టీమిండియాతో టెస్ట్‌ సిరీస్‌.. ఇంగ్లండ్‌ జట్టు ప్రకటన | England Announced Their Men's Squad For India Test Tour - Sakshi
Sakshi News home page

టీమిండియాతో టెస్ట్‌ సిరీస్‌.. ఇంగ్లండ్‌ జట్టు ప్రకటన

Dec 11 2023 5:54 PM | Updated on Dec 11 2023 6:07 PM

England Mens Squad For India Test Tour Announced - Sakshi

వచ్చే ఏడాది (2024) జనవరి 25 నుంచి మార్చి 11 వరకు భారత్‌తో జరిగే ఐదు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ కోస​ం 16 మంది సభ్యుల జట్టును ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు (ఈసీబీ) ఇవాళ (డిసెంబర్‌ 11) ప్రకటించింది. ఈ జట్టుకు సారధిగా బెన్‌ స్టోక్స్‌ను ఎంపిక చేసిన ఈసీబీ.. ముగ్గురు అన్‌క్యాప్డ్‌ ప్లేయర్లకు (గస్‌ అట్కిన్సన్‌ (పేస్‌ బౌలర్‌), టామ్‌ హార్ట్లీ (ఆఫ్‌ స్పిన్నర్‌), షోయబ్‌ బషీర్‌ (ఆఫ్‌ స్పిన్నర్‌)) అవకాశం కల్పించింది.

గాయం కారణంగా గత కొంతకాలంగా జట్టుకు దూరంగా ఉన్న జాక్‌ లీచ్‌ భారత్‌తో సిరీస్‌తో టెస్ట్‌ క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇవ్వనున్నాడు. ఈ సిరీస్‌ కోసం భారత జట్టును ప్రకటించాల్సి ఉంది. 

భారత్‌తో సిరీస్‌కు ఇంగ్లండ్‌ జట్టు: బెన్ స్టోక్స్ (కెప్టెన్‌), రెహాన్ అహ్మద్, జేమ్స్ ఆండర్సన్, గస్ అట్కిన్సన్, జానీ బెయిర్‌స్టో, షోయబ్ బషీర్, హ్యారీ బ్రూక్, జాక్ క్రాలే, బెన్ డకెట్, బెన్ ఫోక్స్, టామ్ హార్ట్లీ, జాక్ లీచ్, ఒల్లీ పోప్, ఓలీ రాబిన్సన్, జో రూట్, మార్క్ వుడ్

షెడ్యూల్‌..

  • తొలి టెస్ట్‌: జనవరి 25-29 (హైదరాబాద్‌)
  • రెండో టెస్ట్‌: ఫిబ్రవరి 2-6 (వైజాగ్‌)
  • మూడో టెస్ట్‌: ఫిబ్రవరి 15-19 (రాజ్‌కోట్‌)
  • నాలుగో టెస్ట్‌: ఫిబ్రవరి 23-27 (రాంచీ)
  • ఐదో టెస్ట్‌: మార్చి 7-11 (ధర్మశాల)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement