ఈ నెల (ఆగస్ట్) 21 నుంచి స్వదేశంలో శ్రీలంకతో జరిగే మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం 14 మంది సభ్యుల ఇంగ్లండ్ జట్టును ఇవాళ (ఆగస్ట్ 4) ప్రకటించారు. ఈ జట్టుకు బెన్ స్టోక్స్ కెప్టెన్‌గా వ్యవహరించనుండగా.. జోర్డన్ కాక్స్, మాథ్యూ పాట్స్, ఓలీ స్టోన్ కొత్తగా ఎంపికయ్యారు. లంకతో సిరీస్‌లో తొలి టెస్ట్ ఆగస్ట్ 21న (ఓల్డ్ ట్రాఫోర్డ్).. రెండో టెస్ట్ ఆగస్ట్ 29న (లార్డ్స్).. మూడో టెస్ట్ సెప్టంబర్ 6న (కెన్నింగ్‌స్టన్ ఓవల్) మొదలుకానున్నాయి. ఇంగ్లండ్ ఇటీవలే స్వదేశంలో వెస్టిండీస్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసిన విషయం తెలిసిందే.
శ్రీలంకతో మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు ఇంగ్లండ్ జట్టు..
బెన్ స్టోక్స్ (కెప్టెన్), గస్ అట్కిన్సన్, షోయబ్ బషీర్, హ్యారీ బ్రూక్, జోర్డన్ కాక్స్, బెన్ డకెట్, డాన్ లారెన్స్, ఓలీ పోప్, మాథ్యూ పాట్స్, జో రూట్, జేమీ స్మిత్ (వికెట్‌కీపర్), ఓలీ స్టోన్, క్రిస్ వోక్స్, మార్క్ వుడ్
Comments
Please login to add a commentAdd a comment