అంతా అనుకున్నట్లే జరిగింది. ఇంగ్లండ్ హెడ్ కోచ్ పదవి నుంచి ఆసీస్ మాజీ క్రికెటర్ మాథ్యూ మోట్ తప్పుకున్నాడు. ఈ విషయాన్ని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు మంగళవారం ఆధికారికంగా ధ్రువీకరించింది. వన్డే ప్రపంచకప్-2023, టీ20 ప్రపంచకప్-2024లో ఇంగ్లండ్ పేలవ ప్రదర్శన కారణంగా మాథ్యూ మోట్‌పై ఈసీబీ వేటు వేసింది.
గతేడాది వన్డే ప్రపంచకప్ గ్రూపు స్టేజిలో ఇంటిముఖం పట్టిన ఇంగ్లీష్ జట్టు.. ఈ ఏడాది పొట్టి ప్రపంచకప్ సెమీఫైనల్లో ఓటమి పాలైంది. "ఇంగ్లండ్ క్రికెట్ తరపున మాథ్యూ మాట్‌కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంగ్లండ్ పురుషుల జట్టుకు వరల్డ్‌కప్‌ను అందించిన ముగ్గురు కోచ్‌లలో ఒకడిగా మాట్ నిలిచాడు.
అతడి జట్టుకు ఎన్నో అద్భుత విజయాలను అందించాడు. అతడు అతి తక్కువ సమయంలోనే మూడు వరల్డ్‌కప్‌లో ఇంగ్లండ్ కోచ్‌గా పనిచేశాడు. రాబోయే సవాళ్లను స్వీకరించేందుకు మా కోచింగ్ స్టాప్‌లో మార్పులు చేయాలని భావించాము. అందులో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నాము.
వచ్చే ఏడాది జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ, వైట్ బాల్ సిరీస్‌లపై ప్రస్తుతం మా దృష్టి అంతా ఉంది. త్వరలోనే కొత్త హెడ్ కోచ్‌ను ఎంపిక చేస్తాము. అప్పటివరకు మార్కస్ ట్రెస్కోథిక్ తాత్కాలిక హెడ్‌కోచ్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు. వైట్-బాల్ కెప్టెన్ జోస్ బట్లర్‌తో కలిసి పనిచేయనున్నాడు.
మార్కస్, జోస్ మధ్య మంచి అనుబంధం ఉంది. జట్టు విజయాలు కోసం వీరిద్దరూ కృషి చేస్తారని ఆశిస్తున్నాని" ఇంగ్లండ్ మేనేజింగ్ డైరెక్టర్, రాబ్ కీ మోట్ ఓ ప్రకటనలో పేర్కొన్నాడు. కాగా మోట్ ఆధ్వర్యంలోనే టీ20 వరల్డ్‌కప్-2022ను ఇంగ్లండ్ సొంతం చేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment