టీమిండియా క్రికెట్ మనకు ఎందరో ఫాస్ట్ బౌలర్లను పరిచయం చేసింది. 1970, 80వ దశకంలో కపిల్ దేవ్, బిషన్‌సింగ్ బేడీ లాంటి వాళ్లు.. 90వ దశకంలో జల్ జవగల్ శ్రీనాథ్, వెంకటేశ్ ప్రసాద్, అజిత్ అగార్కర్, స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లేలు ఉంటారు. ఇక 20వ దశకంలో జహీర్ ఖాన్, హర్భజన్ సింగ్, ఇర్ఫాన్ పఠాన్, మునాఫ్ పటేల్.. ఈ తరంలో బుమ్రా, భువనేశ్వర్, మహ్మద్ షమీ ఇలా చెప్పుకుంటే పోతే ఎందరో క్రికెటర్లు వస్తారు. అయితే మనం పైన చెప్పుకున్న వాళ్లంతా క్రికెట్‌లో ఒక్కో దశలో వెలిగారు.. వెలుగుతున్నారు. ఈ క్రమంలోనే వీరి మధ్యలో మనకు తెలియకుండానే చాలా మంది బౌలర్లు వచ్చారు.. కనుమరుగయ్యారు. అలాంటి కోవకే చెందిన వాడే.. టీమిండియా మాజీ ఫాస్ట్ బౌలర్ సలీల్ అంకోలా.
సలీల్ అంకోలా.. ముంబై నుంచి వచ్చిన టాప్ పేస్ బౌలర్. భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ అరంగేట్రం చేసిన 1989వ సంవత్సరంలోనే సలీల్ అంకోలా కూడా టీమిండియా తరపున అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. అయితే ఎంత వేగంగా వచ్చాడో.. అంతే వేగంగా కనుమరుగయ్యాడు. టీమిండియా తరపున ఒక టెస్టు, 20 వన్డేలు మాత్రమే ఆడిన సలీల్ అంకోలా 1997లో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు.
తాజాగా క్రిక్‌బజ్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో సలీల్ అంకోలా క్రికెట్‌పై తనకు అసూయ ఎలా ఏర్పడిందన్నది వివరించాడు. ''1989లోనే దిగ్గజం సచిన్ టెండూల్కర్‌తో పాటే అరంగేట్రం చేసినప్పటికి పెద్దగా అవకాశాలు రాలేదు. బహుశా నా బౌలింగ్ నచ్చకనో మరేంటో తెలియదు. అయితే నాకు వచ్చిన అవకాశాలను కూడా సరిగా ఉపయోగించుకోలేకపోయాను. ఆ తర్వాత ఎనిమిదేళ్ల కెరీర్‌లో ఎన్నోసార్లు జట్టులోకి రావడం వెళ్లడం జరిగింది. టీమిండియాలో చోటు దక్కకపోతే.. టీమిండియా-ఏకి ఎంపికయ్యేవాడిని. ఎక్కడికి వెళ్లినా నా పని మాత్రం ఒకటే ఉండేది. మైదానంలో కంటే డ్రింక్స్ బాయ్‌గానే ఎక్కువగా సేవలందించాను. ఒక దశలో క్రికెట్‌పై విపరీతమైన అసూయ పుట్టుకొచ్చింది. అందుకే ఉన్నపళంగా క్రికెట్‌కు రిటైర్మెంట్‌కు ప్రకటించాను.
2001 తర్వాత క్రికెట్‌కు పూర్తిగా దూరమయ్యాను. ఆటకు మాత్రమే దూరమవ్వాలనుకున్న నేను.. తెలియకుండానే చేసిన తప్పు వల్ల కొన్నేళ్ల పాటు క్రికెట్‌కు దూరంగా ఉంటానని అప్పుడనుకోలేదు. అప్పట్లో మ్యాచ్‌లను టెలికాస్ట్ చేసిన సోనీ చానెల్ నుంచి కామెంటేటర్‌గా విధులు నిర్వర్తించాలంటూ నాకు జాబ్ ఆఫర్ వచ్చింది. అయితే దానిని నేను తిరస్కరించాను. కానీ ఎందుకు చేశానో తెలియదు. ఇప్పుడు అది తలుచుకుంటే ఎంత మూర్కత్వమైన నిర్ణయం తీసుకున్నానా అని బాధపడాల్సి వచ్చింది. ''అంటూ చెప్పుకొచ్చాడు.
ఇక 2010లో అంకోలా వ్యక్తిగత జీవితం తలకిందులైంది. మొదటి భార్యతో విడాకుల అనంతరం సలీల్ అంకోలా మద్యానికి బానిసయ్యాడు. మనుషులను మరిచిపోయేంతగా తాగుతుండేవాడు. అతని ప్రవర్తనతో విసిగిపోయిన రెండో భార్య సలీల్‌ను రీహాబిలిటేషన్ సెంటర్‌కు పంపించింది. దాదాపు 10 ఏళ్ల పాటు రీహాబిలిటేషన్‌లో ఉన్న సలీల్ అంకోలా మళ్లీ మాములు మనిషిగా తిరిగొచ్చాడు. కొత్త జీవితం ప్రారంభించాలనుకున్నాడు. ఈ మధ్యనే ఏ క్రికెట్‌పై అసూయపడ్డాడో దానిలోనే మళ్లీ అడుగుపెట్టాడు. గతేడాది ముంబై క్రికెట్‌కు చీఫ్ సెలెక్టర్‌గా ఎంపికయ్యి తన సేవలందిస్తున్నాడు.
చదవండి: Stuart MacGill: 'పాయింట్ బ్లాక్‌లో గన్.. నగ్నంగా నిలబెట్టి దారుణంగా కొట్టారు'
Katherine Brunt: 'ఒక శకం ముగిసింది'.. టెస్టులకు ఇంగ్లండ్ దిగ్గజ క్రికెటర్ గుడ్‌బై
Comments
Please login to add a commentAdd a comment