర్లు బౌలింగ్ చేయగలడు" అని గవాస్కర్ పేర్కొన్నాడు.
చదవండి: IPL 2022: ఆర్సీబీ కెప్టెన్‌గా దక్షిణాఫ్రికా స్టార్ ఆటగాడు.. వేలంలో 7కోట్లు!
Comments
Please login to add a commentAdd a comment