ఇక భారత్‌కు కష్టమే: గవాస్కర్ | India has little chance to win in 2nd test, says Gavaskar | Sakshi
Sakshi News home page

ఇక భారత్‌కు కష్టమే: గవాస్కర్

Published Tue, Feb 18 2014 1:04 AM | Last Updated on Wed, Oct 17 2018 4:43 PM

ఇక భారత్‌కు కష్టమే: గవాస్కర్ - Sakshi

ఇక భారత్‌కు కష్టమే: గవాస్కర్

వెల్లింగ్టన్: న్యూజిలాండ్‌తో రెండో టెస్టులో భారత్ విజయం సాధించడం అసాధ్యమని సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డారు. ఇక ఓడిపోకుండా కనీసం డ్రా చేసుకోవడానికి ప్రయత్నించాలని సూచించారు. ‘ఈ పరిస్థితికి భారత బౌలర్లను తప్పుబట్టలేం. నిజానికి మెకల్లమ్ అత్యద్భుతంగా ఆడాడు. వాట్లింగ్ కూడా నాణ్యమైన ఇన్నింగ్స్ ఆడాడు. వీళ్లిద్దరూ ఆడుతున్నంతసేపు పిచ్ బ్యాటింగ్‌కు సహకరించింది’ అని గవాస్కర్ చెప్పారు. భారత్‌కు ఓ నాణ్యమైన బౌలింగ్ ఆల్‌రౌండర్ అవసరాన్ని ఈ టెస్టు మరోసారి బయటపెట్టిందని అన్నారు. ‘ఏడో స్థానంలో బ్యాటింగ్ చేయగల నాణ్యమైన బౌలింగ్ ఆల్‌రౌండర్ భారత్‌కు కావాలి. ఆ లోటు ఈ టెస్టులో మరోసారి తెలిసొచ్చింది’ అని సన్నీ అభిప్రాయపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement