ధోనిని టార్గెట్ చేస్తారా?
న్యూఢిల్లీ: ఐదు వన్డేల సిరీస్లో భాగంగా వెస్టిండీస్ తో జరిగిన నాల్గో వన్డేలో టీమిండియా ఓటమికి మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఒక్కడినే బాధ్యుణ్ని చేయడం సమంజసం కాదని దిగ్గజ క్రికెటర్ సునీల్ గావస్కర్ అభిప్రాయపడ్డాడు.స్వల్ప లక్ష్యాన్ని ఛేదించడంలో జట్టు మొత్తం విఫలమైతే, ప్రత్యేకంగా ధోనినే టార్గెట్ చేయడం ఏమిటని ప్రశ్నించాడు. ' నాల్గో వన్డేలో భారత జట్టు ఓటమికి ధోని ఒక్కడే కారణమా. అందరికీ ధోని మ్యాచ్ ను గెలిపించకపోవడమే కనబడుతుందా. జట్టంతా విఫలం చెందితే ధోనిని విమర్శిస్తారా. ఇది కరెక్ట్ కాదు'అని గావస్కర్ అండగా నిలిచాడు.
ఇదిలా ఉంచితే, భారత క్రికెట్ జట్టుకు తదుపరి కోచ్ ఎవరైతే బాగుంటుందనే ప్రశ్నకు రవిశాస్త్రి తొలి ప్రాధాన్యత ఇచ్చాడు గావస్కర్. టీమిండియా జట్టుతో కలిసి డైరెక్టర్ గా పనిచేసిన అనుభవం ఉన్న రవిశాస్త్రి తగిన వ్యక్తి అనుకుంటున్నట్లు పేర్కొన్నాడు. మరొకవైపు వీరేంద్ర సెహ్వాగ్, టామ్ మూడీలను కూడా గావస్కర్ సమర్ధించాడు. ఐపీఎల్లో కింగ్స్ పంజాబ్ కు కోచ్ గా చేసిన సెహ్వాగ్ తన బాధ్యతల్ని చక్కగా నిర్వర్తించాడని, అదే సమయంలో సన్ రైజర్స్ బ్యాటింగ్ కోచ్ గా మూడీ సేవలు కూడా అమోఘమన్నాడు.