Ind Vs SA T20: Harshal Patel Likely To Miss South Africa Series Due To Injury - Sakshi
Sakshi News home page

IND Vs SA T20 2022: దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌.. భారత యువ పేసర్‌ దూరం..!

Published Fri, May 20 2022 5:18 PM | Last Updated on Sat, May 21 2022 8:22 AM

Harshal Patel likely to MISS South Africa series with injury - Sakshi

ఫైల్‌ ఫొటో

దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కు ముందు టీమిండియాకు భారీ షాక్‌ తగిలే అవకాశం ఉంది. భారత యువ పేసర్‌ హర్షల్ పటేల్ గాయం కారణంగా దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కు దూరమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఐపీఎల్‌- 2022లో భాగంగా గురువారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హర్షల్ పటేల్ చేతికి గాయమైంది. దీంతో ఈ మ్యాచ్‌లో ఒక్క ఓవర్‌ మాత్రమే బౌలింగ్‌ చేసిన హర్షల్ పటేల్ ఫీల్డ్‌ను వీడాడు.

ఇక ఈ సిరీస్‌కు భారత జట్టును మే 25న బీసీసీఐ ప్రకటించనుంది. అయితే టీమిండియాను గాయాల బెడద వెంటాడుతోంది. ఇప్పటికే స్టార్‌ పేసర్‌ దీపక్‌ చాహర్‌ గాయం కారణంగా ఈ ఏడాది ఐపీఎల్‌కు దూరం కాగా.. సూర్యకుమార్‌ యాదవ్‌, జడేజా టోర్నీ మధ్యలో తప్పుకున్నారు. దీంతో ఈ సిరీస్‌కు వీరి ముగ్గురు అందుబాటుపై కూడా సందిగ్ధం నెలకొంది. ఇక ఈ సిరీస్‌లో భాగంగా తొలి టీ20 ఢిల్లీ వేదికగా జూన్‌ 9న జరగనుంది.

చదవండి: Asia Cup and T20 WC: డీకేకు మొండిచేయి.. హార్దిక్‌, చహల్‌కు చోటు! బ్యాకప్‌ ప్లేయర్‌గా త్రిపాఠి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement