కోల్‌కతా: సినిమా డైలాగులు పేల్చడం రాజకీయ నాయకులకు ఈమధ్య బాగా అలవాటైంది. అయితే పంచ్ కోసం పేలుస్తున్న ఆ డైలాగులు.. ఒక్కోసారి బెడిసి కొడుతున్నాయి కూడా. తృణమూల్ కాంగ్రెస్ నేత మనోజ్ తివారీ తాజాగా అల్లు అర్జున్ పుష్ఫ సినిమాలోంచి కొట్టిన డైలాగ్.. బీజేపీకి బాగా కోపం తెప్పించింది.
మొత్తం బెంగాల్ ప్రభుత్వం తీరే పుష్ప సినిమాలాగా ఉంది. ఎర్ర చందనపు స్మగర్ల సినిమాలో ఏవో డైలాగులు కొడితే.. ఇక్కడి టీఎంసీ నేత కూడా అలాగే డైలాగులు కొడుతున్నాడు. ఒకరేమో యువత హక్కులను దోచుకుంటున్నారు. మరొకరేమో స్కామ్‌లు చేసి వాళ్ల భవిష్యత్తుతో ఆడుకుంటున్నారు. టీఎంసీ నేతల తీరు.. ఆ సినిమాలోని ఎర్ర చందనపు స్మగ్లర్లలాగే ఉంది. వాళ్లతో పాటు ఆ పార్టీ ఒరిజినల్ క్యారెక్టర్లను బయటపెడుతోంది అంటూ బీజేపీ నేత ఉమేశ్ రాయ్ మండిపడ్డారు.
క్రికెటర్ నుంచి రాజకీయ నేత, రాష్ట్ర క్రీడాశాఖ మంత్రిగా ఎదిగిన మనోజ్ తివారీ.. ఆదివారం ఓ ర్యాలీలో పార్టీ కార్యకర్తలంతా సంఘటితంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ క్రమంలో.. పుష్ప సినిమాలోని ఝుకేగా నహీ సాలా' (తెలుగులో నీయవ్వ.. తగ్గేదే లే) అంటూ బీజేపీకి సవాల్ విసిరాడు. ఈ వ్యాఖ్యలపైనే బీజేపీ భగ్గుమంది.
అయితే.. ర్యాలీ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపడంతో.. మీడియా ప్రతినిధులు ఆయన తీరును ప్రశ్నించారు. దీంతో ఆయన నేను అలా మాట్లాడి ఉండాల్సింది కాదు.. ఆ డైలాగ్ కొట్టాల్సింది కాదు అని తివారీ క్షమాపణలు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment