న్యూఢిల్లీ: టీమిండియా మేనేజ్మెంట్ మాటలు ఆపి, ఆటపై దృష్టిసారించాలని మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ హితవు పలికారు. శ్రీలంకతో తొలి టెస్టులో భారత్ ఘోరపరాజయం అనంతరం గవాస్కర్ పైవిధంగా స్పందించారు.
దూకుడు స్వభావం మాటలు, తాత్కాలిక చర్చలు ఆపి మెరుగైన ఆట ఆడటంపై దృష్టిసారించాల్సిన సమయం ఆసన్నమనైందని గవాస్కర్ అన్నారు. శ్రీలంకతో గాలె టెస్టులో నాలుగోరోజు 176 పరుగుల లక్ష్యసాధనలో భారత్ 63 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. కాగా లంకతో మూడు టెస్టుల సిరీస్లో టీమిండియా గాడిలో పడుతుందని గవాస్కర్ విశ్వాసం వ్యక్తం చేశాడు.
'మాటలు ఆపి ఆటపై దృష్టిపెట్టండి'
Published Sat, Aug 15 2015 8:36 PM | Last Updated on Sun, Sep 3 2017 7:30 AM
Advertisement
Advertisement