
ఇటీవల క్రికెటర్లు తమ కిష్టమైన నటుడిని అనుకరిస్తూ డైలాగ్స్ చెప్తున్న వీడియోలు సోషల్‌మీడియాలో రచ్చ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో డేవిడ్ వార్నర్ ముందు వరుసలో ఉంటాడని చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే లాక్‌డౌన్ సమయంలో టాలీవుడ్ తారల డైలాగులు, డాన్సులతో నెట్టింట రచ్చ మామూలుగా చేయలేదు వార్నర్. ఇప్పటికే వీరేంద్ర సెహ్వాగ్ కూడా పవన్ కల్యాణ్ గబ్బర్ సింగ్ చిత్రంలోని డైలాగ్స్ చెప్పగా అవి వైరల్‌గా మారాయి. తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ కూడా ఆ జాబితాలో చేరిపోయాడు.
ఇటీవల కైఫ్ ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు పాపులర్ డైలాగ్ చెప్పి వావ్ అనిపించాడు. ఇంతకీ ఆ డైలాగ్ ఏంటనుకుంటున్నారా? మహేశ్ బ్లాక్ బస్టర్ సినిమా దూకుడులోని ఓ పాపులర్ డైలాగ్ చెప్పాడు. ‘మైండ్‌లో ఫిక్సయితే బ్లైండ్‌గా వెళ్లిపోతా అని అప్పట్లో మన ప్రిన్స్ తన మేనరిజంతో చెప్పి ప్రేక్షకులకు మైండ్ బ్లాక్ చేశాడు కదా ! దాన్నే ప్రస్తుతం ఈ మాజీ క్రికెటర్ తన స్టైల్లో ఆ డైలాగ్‌ను చెప్పాడు.
ఈ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ప్రత్యేకంగా ప్రిన్స్ ఫ్యాన్స్ అయితే ఈ వీడియో నచ్చడంతో తెగ షేర్లు చేస్తూ కామెంట్లు పెడుతున్నారు. అలా ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట దూసుకుపోతుంది రచ్చ చేస్తోంది. కాగా మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న సర్కారు వారి పాట చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. కీర్తి సురేష్ ఇందులో హీరోయిన్‌గా నటిస్తున్నారు.
Indian Cricketer #MohammedKaif About Superstar #MaheshBabu 🔥🌟
— ꓷ A Я K 🦇💊 (@GothamHero_) September 8, 2021
"MIND LO FIX AITHE BLIND GA VELLIPOTHA "⚡💥 pic.twitter.com/TCLx62N3kb
చదవండి: T20 World Cup: అతని గాయమే అశ్విన్‌కు కలిసొచ్చింది: చీఫ్ సెలెక్టర్