
మాజీ క్రికెటర్ మనోజ్ తివారికి కొత్తగా ఏర్పడిన బెంగాల్ కేబినెట్‌లో చోటు దక్కింది. సోమవారం జరిగిన కార్యక్రమంలో యువజన, క్రీడా శాఖ మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన అతను ‘కొత్త ప్రయాణం మొదలైంది’ అంటూ ట్వీట్ చేశాడు. తివారి శివ్‌పూర్ నియోజకవర్గంనుంచి విజయం సాధించాడు. భారత్ తరఫున 12 వన్డేలు, 3 టి20లు ఆడిన తివారి... 16 ఏళ్ల ఫస్ట్ క్లాస్ కెరీర్‌లో 50.36 సగటుతో 8965 పరుగులు చేశాడు. 2012లో ఐపీఎల్ గెలిచిన కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టులో మనోజ్ తివారి కూడా సభ్యుడు.
Comments
Please login to add a commentAdd a comment