ఇంగ్లండ్ మాజీ వికెట్ కీపర్ జిమ్ పార్క్స్(90) బుధవారం కన్నుమూశాడు. అతను మృతి చెందే నాటికి ఇంగ్లండ్ తరపున అత్యంత వృద్ధ టెస్టు క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. జిమ్ పార్క్స్ అనారోగ్య కారణాలతో బాధపడుతూ గత వారం ఇంగ్లండ్‌లోని వార్తింగ్ ఆసుపత్రిలో జాయిన్ అయ్యాడు. కాగా ఇవాళ ఉదయం చికిత్స తీసుకుంటూ కన్నుమూశాడని వైద్యులు తెలిపారు. జిమ్ పార్క్స్ మృతి విషయాన్ని ససెక్స్ వెల్లడించింది.
'జిమ్ పార్క్స్ మరణ వార్త మమ్మల్ని దిగ్బ్రాంతికి గురి చేసింది. తన కెరీర్‌లో కౌంటీల్లో ససెక్స్ తరపున ఎక్కువకాలం ప్రాతినిధ్యం వహించాడు. ఇంగ్లండ్ క్రికెట్‌కు అతను అందించిన సేవలు వెలకట్టలేనివి. ఆ మృతి పట్ల ప్రగాడ సానభూతి ప్రకటిస్తూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాం.' అంటూ తెలిపింది. ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) కూడా జిమ్ పార్క్స్ మృతిపై సంతాపం తెలిపింది. ''నిజంగా చాలా విషాదకరమైన వార్త. అతనో గుర్తుంచుకోదగ్గ ఆటగాడు. ససెక్స్, సోమర్‌సెట్, ఇంగ్లండ్ జట్ల తరపున ప్రాతినిధ్యం వహించడం గొప్ప విషయం. జిమ్ పార్క్స్ కుటుంబసభ్యులకు, మిత్రులకు మా ప్రగాడ సానభూతి''
ఇక జిమ్ పార్క్స్ 1954 నుంచి 1968 మధ్య కాలంలో ఇంగ్లండ్ తరపున 46 టెస్టుల్లో ప్రాతినిధ్యం వహించి 2వేలకు పైగా పరుగులు సాధించాడు. ఇందులో రెండు సెంచరీలు ఉన్నాయి. వికెట్ కీపర్ అయినప్పటికి లోయర్ ఆర్డర్‌లో ఎక్కువగా బ్యాటింగ్‌కు వచ్చే జిమ్ పార్క్ తాను చేసిన రెండు సెంచరీలు 8వ స్థానంలో రావడం విశేషం. 1959/60 ఏడాదిలో పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో 101 నాటౌట్, అలాగే అదే ఏడాది డర్బన్ వేదికగా సౌతాఫ్రికాపై 108 పరుగులు నాటౌట్‌తో జిమ్ పార్క్స్ గుర్తింపు పొందాడు.
ఇక 1931లో జన్మించిన జిమ్ పార్క్స్ 18 ఏళ్ల వయసులో ససెక్స్ తరపున కౌంటీల్లో అరంగేట్రం చేసిన పార్క్స్.. ససెక్స్, సోమర్‌సెట్ తరపున 739 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు, 132 లిస్ట్ ఏ మ్యాచ్‌లు ఆడాడు. బ్యాట్స్‌మన్‌గా తన కెరీర్‌ను ప్రారంభించినప్పటికి అప్పటి కోచ్‌ల ప్రోత్సాహంతో వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ అవతారంలోకి మారాడు. అయితే వికెట్ కీపర్ కంటే బ్యాట్స్‌మన్‌గానే తాను ఎక్కువగా ఇష్టపడతానని జిమ్ పార్క్స్ చాలా సందర్బాల్లో చెప్పుకొచ్చాడు.
చదవండి: యూకేలో సౌతాఫ్రికా క్రికెటర్‌పై దాడి.. పరిస్థితి విషమం
Comments
Please login to add a commentAdd a comment