50 ఏళ్ల తర్వాత టెస్టు క్రికెటర్‌గా గుర్తింపు | Alan Jones finally awarded England cap 50 years after debut | Sakshi
Sakshi News home page

50 ఏళ్ల తర్వాత టెస్టు క్రికెటర్‌గా గుర్తింపు

Published Thu, Jun 18 2020 4:05 AM | Last Updated on Thu, Jun 18 2020 4:05 AM

Alan Jones finally awarded England cap 50 years after debut - Sakshi

ఇంగ్లండ్‌ మాజీ క్రికెటర్ అలాన్‌ జోన్స్‌

ఇంగ్లండ్‌కు చెందిన 82 ఏళ్ల మాజీ క్రికెటర్‌ అలాన్‌ జోన్స్‌ కోరికను ఈసీబీ 50 ఏళ్ల తర్వాత తీర్చింది. 1970లో జోన్స్‌ తన కెరీర్‌లో ఏకైక టెస్టును ఇంగ్లండ్‌ తరఫున రెస్టాఫ్‌ ది వరల్డ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆడాడు. అయితే కొన్నాళ్ల తర్వాత ఐసీసీ ఆ మ్యాచ్‌కు టెస్టు హోదాను తీసేసింది. దాంతో ఇంగ్లండ్‌ టెస్టు క్రికెటర్‌ను అనిపించుకోలేకపోయాననే బాధ అతడిని వెంటాడింది. ఆ మ్యాచ్‌ జరిగి 50 ఏళ్లు అయిన సందర్భంగా జోన్స్‌ను టెస్టు ఆటగాడిగా గుర్తిస్తూ ఈసీబీ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత వరుస ప్రకారం అతనికి ‘696’ నంబర్‌ క్యాప్‌ను అందించడంతో జోన్స్‌ సంబరపడిపోయాడు. ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో చక్కటి రికార్డు ఉన్న జోన్స్‌ 645 మ్యాచ్‌లలో 56 సెంచరీలు సహా 36,049 పరుగులు చేశాడు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement