‘మా నాన్న నవ్వు.. మా బిడ్డ చిరునవ్వు’ | Fathers Day 2020: Tollywood Celebrities Wishes Their Real Heroes | Sakshi
Sakshi News home page

‘మీరే మా మార్గ నిర్దేశకులు నాన్న’

Published Sun, Jun 21 2020 10:44 AM | Last Updated on Sun, Jun 21 2020 10:44 AM

Fathers Day 2020: Tollywood Celebrities Wishes Their Real Heroes - Sakshi

హైదరాబాద్‌: ‘మా నాన్న నవ్వు.. నా బిడ్డ చిరునవ్వు.. రెండు నాకు చాలా ఇష్టం’ అంటున్నారు మెగాస్టార్‌ చిరంజీవి. ఆదివారం ఫాదర్స్‌ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్‌ చేశారు. తన తండ్రితో రామ్‌చరణ్‌ చిన్నప్పుడు దిగిన పాతఫోటోను జతచేసి ‘మా నాన్నతో చిరుత’ అంటూ పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ పరవశించిపోయారు. చిరంజీవితో పాటు టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు, సుధీర్‌ బాబు, దేవిశ్రీ ప్రసాద్‌, గౌతమ్‌, సితార, మంజుల, తదితర టాలీవుడ్‌ ప్రముఖులు సోషల్‌ మీడియా వేదికగా ఫాదర్స్‌డే శుభాకాంక్షలు తెలుపుతూ తమ తండ్రితో ఉన్న అనుబంధాన్ని అభిమానులతో పంచుకుంటున్నారు. ('20 ఏళ్లుగా నన్ను మోస్తూనే ఉన్నారు')

ఇక మహేశ్‌ బాబుకు గౌతమ్‌, సితారలు ఇన్‌స్టాలో ఫాదర్స్‌ డే విషెస్‌ తెలుపుతూ పలు ఫోటోలను పోస్ట్‌ చేశారు. ‘మీరు మాకు ఎంతో గర్వకారణం’ అని గౌతమ్‌ పేర్కొనగా.. ‘నేను మీతో అల్లరి చేయటాన్ని ప్రేమిస్తుంటాను. మీరు కూడా ఇష్టపడతారు. హ్యాపీ ఫాదర్స్‌డే నాన్న’ అంటూ సీతు పాప ఇన్‌స్టాలో రాసుకొచ్చారు. ఇక మహేశ్‌బాబు కూడ తన తండ్రి కృష్ణకు ఫాదర్స్‌డే శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్‌ చేశారు. (రోల్‌ మోడల్‌ రీల్‌ ఫాదర్స్‌)

‘ప్రేమ, దయ, శ్రద్ధ, ధృడత్వం, సున్నితత్వం, సంరక్షణ ఇలా అనేక పదాలతో మా నాన్న గురించి చెప్పగలను. చెబుతూనే ఉంటాను. నాతో ఎలా ఉన్నారో నేను మా పిల్లలతో ఉండటానికి ప్రయత్నిస్తునా. మీరే నా మార్గ నిర్దేశకులు. హ్యాపీ ఫాదర్స్‌డే నాన్న’ అంటూ హార్ట్‌ టచింగ్‌ ట్వీట్‌ చేశారు. మహేశ్‌ బాబు. ఇక యువ హీరోలు తమ పిల్లలతో కలిసి దిగిన ఫోటోలను షేర్‌ చేస్తూ ఓ తండ్రిగా తమ అనుభూతిని సోషల్‌ మీడియాలో ఫ్యాన్స్‌ షేర్‌ చేసుకుంటున్నారు.  (ఫాదర్స్‌ డే ఎలా వచ్చిందో తెలుసా!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement